Jump to content

దర్శన్ రంగనాథన్

వికీపీడియా నుండి
దర్శన్ రంగనాథన్
దర్శన్ రంగనాథన్
జననం(1941-06-04)1941 జూన్ 4
మరణం2001 జూన్ 4(2001-06-04) (వయసు 60)
జాతీయతభారతీయుడు
రంగములుకర్బన రసాయన శాస్త్రము
వృత్తిసంస్థలుఐ.ఐ.టి - కాన్పూర్
చదువుకున్న సంస్థలుఢిల్లీ విశ్వవిద్యాలయం.
పరిశోధనా సలహాదారుడు(లు)టి,ఆర్. శేషాద్రి.
ప్రసిద్ధిATP-imidazole cycle, urea cycle, designing protein tertiary structure
ముఖ్యమైన పురస్కారాలుFellow of the Indian Academy of Sciences; Third World Academy of Sciences Award in Chemistry, 1999;[1] Senior Research Scholarship of the Royal Commission for the Exhibition of 1851, A.V. Rama Rao Foundation Award, Jawaharlal Nehru Birth Centenary Visiting Fellowship, and Sukh Dev Endowment Lectureship.

దర్శన్ రంగనాథన్ (జూన్ 4, 1941 - జూన్ 4, 2001 ) భారత దేశ ఆర్గానిక్ కెమిస్ట్రీ (కర్బన రసాయన శాస్త్రం) శాస్త్రవేత్త. ఈమె బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో సుపరిచితులు. ఈమె విశేషమైన కృషిని "ప్రోటీన్ ఫోల్డింగ్" పై చేశారు[2] ఈమె "పరమాణు పరిధిని దాటిన సమ్మేళనాలు, అణు ఆకృతులు, జీవప్రక్తియల రసాయన అనుకరణ, ఫంక్షనల్ హైబ్రిడ్ పెప్టైడ్ ల సంశ్లేషణ, , నానో ట్యూబ్స్ సంశ్లేషణ" వంటి వాటిలో గుర్తింపబడ్డారు."[3]

బాల్యం, విద్య

[మార్చు]

దర్శన్ రంగనాథన్ జూన్ 4, 1941 న విద్యావతి మరకన్ , శాంతి స్వరూప్ దంపతులకు జన్మించింది. ఈమె విద్యాబ్యాసం ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1967వ సంవత్సరంలో రసాయన శాస్త్రంలో డాక్టరేటు పట్టా పుచ్చుకున్నారు. మొదట లెక్చరర్ గా పనిచేశారు. తర్వాత ఢిల్లీ నందలి "మిరండా కాలేజి"లో రసాయన శాస్త్ర విభాగానికి ఆధిపతిగా పనిచేశారు. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ నిమిత్తం ప్రొఫెసర్ డి.హెచ్.ఆర్. బార్టన్ తో కలసి చేయుటకు యు.ఎస్. వెళ్లారు.[4]

1970లో ఐ.ఐ.టి, కాన్పూర్ (IIT Kanpur) లో పరిశోధనలు ప్రారంభించారు. ఆ సంవత్సరంలో ఆమె ఎస్. రంగనాథాన్ని వివాహమాడారు. . అదేవిధంగా "కరెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ హైలైట్స్"లో కొన్ని సవరణలు కూడా చేశారు.[4]

ఆమె ఐ.ఐ.టి కాన్పూర్ లో పరిశోధనలు ఫెలోషిప్ ఆధారంగా కొనసాగించారు. ఆమె భర్త అచట ఒక మెంబర్ అయినందున అలిఖిత నియమాలు ఆమె అధ్యాపకులు కాకుండా చేశాయి.[3][4][5]

రచనలు

[మార్చు]

ఆమె రచయితగా "ఛాలెంజింగ్ ప్రోబ్లెమ్స్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్" (1972), "ఆర్ట్ ఇన్ బయో సింథసిస్:ద సింథెటిక్ కెమిస్ట్స్ చాలంజి" (1976), "ఫర్దర్ ఛాలెంజింగ్ ప్రాబ్లెంస్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్" (1980) లను వ్రాసారు

పరిశోధనలు

[మార్చు]

ఆమె 1993 లో త్రివేండ్రం లోని రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీలో పరిశోధనలు ప్రారంభించారు. 1998 లో హైదరాబాదు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో కూడా పనిచేశారు.[3] అక్కడ ఆమె డిప్యూటీ డైరెక్టరు స్థాయికి ఎదిగారు.[2] ఈ కాలంలో ఆమె యు.ఎస్.నావల్ రీసెర్చ్ లాబొరేటరీ లోని "సాబెల్లా కర్లె"తో కలసి పరిశోధనలు నిర్వహించారు[4] దర్శన్ రంగనాథన్ 1997 లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈమె తన 60 పుట్టిన రోజున 2001 లో మరణించారు[4]

ఆమె ద్వివార్షిక రోజున "ప్రొఫెసర్ దర్శాన్ రంగనాథన్ మెమోరియల్ లెక్చర్"ను సన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశేష ప్రతిభ కనబరచిన మహిళా శాస్త్రవేత్త ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఆమె జ్ఞాపకార్థం ఆమె భర్తచే నెలకొల్పబడింది.[6]

సేవలు

[మార్చు]

రంగనాధన్ యొక్క ప్రత్యేక అభిరుచి ప్రయోగశాలలో సహజ జీవరసాయనిక ప్రక్రియలు పునరుత్పత్తి చేయటం. ఆమె "ఇమిడజోల్" యొక్క స్వతంత్ర పునరుత్పత్తి గూర్చి ఒక నియమావళిని రూపొందించారు."ఇమిడజోల్" నునది ఔషధ ప్రాముఖ్యత కలిగిన "హిస్టాడిన్", "హిస్టామిన్" యొక్క పదార్థం[7] ఆమె "యూరియా సైకిల్" యొక్క అనుకరణను అభివృద్ధిచేశారు. ఆమె కెరీర్ వృద్ధి చెందుతున్న దశలో స్వయం నిర్మిత పెప్టైడ్ల యో నానో స్ట్రక్చర్ రూపకల్పన, వివిధ ప్రోటీన్ల నిర్మాణాలను డిజైన్ చేయుటలో స్పెషలిస్ట్ గా నిలిచారు[4][8]

సూచికలు

[మార్చు]
  1. "Recipients of TWAS Awards/Prizes". Third World Academy of Sciences Portal. Archived from the original on 2012-10-18. Retrieved 2012-10-20. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. 2.0 2.1 "StreeShakti - The Parallel Force". Retrieved 2012-10-20.
  3. 3.0 3.1 3.2 S Ranganathan. "She Was a Star" (PDF). Lilavat's daughters. pp. 27–30. Retrieved 2012-10-19.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Balasubramanian, D. (25 July 2001). "Darshan Ranganathan – A tribute" (PDF). Current Science. 81 (2): 217–219. Archived from the original (PDF) on 21 ఆగస్టు 2019. Retrieved 29 ఆగస్టు 2013.
  5. Venkatraman, Vijaysree. "Book Review : Forgotten daughters". The Hindu : Literary Review. Archived from the original on 2009-04-15. Retrieved 2012-10-20.
  6. "Academy Awards - Subjectwise Medals / Lectures / Awards". Indian National Science Academy. Archived from the original on 2013-04-15. Retrieved 2012-10-20.
  7. Ranganathan, Darshan; Rathi, Ramesh (1986). "Imidazole synthesis on a solid support". Tetrahedron Letters. 27 (22): 2491–2492. doi:10.1016/S0040-4039(00)84565-7.
  8. Ranganathan, Darshan (1996). "Design and synthesis of self-assembling peptides" (PDF). Pure and Applied Chemistry. 68 (3): 671–674.
  • [ http://www.ias.ac.in/womeninscience/LD_essays/27-30.pdf] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా

వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.

ఇతర లంకెలు

[మార్చు]