రాణి ఎం బోర్జెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాణి ఎం బోర్జెస్
రాణి ఎం బోర్జెస్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

రాణి ఎం బోర్డెస్ చిన్నవయసు నుండి ప్రకృతి పట్ల లోతైన ఆరాధనాభావం కలిగి ఉంది. ప్రకృతి ఆమెను విపరీతంగా ఆకర్షిస్తూ వచ్చింది. వైద్యవృత్తి ప్రధానమైన కుటుంబవాయావరణంలో పెరిగినందున ఆమెకు 7 సంవత్సరంలోనే పశువైద్యం పట్ల ఆసక్తి కలిగింది. ఆమె కుటుంబం అనుమతితో పెంపుడు కూక్కను దగ్గరకు తీసి దానితో కలిసి బాల్యం సాగించింది. కుక్కను పెంచడం వలన జంతువులను గురించిన మెళుకువలు గ్రహించడం భష్యత్తులో అధ్యయనానికి, వృత్తి జీవితానికి తోడ్పడింది. ముంబయి లోని " సెయింట్ క్సేవియర్ " కాలేజిలో చదివిన రెండు సంవత్సరాల విద్య ఆమె అత్యున్నత అభ్యున్నతికి మూలంగా ఉన్నదని ఆమె అంతరాంతారాలలో విశ్వసించింది. నిత్యోత్సాహి అయిన భైతికశాస్త్ర అధ్యాపకుడైన " జహంగీర్ మిస్ట్రీ " రూపొందించిన 16 మంది విద్యార్థుల క్రియేటివిటీ గ్రూపులో ఆమెకూడా భాగస్వామ్యం వహించింది. క్రియేటివిటీ బృందంలో వైవిధ్యమైన ఆసక్తి కలిగిన వారు సమైక్యం చెయ్యబడ్డారు. అలాగే వీరంతా సమైక్యంగా ప్రయోగాలు నిర్వహిస్తూ అధ్యయనం సాగించారు. అప్పుడు స్వతంత్రమైన వాతావరణంలో సాగిన అధ్యయనం ఆసక్తికరమైన రీతిలో విద్యసాగించడానికి నేర్చుకోవడంలో ఉన్న అనందం అనుభవించేలా చేసింది. అలాగే ఆ భావం జీవితాంతం కొనసాగింది. తత్ఫలితంగా ఆమె బ్యాచిలర్ డిగ్రీలో జంతుశాస్త్రం, మైక్రోబయాలజీ ప్రధానాంశాలుగా ఎంచుకుని అదే కాలేజీలో విద్యను కొనసాగించింది.

బి.ఎస్.సి

[మార్చు]

ఆమె మీద ప్రభావం చూపి ఆమె అభ్యున్నతికి దోహదం చేసిన మరొక సంఘటన " బాంబే నేచురల్ హిస్ట్రీ సొసైటీ (బి.ఎన్.హెచ్.ఎస్) ప్రవేశంతో మొదలైంది. అమెచ్యూర్ నేచురలిస్ట్ అండ్ ది కమిటెడ్ ప్రొఫెషనల్ విద్యార్ధులకు " బాంబే నేచురల్ హిస్ట్రీ సొసైటీ " స్వర్గం లాంటింది. బి.ఎస్.సి చదివే సమయంలో బి.ఎన్.హెచ్.ఎస్ లో అండమానులో పక్షులు సేకరణలో ( బర్డ్ కలెక్షన్) లో అధ్యయనం చేసిన హుమాయూన్ అబ్దుల్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. హుమాయూన్ అబ్దుల్‌ తన సునిసిత హాస్యం మేళవించిన ప్రశ్నాస్త్రాలతో అందరినీ కలవరపస్తుంటాడని ఆమె అభిప్రాయపడింది. 70 సంవత్సరాల వయస్కుడైన హుమాయూన్ అబ్దుల్‌ వద్ద ఆమె సైంస్ గురించిన సరికొత్త విషయాలు నేర్చుకున్నది. హుమాయూన్ అబ్దుల్‌ ద్వారా ఆమె హుమాయూన్ అబ్దుల్‌ బంధువైన సలీం అలీ గిరించి తెలుసుకున్నది. తరువాత ముంబయి లోని " ఇంస్టిట్యూట్ ఆఫ్ సైన్సు " లో ఎం.ఎస్ అధ్యయనం చేస్తున్న సమయంలో రాణి బోర్జెస్ సలీం అలీ పర్యవేక్షణలో " ఎకాలజీ అండ్ ఎవల్యూహన్ " గురించి వ్రాసిన వ్యాసపరంపర ప్రాబల్యం సంతరించుకున్నాయి. హాస్యం, అభిరుచి , రాజీలేకుండా చేసే కృషితో పనిచేసే సలీం అలీ పట్ల ఆమెకు ఆరాధనా భావం కలిగింది. ఆయన పరిచయంతో రాణి బోర్జెస్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ పట్ల అభిమానం పెంచుకుని అందులో అధ్యయనం కొనసాగించాలని నిర్ణయించుకుంది. అది భారతదేశంలో కొనసాగించడం కుదరదని భావించి కోరెల్ గ్యాబుల్స్ వద్ద ఉన్న " యూనివర్శిటీ ఆఫ్ మైమి " లో చేరాలని నిశ్చయించుకున్నది.

పి.హెచ్.డి

[మార్చు]

ఫ్లోరిడాలోని గ్యాబుల్స్ వద్ద ఉన్న " యూనివర్శిటీ ఆఫ్ మైమి " నుండి రాణిబోర్జెస్‌కు మెటాంగ్ ఫెలోషిప్ అలాగే ట్రాపికల్ బయాలజీ ప్రోగ్రాంలో పనిచేయడానికి అవకాశం వచ్చింది. మైమి యూనివర్శిటీలో విద్యార్ధులు స్వయంగా రీసెర్చ్ ప్రతిపాదనలు చేసి యూనివర్శిటీ నుండి గ్రాంటులు పొందవచ్చు. అలాగే విద్యార్ధులు తాము అధ్యయనం చేసే అంశం స్వతంత్రంగా ఎంచుకోవచ్చు. వాస్థవానికి రాణిబోర్డెస్ రీసెర్చ్ గైడు టెడ్ గబ్బిలాల విభాగంలో పనిచేస్తూ ఉండేవాడు. రాణిబోర్డెస్‌కు గబ్బిలాల గురించి చదవాలన్న ఆసక్తి లేదు. టెడ్ రాణిబోర్డెస్‌కు ఆమెకు ఆసక్తి ఉన్న చెట్లు , జంతువుల మద్య ఉండే పరస్పర సంబంధం గురించి పరిశోధన చేయడానికి స్వేచ్చ కలిగించాడు. ఆమె " ఫిజియోచెమెస్ట్రీ, ఫుడ్ చాయిసెస్ ఇన్ ది హర్బివోరస్ ఇండియన్ జెయింట్ స్క్వైరల్ రాచుఫా ఇండికా " గురించి పరిశోధించడానికి స్వీయప్రతిపాదన చేసింది. ఈ పరిశోధన పొడిగించడానికి ఆమెకు " ఇంటర్నేషనల్ అఫెయిర్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ " నుండి నిరంతర నిధిసహాయం అందుతూ వచ్చింది. ఆమెకు పరిశోధనకు అవసరమైన నిధిసహాయం అందడానికి అలాగే రీసెర్చ్ తరువాత పనిచేడానికి " డేవిడ్ ఫర్గ్సన్ " ఎంతగానో సహకరించాడు.

భారతదేశంలో పరిశోధన

[మార్చు]

పరిశోధనా నిమిత్తం రెండు సంవత్సరాల కాలం భారతదేశ అరణ్యప్రాంతాలలో నివసించవలసిన అవసరం ఏర్పడింది. ఈ రెండు సంచత్సరాల సమయంలో ఆమె మగద్, ఉత్తరాఖండ్ , మహారాష్ట్రాలో ఉన్న భీమాశంకర్ ప్రంతాలలో ఆమె ఒంటరిగా నివసించవలసిన అవసరం ఏర్పడింది. ఆమె పరిశోధనకు సహాయకులను స్వయంగా ఏర్పాటు చేసుకుని వారితో స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆమె తనజీబును స్వయంగా తానే నడుపుకుంటూ పరిశోధనలను కొనసాగించింది. ఈ పరిశోధనా నిమిత్తం భారతీయ గ్రామాలను సందర్శించడం వలన గ్రామీణ జీవితం అర్ధంచేసుకోవడానికి అవకాశం కలిగింది. ఆమె జీవితంలో పరిశోధనలకు వృత్యిజీవితంలో అభివృద్ధికి ఈ రెండు సంవత్సరాలు ఎంతగానో సహకరించాయి. ఈ రెండు సంవత్సరాల సమయం ఎంతోఫలవంతమైనదని ఆమె భావించింది.

పరిశోధనానంతరం

[మార్చు]

రాణిబోర్జ్‌స్ పి.హెచ్.డి పట్టం తీసుకుని మైమి నుండి తిరిగి వచ్చిన తరువాత ఆమె జెయింటి స్క్వైరల్ గురించిన పరిశోధన కొనసాగించింది. ఈ పరిశోధన సాగించడానికి ఆమెకు డెహరాడూన్‌లో ఉన్న " వన్యప్రాణి ఇన్శ్టిట్యూటాఫ్ ఇండియా " నుండి 5 సంవత్సారాల నిధి మంజూరైంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీర్లలో ప్రఖ్యాతి వహించిన వారిలో ఒకరైన " హేమేంద్ర సింగ్ పవార్ " ఆమెకు డెహరాడూన్ ఇన్శ్టిట్యూట్‌లో సమున్నత స్థానం కల్పించాడు. అదే సమయం రాణిబోర్జ్‌స్ " బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ " లో డెఫ్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఆమెతో కలిసి పి.హెచ్.డి చేసిన సహాధ్యాయులు " ఎయిజిస్ ఆఫ్ ది దిస్ క్రాస్ - ఇష్టిట్యూషనల్ కొలాబొరేషన్ " ఆధ్వర్యంలో భీమాశంకర్ సమీపంలోని సీజనల్ క్లౌడ్ ఫారెస్ట్ వద్ద ప్లాంట్- పాలినేటర్ , జెయింట్ స్క్వైరల్ పరిశోధనలు చేపట్టారు. తరువాత ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంస్ (ఐ.ఐ.ఎస్.సి) అంతర్భాగం అయిన ఎకలాజికల్ సైంసెస్ (సి.ఇ.ఎస్) నుండి ఫ్యాకల్టీలో బాధ్యతలు స్వీకరించింది. సి.ఇ.ఎస్ ఆమెకు స్వతంత్రంగా పనిచేస్తూ సైంటిఫిక్ పరంగా అభివృద్ధి కావడానికి అత్యధికంగా తోడ్పడింది.

పరిశోధన

[మార్చు]

సి.ఇ.ఎస్ ఆమె లాబరేటరీ ఏర్పాటు చేసుకున్నది. అందులో ఇంటరాక్షన్స్ బిట్వీన్ స్పైసెస్ గురించి స్వేచ్చగా పరిశోధనలు చేపట్టింది. ఆమెకు అద్భుతమైన సహాధ్యాయులు, రీసెర్చ్ అసోసియేట్లు, విద్యార్ధులు , రీసెర్చ్ అసిస్టెంట్లు లభించడం అదృష్టమని ఆమె భావించింది. అత్యుత్సాహంతో ఆమె సాగించిన కృషి ఫలితంగా సైంటిఫిక్ సహచరులతో సరికొత్త పరిశోధనలు కొనసాగాయి. తరువాత వారు నేరుగా వర్ణాలను గుర్తించగలిగి పాలినేషన్‌కు తోడ్పాటును అందిస్తున్న సహజసిద్ధమైన " టర్నెల్ బీ " కనుగొన్నారు. తరువాత ఆడచీమ కొరకు సాలెపుగులా దారాలను తయారుచేసే చీమను కనుగొన్నారు. తరువాత " స్క్రాబ్ స్పైడర్లు పూలను అనుకరించడం " కనుగొన్నారు. తరువాత చెట్లు తమకు అనుకూలమైన అతిధులను ఆకర్షించడానికి అనుకూలంగా , ప్రతికూలమైన అతిధులను తరిమికొట్టడానికి ప్రతికూలంగా పరిమిళాలను దుర్ఘంధాలను వెదజల్లుతాయని కనుగొన్నారు. వాటిని " భాస్కరా అబ్జర్వేషంస్ టు లీలావతి " లో విజిటేషంస్ ఆఫ్ బీస్ పేరిట ప్రచురించారు.

వెలుపలి లికులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా