ఆరాధ్యుల కోటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆరాధ్యుల కోటేశ్వరరావు, ప్రముఖ రంగస్థల, సినిమా నటులు.

జననం[మార్చు]

కోటేశ్వరరావు 1962లో తెనాలిలో జన్మించారు. వీరి తండ్రి ఎ.వి.సుబ్బారావు, వీరి సోదరుడు ఆరాధ్యుల వెంకటేశ్వరరావులు కూడా రంగస్థల కళాకారులే.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

చిన్నతనం నుండి తన తండ్రి నాటకాలు చూస్తూ పెరిగిన కోటేశ్వరరావుకు నాటకాలపై అభిమానం పెరిగింది. విద్యార్థి దశలోనే పౌరాణిక, సాంఘిక నాటకాలలో నటించారు. 1985లో కళాశాల విద్య పూర్తి చేసి, పూర్తిస్థాయి రంగస్థల నటునిగా స్థిరపడ్డారు. వీరి నటనకు పేక్షకుల నుండి ప్రశంసలు లభించడమేకాకుండా, తెనాలిలో గల ముఖ్యమైన నటులలో ఒకరుగా గుర్తింపబడ్డారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలోనేకాక మద్రాసు కళాసాగర్ లో, బొంబాయి ఆంధ్ర మహాసభలో, ఒరిస్సాలో నాటకాలు ప్రదర్శించి, పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. 1994లో మద్రాసులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో శ్రీకృష్ణ తులాభారం నాటకం ప్రదర్శించి, ప్రశంసలు పొందారు.

1992 జూలైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంటా నిర్వహించిన రాష్ట స్థాయి నాటక పోటీలకు రాష్ట్రం నలుమూలల నుండి 172 నాటక సమాజాలవారు పాల్గొన్నారు. అందులో తెనాలి నుండి శ్రీ వెంకట లక్ష్మిదుర్గా నాట్యమండలి పేరుతో కోటేశ్వరరావు బృందం ప్రదర్శించిన కృష్ణరాయబారం నాటకం ప్రథమ బహుమతి (రూ. 30,000/-లు నగదు, పెద్ద జ్ఞాపిక, ప్రశంసాపత్రం) పొందింది.

నటించిన పాత్రలు[మార్చు]

  • శ్రీకృష్ణుడు
  • నారదుడు
  • బిల్వమంగళుడు
  • భవానీ శంకరుడు
  • అర్జునుడు
  • శ్రీరాముడు
  • తారాశశాంకంలో చంద్రుడు

సినిమా రంగం[మార్చు]

1988లో సినిమారంగానికి వెళ్లి అగ్నిసాక్షి, ఇంద్రజిత్తు, అమ్మకానికో అబ్బాయి మొదలైన సినిమాలలో నటించారు. టి.వి, రేడియోలలో కూడా పాల్గొన్నారు.

మూలాలు[మార్చు]

  • ఆరాధ్యుల కోటేశ్వరరావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, పుట. 167.