Jump to content

ఆరాధ్యుల వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
ఆరాధ్యుల వెంకటేశ్వరరావు

ఆరాధ్యుల వెంకటేశ్వరరావు ప్రముఖ రంగస్థల నటులు.

జననం

[మార్చు]

వెంకటేశ్వరరావు 1954లో అనంతవరం గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి ఏ.వి.సుబ్బారావు కూడా రంగస్థల నటులే. తండ్రి పర్యవేక్షణలో నటునిగా తీర్చిదిద్దబడ్డారు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

వెంకటేశ్వరరావు 1966 సంవత్సరంలో పాఠశాల వార్షికోత్సవ సందర్భమున శ్రీకృష్ణరాయబారం నాటకంలో కృష్ణ పాత్ర ధరించారు. తన తండ్రిగారైన తండ్రి గారైన ఏ.వి.సుబ్బారావు స్థాపించిన శ్రీ పూర్ణశ్రీ నాట్యమండలిని 1980లో స్వీకరించి, తెరలు, లైటింగ్, డ్రెస్, స్వంతంగా ఏర్పాటు చేసుకొని దాదాపు 3 వేల నాటకాలు ప్రదర్శించారు.

అమెరికాలోని అట్లాంటా, న్యాష్ విల్లీ, డేటాన్, కొలంబస్, సెయింట్ లూయిస్, డెట్రాయిట్, హ్యుస్టన్, లాస్ ఎంజెల్స్, శ్యాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, వాంట్స్ విల్లీ, పిట్స్ బర్గ్, డల్లాస్, ఫీనిక్స్ శాండియాగో, న్యూజెర్సీ, న్యూయార్క్ మొదలైన 20 రాష్ట్రాలలో పర్యటించి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలు నటించారు.

ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ వారు నిర్వహించిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1987 నుండి 1991 వరకు తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు.

నటించిన నాటకాలు - పాత్రలు

[మార్చు]
  1. శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణరాయబారం - శ్రీ కృష్ణుడు
  2. శ్రీ రామాంజనేయ యుద్ధం - శ్రీరాముడు
  3. చింతామణి - భవానీ శంకరుడు

సన్మానాలు - సత్కారాలు - బిరుదులు

[మార్చు]

1981 నుండి ఎన్నో సత్కారాలు, సన్మానాలు, బిరుదులు పొందారు. రాష్ట్రంలోనే కాకుండా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ లలో అనేక సత్కారాలు, సన్మానాలు పొందారు.

  1. ఇంగ్లండు లోని యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ఇ.టి.సి) ఆహ్వానంపై 1995 జూన్ 25న బర్మింగ్‌హామ్ నగరంలోని డెడ్లీ హాలులో జరిగిన తెలుగు మహాసభలలో కృష్ణరాయబారం నాటకంలోని శ్రీకృష్ణ పాత్రను ఏకపాత్రాభినయంగా నటించారు. ఆనాటి సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్.టి.రామారావు గారు కూడా పాల్గొన్నారు. అందులో వెంకటేశ్వరరావుకు ప్రశంసాపత్రము, జ్ఞాపిక, 40 పౌండ్ల నగదు బహుకరించారు.
  2. 1995, జూలై7న "తానా" ఆహ్వానముపై చికాగో నగరం రోజ్ మౌంట్ హాలులో జరిగిన తెలుగు మహాసభలకు వెళ్లి శ్రీ రామాంజనేయ యుద్ధంలో శ్రీ రాముని పాత్రని నటించారు. అమెరికాలోని భారత రాయబారి సిద్దార్థ శంకర్రే, వెంకటేశ్వరరావుని మెమొంటోతో సత్కరించారు. అమెరికాలో "తానా" మహాసభలలో పాల్గొనడానికి, తెనాలి నుండి వెళ్లిన మొదటి రంగస్థలనటునిగా వెంకటేశ్వరరావుగారు ప్రసిద్ధి చెందారు.
  3. 1986లో కె.వి. శివయ్య (ఐ.ఎ.యస్.) చే సువర్ణ ఘంటాకంకణం
  4. 1987లో హైదరాబాదులో టి.యస్.రావు (డి.జి.పి.) చే పట్టాభిషేకం
  5. 1987 నవంబరు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చే సత్కారం
  6. 1987లో తెనాలి లయన్స్ క్లబ్ చే సన్మానం
  7. 1991లో తెనాలి శారదా కళా సమితిచే సన్మానం

మూలాలు

[మార్చు]
  • ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 267.