ఆర్.జి.భండార్కర్
సర్ రామకృష్ణ గోపాల్ భండార్కర్ | |
---|---|
జననం | 1837 జూలై 6 |
మరణం | 1925 ఆగస్టు 24 | (వయసు 88)
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఓరియెంటల్ స్టడీస్ |
పిల్లలు | దేవదత్త రామకృష్ణ భండార్కర్ (కుమారుడు) |
సంతకం | |
సర్ రామకృష్ణ గోపాల్ భండార్కర్, (1837 జూలై 6 – 1925 ఆగష్టు 24) భారతీయ పండితుడు, ప్రాచ్యవాది, సంఘ సంస్కర్త.
ప్రారంభ జీవితం
[మార్చు]రామకృష్ణ భండార్కర్ మహారాష్ట్ర, సింధుదుర్గ్ జిల్లాలోని మాల్వాన్‌లో గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[1] రత్నగిరిలో ప్రారంభ పాఠశాల విద్య తరువాత, అతను బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో చదివాడు. అతని భార్య అన్నపూర్ణబాయి భండార్కర్ కూడా స్త్రీ విద్య, సాంఘిక దురాచారాల నుండి విముక్తి కోసం అతని గట్టి మద్దతు ఇచ్చింది. 1862 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన వారిలో భండార్కర్ తో పాటు మహాదేవ్ గోవింద్ రానడే కూడా ఉన్నాడు. అతను మరుసటి సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ పొందాడు. 1885 లో యూనివర్శిటీ ఆఫ్ గోట్టింగెన్ నుండి PhD పొందాడు [2]
కెరీర్
[మార్చు]రామకృష్ణ భండార్కర్ తన విశిష్ట ఉపాధ్యాయ వృత్తిలో ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీ, (ముంబై), డెక్కన్ కాలేజీ (పుణె) లలో బోధించాడు. అతను తన జీవితాంతం పరిశోధన, రచనలు చేశాడు. 1894లో బాంబే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పదవీ విరమణ చేశాడు. అతను లండన్ (1874), వియన్నా (1886) లలో జరిగిన ఓరియంటల్ స్టడీస్‌పై అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొని అమూల్యమైన తోడ్పాటు నందించాడు. చరిత్రకారుడు RS శర్మ అతని గురించి ఇలా వ్రాశాడు: "అతను దక్కన్‌లోని శాతవాహనుల రాజకీయ చరిత్రను, వైష్ణవం, ఇతర శాఖల చరిత్రనూ పునర్నిర్మించాడు. గొప్ప సంఘ సంస్కర్త, తన పరిశోధనల ద్వారా వితంతు వివాహాలను సమర్థించాడు. కుల వ్యవస్థను, బాల్య వివాహాలనూ దునుమాడాడు."[3]
విద్యావేత్తగా, అతను 1903లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు అనధికారిక సభ్యునిగా ఎన్నికయ్యాడు. [4] 1911లో భండార్కర్‌కు భారతదేశంలోని బ్రిటిష్ వలస ప్రభుత్వం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ బిరుదును ప్రదానం చేసింది.[5]
సంఘ సంస్కరణ
[మార్చు]భండార్కర్ విద్యార్థిగా ఉన్నప్పుడు, 1853 లో, సమకాలీన సమాజంలోని శక్తివంతమైన సనాతన అంశాల ఆగ్రహానికి గురికాకుండా, రహస్యంగా, ఉదారవాద ఆలోచనలను పెంపొందించేందుకు ఉద్దేశించిన పరమహంస సభలో సభ్యుడయ్యాడు.[6] 1864 లో కేశవ చంద్ర సేన్ ఈ సభను సందర్శించడం సభ్యులకు స్ఫూర్తినిచ్చింది.
ప్రార్థనా సమాజం
[మార్చు]1866 లో కొంతమంది సభ్యులు ఆత్మారామ్ పాండురంగ్ ఇంటిలో ఒక సమావేశాన్ని నిర్వహించి, కొన్ని సంస్కరణలకు మద్దతుగా బహిరంగంగా ప్రతిజ్ఞ చేశారు, వాటిలో కిందివి ఉన్నాయి:
- కుల వ్యవస్థ నిర్మూలన
- వితంతు పునర్వివాహానికి ప్రోత్సాహం
- స్త్రీ విద్యకు ప్రోత్సాహం
- బాల్య వివాహాల రద్దు
సామాజిక సంస్కరణలకు ప్రాతిపదికగా మతపరమైన సంస్కరణలు అవసరమని సభ్యులు తీర్మానించారు. వారు 1867 మార్చి 31 న తమ మొదటి ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించారు. ఇదే తదనంతరం ప్రార్థన సమాజం ఏర్పాటుకు దారితీసింది. కేశవ చంద్ర సేన్ మరొకసారి సందర్శించడం, పంజాబ్ బ్రహ్మ సమాజ్ వ్యవస్థాపకుడు ప్రతాప్ చంద్ర మోజూందార్, నవీన చంద్ర రాయ్ ల సందర్శనలతో వారి ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
బాలికల విద్య
[మార్చు]1885లో, భండార్కర్ ప్రముఖ సంఘ సంస్కర్తలు వామన్ అబాజీ మోదక్, జస్టిస్ రనడేతో కలిసి మహారాష్ట్ర గర్ల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ (MGE)ని స్థాపించారు. [7] పుణెలో హుజుర్‌పాగాగా ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి స్థానికంగా నిర్వహించబడుతున్న బాలికల ఉన్నత పాఠశాలలు మాతృ సంస్థ ఈ సొసైటీ.[8][9] పాఠశాల స్థాపించబడినప్పటి నుండి ఇక్కడి పాఠ్యాంశాలలో ఆంగ్ల సాహిత్యం, అంకగణితం, సైన్స్ వంటి అంశాలు ఉన్నాయి.[10] పాఠశాల స్థాపననూ, దాని పాఠ్యాంశాలనూ జాతీయవాద నాయకుడు లోకమాన్య తిలక్ తన వార్తాపత్రికలైన మరాఠా, కేసరిలలో తీవ్రంగా వ్యతిరేకించాడు.[11][12]
మూలాలు
[మార్చు]- ↑ P. R. Dubhashi (2000). Building up a new university. p. 45.
The Saraswat Samaj has been traditionally cosmopolitan. It has produced great people like Ramakrishna Bhandarkar after whom the Bhandarkar Research Institute of Oriental Studies of Poona has been named
- ↑ "Ramkrishna Gopal Bhandarkar - orientalist par excellence". The Times of India. 12 July 2003.
- ↑ Sharma, R.S. (2009). Rethinking India's Past. Oxford University Press. ISBN 978-0-19-569787-2.
- ↑ "India- Governor General Council". Parliamentary Debates (Hansard). 21 July 1908. Retrieved 5 April 2011.
- ↑ Tikekar, Aroon and Tikekara, Aruna (2006), The Cloister's Pale: A Biography of the University of Mumbai, page 27, Popular Prakashan, Mumbai, India
- ↑ "Ramkrishna Gopal Bhandarkar - orientalist par excellence". The Times of India. 12 July 2003.
- ↑ Ghurye, G. S. (1954). Social Change in Maharashtra, II. Sociological Bulletin, page 51.
- ↑ Bhattacharya, Sabyasachi, ed. (2002). Education and the disprivileged : nineteenth and twentieth century India (1. publ. ed.). Hyderabad: Orient Longman. p. 239. ISBN 978-8125021926. Retrieved 12 September 2016.
- ↑ "Huzurpaga". Huzurpaga.
- ↑ Bhattacharya, Sabyasachi, ed. (2002). Education and the disprivileged : nineteenth and twentieth century India (1. publ. ed.). Hyderabad: Orient Longman. p. 240. ISBN 978-8125021926. Retrieved 12 September 2016.
- ↑ Rao, P.V., 2008. Women's Education and the Nationalist Response in Western India: Part II–Higher Education. Indian Journal of Gender Studies, 15(1), pp.141-148.
- ↑ Rao, P.V., 2007. Women's Education and the Nationalist Response in Western India: Part I-Basic Education. Indian Journal of Gender Studies, 14(2), p.307.