హేమా రామచంద్రన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేమా రామచంద్రన్
హేమా రామచంద్రన్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

హేమా రామచంద్రన్ తండ్రి శాస్త్రవేత్త, తల్లి గృహిణి. ఆమె చిన్నతనం నుండి ఆమె తండ్రి ప్రశ్నించడం, విస్తారంగా విఙానం సంపాదించడం, పుస్తకాలను అధ్యయనం చేయడం నేర్పాడు. అయినా చిన్నవయసులో విఙానార్జన, పుస్తకాలను చదవడం ఆమెకు ఆమె సోదరిడికి అసౌకర్యం కలిగించింది. చిన్నవయసు నుండి ఆమెకు శాస్త్రవేత్త కావాలని అనుకున్నది. ఆమె తల్లితండ్రులు వారిని ప్రత్యేకంగా పెంచారు. ఆమె తల్లితండ్రులు మగపిల్లలకు ఆడపిల్లలకు భేదం కాకుండా పెంచడం ఆమె అదృష్టమని ఆమె మాటలద్వారా తెలుస్తుంది. తల్లితండ్రులు ఇద్దరు పిల్లలను శాస్త్రవేత్త కావడమే లక్ష్యంగా చదవాలని సూచించారు. ఆమె తల్లితండ్రులు ఆడపిల్లగా ఆమె చేసేఏపనిని నిరోధించలేదు. సాధారణంగా డిగ్రీ పూర్తికాగానే అందరి తల్లితండ్రులలా వివాహం చేసుకొమ్మని చెప్పకుండా వారామెను పైచదువులు చదవమని ప్రోత్సహించారు. ఆమె హాస్టల్‌లో ఉంటూ చదువు పూర్తిచేసి ఉద్యోగంలో చేరింది. వివాహంచేసుకోకుండా ఉద్యోగంలో చేరినందుకు బంధువులు విమర్శిస్తున్నా ఆమె తల్లితండ్రులు వాటిని లక్ష్యపెట్టక ఆమెకు రక్షణకవచంలా నిలిచారు.

అభిప్రాయాలు[మార్చు]

హేమా రామచంద్రన్ మహిళా శాస్త్రవేత్తగా ఉండడం కష్టం కాకున్నా మహిళాశాస్త్రవేత్తగా జీవితాన్ని నిర్వహించడం శ్రమతోకూడుకున్నదని ఆఅభిప్రాయపడింది. ఆమె చదువు చాలా వరకు కోఎజ్యుకేషన్‌లో కొనసాగింది. దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరనిర్మాణం ఉన్నందున ఆమె మగపిల్లలతో క్రీడలు మొదలైనవాటిలో పోటీపడుతూ వచ్చింది. అలా ఆమె మగవారు మహిళకు సమానులే కాని అతీతం కాదని భావించింది. సాధారణంగా ఆదపిల్లలు తోటి మగపిల్లలతో మాట్లాడడానికి సిగ్గుపడుతుంటారని అందువలన మగపిల్లలకు ఆడపిల్లలకు దూరం మరింత పెరిగి కొన్ని విభిన్న అభిప్రాయాలు తలెత్తడానికి కారణం ఔతుందని భావించింది. ఈ విధానం సమాజం, సహచరులు, కుటుంబసభ్యులకు ఆడపిల్లలు అన్నింటికీ తగినవారు కాదని, అమూల్యమైనవారని, ప్రశాంతమైనవారని, ప్రత్యేకమైనవారని అభిప్రాయం ఏర్పడేలా చేస్తుందని ఆమె అభిప్రాయపడింది.

ఉన్నత పాఠశాల[మార్చు]

హేమా రామచంద్రన్ స్కూల్‌లో చదివేసమయంలో 5-6 సంవత్సరాల వయసులో కొన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సంపదించుకున్నందుకు ప్రత్యేక బహుమతులు అందుకున్నది. అప్పుడు రెండవ స్థానంలో వచ్చిన బాలుని అతని తల్లితండ్రులు " ఆడపిల్ల ప్రధమ స్థానానికి రావడానికి అనుమతించడానికి నీకు సిగ్గుగా లేదా " అని తిట్టడం గమనించింది. అప్పుడావిషయం ఆమెను బాధించకున్నా నిదానంగా సింహావలోకనం చేదినప్పుడు తల్లితండ్రులు వారి పసిబాలుర మనసులో వారు ఆడపిల్లకంటే అత్యుములన్న బిజాలు నాటుతున్నారని భావించింది. ఎంచుమించు ఇలాంటి సంఘటన మళ్ళీ బి.ఎస్.సి ముగించి ఎం.ఎస్.సిలో చేరినప్పుడు జరిగింది. హేమా రామచంద్రన్ ముంబయి ఐ.ఐ.టిలో స్థానం సంపాదించిన సమయంలో ఆమె కారణంగా ఆస్థానాన్ని కోల్పోయిన యువకుడు " నీవు ఒక యువకుడి అవకాశాన్ని పాడుచేస్తున్నావు. కేరీరు మీద సరైన లక్ష్యం ఉండనప్పుడు ఆడపిల్ల ఐ.ఐ.టిలో చదవాలని ఎందుకు అనుకుంటారో ? నీవు పూర్తిగా ఒక ఐ.ఐ.టి స్థానం వ్యర్ధం చేస్తున్నావు. ఒక యువకుడికి అది లేకుండా చేశావు " అని వ్యాఖ్యానించడం భారతీయ సమాజంలో స్త్రీపురుష భేదం పరిస్థితికి అద్దం పడుతుందని ఆమె భావించింది. అంతేకాక ముంబయి వంటి కాస్మోపాలిటన్ నగర వాతావరణంలో పెరిగిన మంచి విద్యావంతుడైన యువత అంతరంగం ఇలా ఉంటే సామాన్యుల స్థితి ఏమిటి ? ప్రశ్న ఉదయించింది.

ఉద్యోగం[మార్చు]

హేమా రామచంద్రన్ మొదటిసారిగా ముంబయి లోని " బి.ఆర్.సి "లో ఉద్యోగబాధ్యతలు చేపట్టింది. విశేషమేమిటంటే సైన్సు రంగంలో సహాధ్యుల మద్య అంతగా స్త్రీపురుష పక్షపాతం కనిపించలేదు. సహాధ్యాయులలో మూడు పురుషులు మూడు విధాలుగా ప్రవర్తించడం గమనించానని ఆమె అభిప్రాయపడుంది. తనకంటే పెద్దవారు " ఆడవారు థిసీస్ పేపర్లను ఎలా సమర్పిస్తారో " చూడాలనుకుంటారు. సమవయస్కులు " స్త్రీగా తమను తాము నిరూపించుకోవడానికి కొన్ని సమస్యలు సృష్టిస్తారు " . ఈనాటి యువతరం స్కూలు, కాలేజ్, ప్రొఫెషనల్ కోర్సెస్, ఉద్యోగాలలో మహిళల భాస్వామ్యానికి అలవాటు పడినవారు. ఇందులో ఉద్యోగంచేసే భార్యలున్నవారు మరింత అర్ధం చేసుకునే తత్వం కలిగి ఉంటారు. అలాగే వారితో సమానంగా నడుచుకుంటారు. అదృష్టవశాత్తు వీరి శాతం ప్రస్తుతం అభివృద్ధిచెందుతూ ఉందని ఆమె అభిప్రాయం.

వివాహం[మార్చు]

హేమా రామచంద్రన్ వివాహం తరువాత ముంబయిను వదలవలసిన అవసరం ఏర్పడింది. ఆమె ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలలో ఇది కొంచం కష్టమైన నిర్ణయమే. ఈ నిర్ణయం వలన అద్భుతమైన సైంటిఫిక్ బృందాన్ని వదలవలసి రావడం, పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్న సమయంలో స్థిరమైన ఉద్యోగం వదులుకోవడం మనసును కలవరేట్టే విషయమే. తరువాత విషయం ఇంటి నిర్వహణ. చాలామంది చేసినట్లు ఇంటి నిర్వహణకు ఒక స్త్రీ ఉద్యోగినిని పెట్టుకోవడం. అయినా ఆమెలు అది సరైన పద్ధతి కాదని అనిపించింది. ఎందుకంటే పిల్లలను పెంచే సమయంలో ఉద్యోగి సరిగా పనిచేయకపోతే ఇబ్బందులు ఎదురౌతాయని సన్శయించింది. చివరకు ఆమె ముంబయి, బి.ఎ.ఆర్.సి ఉద్యోగానికి రాజీనామా చేది బెంగుళూరు చేరింది.

భర్తసహకారం[మార్చు]

హేమా రామచంద్రన్ ఊహించిన విధంగా ముంబయి వదిలినా సైన్సు‌కు దూరం కాలేదు. మహిళలు దృఢమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి, స్వతంత్రంగా వ్యవహరించాలి, అలాగే స్త్రీకాని పురుషుడు కాని ఎవరైనా సరే ఎవరూ ఎవరినీ పిరికివారిని చేయలేరు అన్న వాస్తవం ఆమెకు తెలిసింది. ఆమె భర్త ఆమె కేరీర్ అభివృద్ధికి చాలా సహకరించాడు. అలాగే ఎప్పుడూ వ్యతిరేక అభిప్రాయాలు వెలిబుచ్చలేదు. ఆమె భర్తసహకారంతో ఆమె రీసెర్చిని కొనసాగించింది. ఆమె గురిబిందనూర్ వద్ద ఉన్న సెసిమాలజీలో కొంతకాలం పనిచేసింది. తరువాత రామన్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్‌లో ఆప్టికల్ సైన్ లాబ్ ఏర్పాటికై పనిచేసింది. కారణం ఏమంటే పురుషులు కూడా తమ ఉద్యోగాలను పనిచేసే ప్రదేశాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ నాటి యువత భార్యల కొరకు తమ పనులను వదిలి భార్యలు పనిచేసే ప్రదేశాలకు పోయి ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ అహిళలు ఉద్యోగజీవితంలో ఎగుడుదిగుడులను ఎదుర్కొంటూనే ఉన్నారు.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.