Jump to content

ప్రభ ఛటర్జీ

వికీపీడియా నుండి
ప్రభ చటర్జీ
ప్రభ ఛటర్జీ
జననం
కేరళ
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ప్రభచటర్జీ కేరళ రాష్ట్రంలోని ఒట్టపాలెం గ్రామానికి సమీపంలో ఉన్న కుగ్రామంలో పుట్టిపెరిగింది. ఆమెకు ఆమె అక్కకు రసాయనికశాస్త్రం అంటే మక్కువ ఎక్కువ. చిన్న వయసులో వారు అత్యుత్సాహం, రసాయనిక శాస్త్రం పట్ల ఆసక్తితో వంటింటిని ప్రయోగశాలచేసే వారు. వారికి పదవతరగతిలో రసాయనికశాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలు బోధించే సమయంలో ఈక్వేషంస్‌తో సాధారణ జీవితంలో ఉదాహరణలను కూడా చేర్చి బోధించడం ఆమెకు రసాయనికశాస్త్ర అధ్యయనాసక్తిని కలిగించింది. ప్రభాచటర్జీ అక్కతో చేరి తరచుగా సమీపంలో ఉన్న రబ్బరు, సబ్బు తయారీ పరిశ్రమలకు వెళ్ళడం వారి ఆసక్తిని మరింత అధికం చేస్తుంది. ఆమెకు సహజంగా రసాయనికశాస్త్రం పట్ల ఉన్న ఆసక్తి పదవతరగతిలో ఉన్నతస్థాయిలో విజయం సాధించడానికి కారణం అయింది. ఆ ఆసక్తే ఆమె గణితం, భౌతికం, రసాయనికం ప్రధానాంశాలతో జూనియర్ కాలేలో ప్రవేశించేలా చేసింది.

జూనియర్ కాలేజి

[మార్చు]

సుదురప్రాంతంలో ఉన్న కారణంగా జూనియర్ కాలేజిలో ప్రయోగశాలలో సౌకర్యాల కొరత కొంత ఇబ్బంది పెట్టినా అంకితభావంతో పనిచేసే ఉపాధ్య్సయులు ఆకొరతను భర్తీ సేసారు. ప్రధానంగా పాఠ్యపుస్తకాలను దాటి సరికొత్త విషయవివరణలతో బోధించిన రసాయనిక శాస్త్ర అధ్యాపకుడుగా " కె.ఆర్.జె లభించడం , ఆయన రీసెర్చ్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టడం ప్రభ ఛటర్జీ పరిశోధనాసక్తిని మరింత పెంచాయి. కె.ఆర్.జె తన విద్యార్ధులకు కాలేజీలో ఉన్న లోపాలను అధిగమించడాన్ని గ్రామీణ సరిహద్దులను దాటి విఙానం మీద దృష్టి సారించడం నేర్పించాడు. కె.ఆర్.జె తన శక్తియుక్తులను ఉపయోగించి ప్రభ ఛటర్జీ సహా ఆరుగురు విద్యార్ధులను " నేషనల్ కౌంసిల్ ఫర్ ఎజ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ " (ఎన్.సి.ఇ.ఆర్.టి) నిర్వహించిన టాలెంట్ పరీక్షలకు హాజరైంది. సందేహాలను దూరంచేస్తూ ఉత్సహం అందిస్తూ టాలెంటు పరీక్షలు వ్రాయించిన కె.ఆర్.జె హాజరైన ఆరుగురు విద్యార్ధులు టాలెంటు పరీక్షలలో విజయం సాధించి " " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ " (ఐ.ఐ.ఎస్.సి) ఇంటర్‌వ్యూ కొరకు ఎన్నిక చెయ్యబడం అనందంలో మునిగితేలాడని ప్రభ ఛటర్జీ వ్రాతలు తెలియజేస్తున్నాయి. పరీక్షలకు హాజరైన మూగ్గురికి " నేషనల్ కౌంసిల్ ఫర్ ఎజ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ " స్కాలర్ షిప్పులు లభించాయి. నేషనల్ కౌంసిల్ ఫర్ ఎజ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ " స్కాలర్ షిప్పులు ప్రభ ఛటర్జీ విద్యాపయన మార్గాన్ని సుగమం చేసుంది. తరువాత పోస్ట్ గ్రాజ్యుయేషన్ ఆ తరువాత రీసెర్చ్ కొనసాగింది.

సమ్మర్ స్కూల్

[మార్చు]

ఎన్.ఎస్.టి.ఎస్ నుండి లభించిన బుక్ గ్రాంటు , ఒక సంవత్సర సమ్మర్ స్కూల్ ప్రవేశార్హత ప్రభ ఛటర్జీ సైన్స్ ఆసక్తిని బలపరించింది. బుక్ గ్రాంట్ ద్వారా రెండు క్లాసిక్ రసాయనికశాస్త్ర పుస్తకాలు లభించాయి. అవి ఇంకా ఆమె పుస్తకసంగ్రహాలలో బధ్రపరచి ఉంచబడ్డాయి. ఆహ్లాదకరగా గడిచిన సమ్మర్ క్లాసెస్ " ఐ.ఐ.ఎస్.సి, నేషనల్ కెమికల్ లైబ్రరీ ( ఎన్.సి.ఎల్), నేషనల్ ఫిజికల్ లేబరేటరీ (ఎన్.పి.ఎల్) మొదలైన విద్యాసంస్థలలో నిర్వహించబడ్డాయి. ఈ మాసకాల అధ్యయనంలో ఉదయం ఉపన్యాసాలు వినడం సాయంకాలం తరగతులలో ప్రయోగాలలో పాల్గొనడం భాగాలుగా ఉన్నాయి. ఈ శిక్షణలో ప్రొఫెసర్ ఎ.కె.ఎన్ రెడ్డి ఉపన్యసించడం ప్రత్యేకత సంతరించుకున్నది. నియమ నిబంధనలను అనుసరించడం, జర్నల్స్‌ను తిరగవెయ్యడం, ప్రయోగాలు చెయ్యడం, ఫలితాలను విశ్లేషించడం వంటి అవకాశాలు ఈ సమ్మర్ క్లాసెస్‌లో లభించాయి. 1970లో పరీక్షలు ఆలాసార్లు పోస్ట్‌పోన్మెంట్ జరిగినందున సమ్మర్ క్లాసులన్నింటికీ హాజర్ కాలాఏక పోయింది. సమ్మర్ క్లాసెస్ దేశంలోని వివిధభాగాల నుండి వచ్చిన విద్యార్థులతో కలిసి జీవించడం నేర్పగా సాయంకాలలో నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు వారితో స్నేహాలు ఏర్పరచాయి. దశాబ్ధాల అనంతరం ఆమె పరిశోధన ముగించి వృత్తిజీవితంలో స్థిరపడింది. మూలమూలలో ఉన్న దూరతీరాల విద్యార్థులలో విఙాన తృష్ణను ప్రేరేపినచడానికి " ఎన్.ఎస్.టి.ఎస్ " వంటి సేవాసంస్థలు మరిన్ని కావాలని ఆమె అభిప్రాయపడింది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.