ఎస్.సంధ్యామణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.సంధ్యామణి
ఎస్.సంధ్యామణి
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ఎస్.సంధ్యామణి తండ్రి పెథాలజీ డాక్టర్, తల్లి కూడా డాక్టరే. ఆమె తండ్రి 84 సంవత్సరాల వయసు వరకు మెడికల్ పరిశోధనలు కొనసాగించాడు.

ఆరంభ విద్య[మార్చు]

ఎస్.సంధ్యామణి సర్ సి.వి రామన్ ఆరంభకాల గురువైన మాస్టర్ ఎన్.సితారామయ్య వద్ద అక్షరాభ్యాసం చేయడం విశేషం. ఆమె చిన్నవయసులోనే తనతండ్రి ప్రయోగశాలలో ప్రయోగాత్మకంగా ఉన్న జంతువులను, మైక్రోస్కోపులను, ఫార్మాలియన్ వాసనలను, అలకహాల్, క్సైలేన్ వంటి అనుభవాలను రుచిచూసింది. అవి ఆమెకు ఙాపకాలుగా మిగిలిపోయి సైన్సు పట్ల ఆరాధన, ప్రేరణ కలగడానికి మూలమయ్యాయి.

రీసెర్చ్[మార్చు]

ఆమె న్యూ ఢిల్లీ లోని " ఆజాద్ మెడికల్ కాలేజ్ "లో ఎం.బి.బి.ఎస్ పూర్తిచేసింది. తరువాత ఆమె పోస్ట్ గ్రాజ్యుయేషన్ చేయడానికి పెథాలజీని ప్రధానాంశంగా ఎంచుకున్నది.న్యూఢిల్లీ లోని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్‌లో ఆమె పాథాలజీ టీచర్లు , ఆమె తండ్రి , " ఇంస్టిట్యూట్ ఆఫ్ పెథాలజీ " డైరెక్టర్ వద్ద పాఠాలు నేర్చుకోవడం ప్రత్యేకత. ఎ.ఐ.ఐ.ఎం.ఎస్‌లోని పెథాలజీ డిపార్ట్‌మెంట్‌లో రెండు సంవత్సరాల శిక్షణ తరువాత ఆమె పరిపక్వ పెథాలజిస్టుగా అయింది. సాధారణంగా జరిగేలా లెక్చర్స్ ద్వారా కాకుండా రోజువారీ కార్యక్రామాలద్వారా విషయాన్ని గ్రహిస్తూ రీసెర్చ్ కొనసాగింది. ఆమె తండ్రితో కలిసి " బెటర్ ఫ్యాట్ స్టైనింగ్ టెక్నిక్ " , మ్యూజియం స్పెసిమన్‌ల నుండి రీకాలరైజేషన్ టెక్నిక్ అభివృద్ధి చేసిన థిసీస్ మొదటి పెథాలజిస్ట్పత్రిక అయిన " వర్చ్యూస్ ఆర్కైవ్స్ " పత్రికలో ప్రచురినబడ్డాయి.

తల్లి మరణం[మార్చు]

ఎస్.సంధ్యామణి పోస్ట్గ్రాజ్యుయేషన్ ఆరంభించిన ఆరుమాసాల లోపుగా దురదృష్టవశాత్తు ఆమె తల్లి ఒక మెడికల్ విపత్తులో మరణించాడు. తల్లి మరణానికి కుంగి పోకుండా ఉండడానికి అవసరమైన సహకారం తండ్రి నుండి లభించింది. తండ్రి ఆమెకు గృహకృత్యాల నిర్వహణ గమనిస్తూనే తల్లి మరణం ఏర్పర్చిన లోటును పూడ్చడానికి డిపార్టుమెంటు పనులలో మునిగి పొమ్మని సలహా ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన స్పూర్తితో పరిశోధనలలో నిమగ్నమై వత్తిడిని దూరం చేసుకుంది.

వివాహం[మార్చు]

ఎస్.సంధ్యామణి సీనియర్ రెసిడెంట్ , ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లోని పెథాలజీ విభాగంలో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేయడం మొదలైన తరువాత తండ్రి ప్రోద్బలంతో వివాహం చేసుకుని ఢిల్లీని వదిలిపెట్టింది. ఆమె భర్త కేరళా రాష్ట్రం రాజధాని త్రివేండ్రం లోని " విక్రం సబరాని స్పేస్ సెంటర్ "లో కెమికల్ ఇంజనీరుగా పనిచేసేవాడు. తరువాత ఆమె త్రివేండ్రంలో ఉన్న " చిత్రా తిరునాల్ ఇంస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైంసెస్, టెక్నాలజీ " (ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి) లో పెథాలజీ విభాగంలో లెక్చరర్‌గా చేరింది.

రీసెర్చ్[మార్చు]

ఆరంభకాల పెథాలజిస్టులు ప్రతిపాదించిన ర్యూమాటిక్ హార్ట్ డిసీసెస్ తరువాత 50 సంవత్సరాలకాలం అభివృద్ధి చేయకుండా వదిలివేయబడింది. ఎస్.సంధ్యామణి దానిని రీసెర్చ్ ప్రధానాంశంగా తీసుకుని పరిశోధనలు కొనసాగించింది. ఎస్.సంధ్యామణికి అద్భుతమైన శిక్షణ ఇచ్చి ఆమె అభివృద్ధికి సహకరించిన ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ గత డైరెక్టర్ , పెథాలజీ డిపార్ట్‌మెంటు హెడ్ అయిన కీ.శే. డాక్టర్ హెచ్.డి. టండన్‌కు కృతఙత కలిగి ఉన్నట్లు ఆమె కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆమె కృషిని గుర్తించిన సీనియర్ పెథాలజిస్టులైన కీ.శే. డాక్టర్ కినారే, డాక్టర్.బి.ఎన్. దత్తా, డాక్టర్ ప్రేం చోప్రా, డాక్టర్ బలరాం నాయర్, కీ.శే. సి.డబల్యూ ఎం. ఆడంస్, డాక్టర్ మాల్కోం , సిల్వర్ కలు సదా కృతఙత కలిగి ఉన్నదని ఆమె కథనాల ద్వారా తెలుస్తుంది.

అంతర్జతీయ , జాతీయ గుర్తింపు[మార్చు]

1992 పదవీ విరమణ చేసిన ముంబయి కె.ఇ.ఎం హాస్పిటల్ కార్డియో వస్కులర్ , థొరాసిస్ సర్జన్ డాక్టర్ జి.బి. పరుల్కర్ ఎస్.సంధ్యామణి కృషిని వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టి ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి కారణమయ్యాడు. అక్కడ ఆమె పరిశోధనలకు ఆమెకు ఐ.యి.ఎ. బహుమతి లభించింది. దానిని అనుసరిస్తూ ఆమె స్వంత ఇంస్టిట్యూట్ నుండి ఒక అవార్డు లభించింది. ఆమె థిసీస్ పలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వాటిలో అనేకం సిగిల్ రచయిత విరచితం. న్యూ ఢిల్లీలోని డి.ఎస్.టి అడ్వైసర్ డాక్టర్. బి.జి. హరిగోపాల్ సహకారానికి ఎస్.సంధ్యామణి పరిశోధనలో భాస్వామ్యం వహించి సహకరినాడు.

విమర్శలు[మార్చు]

ఎస్.సంధ్యామణి చేపట్టిన పరిశోధనలు , అందుకు కోతిలను నమూనాగా తీసుకోవడం ఆమె ప్రొఫెషనల్ సహాధ్యాయుల మద్య సందేహం రేకెత్తించింది. అలాగే ఫెలో పెథాలజిస్టుల హేళన , విమర్శలకు గురైంది.ఈ విమర్శలను అధిగమిస్తూ జాగరూకతగా పనిచేయడం వలన పరిశోధనలలో సత్ఫలితాలు సాధించగలిగింది. అందువలన దక్షిణాఫ్రికా దేశమైన ఉగాండా పేథాలజిస్టులతో పనిచేసే అవకాశం లభించింది తరువాత ఉగాండా పిల్లలలో పోషకాహార లోపం వలన తలెత్తిన సమస్యల గురించి అధ్యయనం చేసిన డాక్టర్ జి.ఎన్.పి డేవిస్ నుండి ఒక లెటర్ అందుకున్నప్పుడు ఆమె అమితానందానికి గురైంది. అంతేకాక డాక్టర్ కుం కూపర్ ఆహ్వానం అందుకుని దక్షిణాఫ్రికాలో " బన్నీ బెకర్ మెమోరియల్ లెక్చర్ " ఇచ్చింది. 30 సంవత్సరాల అనంతరం ఇలాంటి అవకాశం అందుకున్న ఏకైక మహిళగా ఎస్.సంధ్యామణి ప్రత్యేక గుర్తింపు పొందింది.

ముగింపు[మార్చు]

ఎస్.సంధ్యామణి తండ్రి ఆమెకు ఆదర్శంగా ఉంటూ ప్రేరణ ప్రోత్సాహం ఇస్తూ చఫువులో వృత్తిలో ముందుకు సాగడానికి సహకరించాడు. అలాగే ఆమె భర్త నుండి కూడా సహకారం అందుకుని వృత్తిరీత్యా ఎదురైన సమస్యలను అధిగమించింది. ఆమె పెద్ద కుమారుడు అరవింద్ అమెరికాలో నానోటెక్నాలజీ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు మెడికల్ కాలేజిలో విద్యాధ్యయనం చేసాడు. ఆమెకు కుటునబసభ్యుల నుండి వృత్తిలో ఎదగడానికి సహకారం లభించింది. అలాగే ఆమె శ్రేయోభిలాషులు, ఎస్.సి.టి.ఎం.ఎస్.టి డైరెక్టర్లు డాక్టర్ ఎం.ఎస్. వలియనాథన్, డాక్టర్ కె. మోహన్‌దాస్ వంటి వారు ఆమెలో దాగి ఉన్న సైన్సు ఆరాధన వెలుపలి ప్రపంచానికి తీసుకురావడానికి సహకరించారు.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.