కుసుమ్ మరాఠే

వికీపీడియా నుండి
(కుసుం మరాతే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కుసుమ్ మరాఠే
Kusum Marathe
కుసుమ్ మరాఠే
వృత్తిమహిళా శాస్త్రవేత్త

కుసుం మరాతే1924 లో ముంబాయిలోంజన్మించింది. ఆమె తన 7 వ సంవత్సరంలో అక్కచదువుతున్న సెయింట్ కొలుంబ హైస్కూల్లో చేరింది. ఆరోజులలో ఆడపిల్లలు చాలాతక్కువగా చదువుకునేవారు. వారిలో చాలామందికి చిన్నవయసులో వివాహం కూడా ఔతూ ఉంటుంది. కుసుం మరాతే తండ్రి శంకర గంగ్లాకు విద్యంటే చాలా ఆసక్తి ఉందేది. అందువలన కుమార్తెలు ఇద్దరికీ చదువుకునే అవకాశం కలిగించాడు. స్కూలు ఆమెకు మంచి విద్యను అందించింది. స్కూలులో సైన్సు టీచర్ రసాయనిక శాస్త్రబోధన, శిక్షణ వలన ఆమెకు సైన్సు అంటే ఆసక్తి కలిగింది. ఆమెకు ఒకప్పుడు వైద్యవిద్య మీద ఆసక్తి ఉండేది. అయినప్పటికీ ఇంటర్‌మీడియట్ పూర్తిచేసి వైద్యవిద్యలో చేరేసమయానికి ఆమె వయసు తక్కువగా ఉన్నందువలన ఆమెకు వైద్యకళాశాలలో అనుమతి లభించలేదు. అందువలన ఆమె బాటనీ ప్రధానంశం రసాయనికశాస్త్రం ద్వితీయాంశంగా తీసుకుని రాయల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంసెస్ కాళాశాలలోy బి.ఎస్.సిలో పట్టం పుచ్చుకున్నది. ఆమె బాటనీలో ప్రథమస్థానంతో డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణురాలైంది. అందువలన ఆమెకు కాళాశాల యాజమాన్యం ఫెలో షిప్ అందజేసింది. అందువలన ఆమె డాక్టర్ చదవాలన్న అభిలాషను వదిలి ఎం.ఎస్.సి రీసెర్చ్ చదవడానికి నిశ్చయించుకున్నది. ఆమెకు" ప్రొఫెసర్ ఎల్లా గంజాల్వ్‌స్ " రీసెర్చ్ గైడుగా ఉన్నాడు.

ఆమె రీసెర్చ్ లో " పర్యావరణం , మహారాష్ట్ర భూవర్గీకరణ " ప్రధానాంశంగా తీసుకున్నది. రీసెర్చ్ కొరకు ఆమె వివిధ భూములనుండి మట్టిని సేకరించింది. ప్రత్యేకంగా వరిపొలాలలోని మట్టిని సేకరించింది. అలాగే ఆమె పంటపొలంలో రసాయనిక ఎరువుల ప్రభావం గురించి పరొశోధన సాగించింది. ఆమె తనపరిశోఫ్హనాశాలతో పలు వ్యాసాలను వ్రాసింది. ఈ అంశంలో ఇవి మొదటి వ్యాసాలుగా గుర్తించబడ్డాయి. ఆమె వ్యాసాలు తరచుగా ఉదహరించబడ్డాయి.

ఆమె రీసెర్చ్ పూర్తిచేసే సమయంలో ప్రొఫెసర్ గాంజాల్వ్‌స్‌కు " కమతక్ కాలేజుకు " బదిలీ అయింది. రీసెర్చ్ పూర్తిచేయడానికి ఆమె " కమతక్ కాలేజుకు " వెళ్ళి అక్కడ రీసెర్చ్ పూర్తిచేసి అక్కడే టీచర్‌గా చేరింది. ఆమె రీసెర్చ్ వ్యాసాలను విశ్వవిద్యాలయంలో సమర్పించి 1948లో పట్టా పుచ్చుకున్నది. 1950లో ఆమె బాటనీ లెక్చర్‌గా పనిచేసింది. ఆమె అదే కాలేజిలో పనిచేస్తున్న డాక్టర్ వి.బి మరాతేను వివాహం చేసుకున్నది. ధార్వార్ కర్నాటకాకు ఇచ్చిన తరువాత కుసుం మరాతే దంపతులు ముంబయికి వెళ్ళారు. మొదట ఆమె జోగేశ్వరిలో ఉన్న యూసఫ్ కాలేజ్ ఉద్యోగంలో చేరుంది. అక్కడ పరిశోధనకు తగిన వసతులు లేనందువలన తరువాత 1958లో " రాయల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంసెస్ (ఆర్.ఐ.ఎస్) ఉద్యోగం కొనసాగించింది. ఆమె రీసెర్చ్ కొనసాగించాలని అభిలషించినా ఆమెకు రీసెర్చ్ గైడు లభించలేదు. అయినప్పటికీ ఆమె లెక్చర్స్, భూసేకరణ చేస్తూనే ఉంది. తరువాత ఆర్.ఐ.ఎస్ కాలేజిలో ప్రొఫెసర్‌గా చేరిన డాక్టర్ ధ్యానసాగర్ కుసుం మరాతేకు రీసెర్చ్ గైడుగా ఉండడానికి అంగీకరించాడు. ఆమె 1968లో ఎం.ఎస్.సి, రీసెర్చ్ పూర్తిచేసింది. సరిగా మొదటిసారి ఎం.ఎస్.సి పూర్తిచేసిన 20 సంవత్సరాల తరువాత రెండవ సారి రీసెర్చ్ థీసీస్ సమర్పణ చేసింది. 1970లో నాగపూర్ ఇంస్టిట్యూట్ అఫ్ సైంసెస్ లో బాటనీ అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎన్నిక చెయ్యబడింది. అప్పటికి ఆమె భర్త అక్కడ అసోదసియేట్ జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అయన జూవాలజీ విభాగంలో ఫ్రెష్ వాటర్ ఫిష్ సెక్షన్ ఆరంభించాడు. 1980లో ప్రొఫెసర్ గా పదవోన్నతి లభించింది. 1981లో ఇన్శ్టిట్యూట్ ఏక్టింగ్ డైరెక్టర్ గా చేయబడింది. 1982లో పదవీవిరమణ చేసింది. తరువాత రీసెర్చ్ గైడుగా 7 విద్యార్థులకు మార్గదర్శకం వహించింది. డ్రైనేజ్ వాటర్ అల్గే (మురుగునీటి శైవలాలు), వరిపొలాల్లో నైట్రోజెన్ ఫిక్సింగ్ అల్గే, విత్తనాలను మొలకెత్తించడం, మొలకల పెరుగుదల మొదలైన విషయాల మీద దాదాపు 40 రీసెర్చ్ పేపర్లు ప్రచురించబడ్డాయి. ఉద్యోగం, నిర్వహణా బాధ్యతల నడుమ రీసెర్చి చేయడానికి తగినసమయం లేదని, ఆమె అభిప్రాయడింది.

వెలుపలి లింకులు

[మార్చు]