తనుశ్రీ సాహా-దాస్‌గుప్తా
తనుశ్రీ సాహా-దాస్‌గుప్తా | |
---|---|
వృత్తి | మహిళా శాస్త్రవేత్త |
తనుశ్రీ సాహా-దాస్ గుప్తా కలకత్తాలో పుట్టిపెరిగింది. ఆమె తల్లితండ్రులకు ఏకైక సంతానంగా పెరిగింది. ఆమె నివాసానికి అతి సమీపంలో ఉన్న " బాగ్‌బజార్ మల్టీపర్పస్ గవర్నమెంటు స్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది. ఆమె తండ్రి భౌతిక శాస్త్రంలో పి.హెచ్.డి పూర్తిచేసి ఉపాద్యాయవృత్తిని చేపట్టాడు. చిన్నవయసు నుండి ఆమెకు భౌతికశాస్త్రంలో పరిశోధనలు చేసి సంబంధిత వృత్తిలో కొనసాగాలన్న లక్ష్యంతో ఉంటూవచ్చింది. ఆమె కుటుంబం ఆమె ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి ప్రోత్సాహం అందించింది.
బ్యాచిలర్ డిగ్రీ
[మార్చు]అమె కొలకత్తా లోని ప్రెసిడెన్సీ కాలేజిలో బ్యాచిలర్ డిగ్రీ విధ్యాభ్యాసం కొనసాగింది. తరువాత కొలకత్తా యూనివర్శిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసింది. తరువాత రీసెర్చ్ ఇన్శ్టిట్యూట్ ఆఫ్ కొలకత్తాలో పరిశోధన ప్రారంభించింది. సంప్రదాయాలకు అత్యఫ్హికంగా ప్రాముఖ్యత ఇచ్చే ఆమె ఆమెను వెలుపలకు వెళ్ళి చదివుకోవడానికి అనుమతించలేదు. ఆ సమయంలో సహాధ్యాయి ఒకరు ఆమెను అధికంగా ప్రభావితం చేసాడు. తరువాత వెలుపలి ప్రాంతాలకు వెళ్ళి చదువుకొనడం ఆవశ్యం అని భావించింది. బెంగాలి కుటుంబాలలో వెలుపలకు పోయి ఆడపిల్లలు చదువుకొనాసాగించడం అపూర్వం కనుక తనుశ్రీ వెలుపలకు పోయి పోస్ట్ - డాక్టోరల్ విధ్యను అభ్యసించడానికి తల్లితండ్రులతో పోరాటం సలిపింది.
ప్యారిస్
[మార్చు]తరువాత తనుశ్రీ పోస్ట్ డాక్టరేట్ అధ్యయనం చెయ్యడానికి ప్యారిస్ నగరానికి వెళ్ళింది. సరికొత్త ప్రదేశంలో పరిచయస్థులు లేని సమయంలో ఒంటరిగా ఉండడానికి ఆమె చాలా ఇబ్బందికి గురైంది. అయినప్పటికీ వెనుకడుగు వెయ్యక కొత్త ప్రదేశానికి అలవాటుపడి అధ్యయనంలో దృష్టిసారించి విజయం సాధించింది. తరువాత ఆమె మాక్స్ ప్లాంక్ ఇంస్టిట్యూటుకు మారింది. అక్కడ ఆమె భర్త పోస్ట్ డాక్టొరల్ ఫెల్లో షిపి చేస్తూ ఉండేవాడు. ఆమె మాక్స్ ప్లాంక్ ఫెలో షిప్ చేస్తున్నప్పుడు గైడుగా ఉన్న ప్రొఫెసర్ ఆండర్సన్ తరువాత ఆమెకు భర్త అయ్యాడు. ఆమెకు ఆమె భర్త విద్యాధ్యయనానికి అధికంగా ప్రేరణ కలిగించాడు. తరువాత ఆమె భారతదేశం తిరిగి వచ్చింది. ఆమె ఆతరువాత " ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ " లో రీసెర్చ్ అసోసియేట్‌గా బాధ్యతలు స్వీకరించింది. కొన్నిమాసాల తరువాత ఆమెకు కొలకత్తా రీసెర్చ్ ఇంస్టిట్యూట్ నుండి పిలుపు వచ్చింది. ఆమె కుటుంబం ఆమెను భర్త ఉన్న ఊరిలో ఉద్యోగం చేయమని వత్తిడి చేసింది. అయినప్పటికీ రీసెర్చి అధ్యయనంలో ముందుకు సాగడానికి ఆమె కొలకత్తాలోనే ఉండిపోయింది. ఆమె భర్త బాంబేలో పనిచేస్తూ ఉండేవాడు. ఆమె వృత్తి ఉద్యోగాలలో సంతృప్తి కరమైన ప్రగతిని సాధించింది. స్త్రీ కుటుంబ పరిధిని దాటి సాధించాలంటే మాసికంగా శక్తివంతురాలై ఉండాలని అభిప్రాయపడింది.
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- [1][permanent dead link] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.