రేణు ఖన్నా-చోప్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేణు ఖన్నా-చోప్రా
జననంసెప్టెంబరు 24, 1949
వృత్తిమహిళా శాస్త్రవేత్త
రేణు ఖన్నా-చోప్రా

రేణు ఖన్నా - చోప్రా భారతీయ శాస్త్రవేత్త. ఢిల్లీలోని ఐసిఏఆర్ నేషనల్ ఫెలో స్ట్రెస్ ఫిజియాలజీ & బయోకెమిస్ట్రీ లాబొరేటరీ వాటర్ టెక్నాలజీ సెంటర్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్‌లో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేస్తుంది.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

1949, సెప్టెంబరు 24న ఢిల్లీలో జన్మించింది. గ్వాలియర్ లోని జివాజి విశ్వవిద్యాలయం నుండి బిఎస్సీ (మెడికల్) పట్టా, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ నుండి ఎంఎస్సీ, పిహెచ్.డి. డిగ్రీలను అందుకుంది. 1978లో అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్‌లో నీరు టెక్నాలజీ సెంటర్ విభాగంలో చేరి, పంట ఉత్పాదకతకు సంబంధించిన విభాగంలో పనిచేసింది. ఆ తరువాత ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో పనిచేసే ఆచార్య సిబి ఓస్మాండ్, డా. డిడబ్ల్యూ లాలెర్‌లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.

పరిశోధన

[మార్చు]

డాక్టర్ చోప్రా ప్రధానంగా కిరణజన్య సంయోగక్రియకు పంట మొక్కలకు మధ్యగల సంబంధం, కరువుకాలంలో మొక్క తట్టుకునే విధానంను, పంట ఉత్పాదకతపై పరిశోధన చేసింది. రిసెర్చ్ గేట్ అనే వెబ్సైటుకోసం 72 పరిశోధన వ్యాసాలు రాసింది.[1]

అవార్డులు, గౌరవాలు

[మార్చు]
 • 1965-74లో ఎన్.సి.ఈ.ఆర్.టి. (NCERT) సైన్స్ ఫెలోషిప్
 • 1978లో ఐ.ఎన్.ఎస్.ఏ. (INSA) యంగ్ సైంటిస్ట్ అవార్డ్
 • 1980-82లో హోమీ భాభా ఫెలోషిప్
 • 1983లో ఆర్.డి. అసన ఎండోమెంట్ అవార్డు
 • 1989-90లో బయోటెక్నాలజీ విదేశీ రీసెర్చ్ అసోసియేట్ షిప్
 • 1995లో ఐసిఎఆర్ నేషనల్ ఫెలో
 • 1998లో ఐ.ఎస్.సి.ఏ. (ISCA) ప్లాటినం జూబ్లీ లెక్చర్ అవార్డు
 • 1995లో ఐసిఎఆర్ అత్యుత్తమ మహిళలు సైంటిస్ట్ అవార్డ్ (మొదటి గ్రహీత)
 • 1986లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అలహాబాద్, 1992లో అగ్రికల్చరల్ సైన్స్, న్యూఢిల్లీ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫెలో

మూలాలు

[మార్చు]
 1. "Renu Khanna-Chopra - Publications". ResearchGate (in ఇంగ్లీష్). Retrieved 31 January 2020.

వెలుపలి లింకులు

[మార్చు]
 • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.