Jump to content

సూర్యకిరణ్

వికీపీడియా నుండి
(ఆర్. సూర్యకిరణ్ నుండి దారిమార్పు చెందింది)
సూర్యకిరణ్
జననం
సూర్యకిరణ్

(1974-09-06)1974 సెప్టెంబరు 6
మరణం2024 మార్చి 11(2024-03-11) (వయసు 51)
చెన్నై
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2003 - 2024
జీవిత భాగస్వామికళ్యాణి (విడిపోయారు)
బంధువులుసుజిత (సోదరి)

సూర్యకిరణ్ ఇలాది (1972 ఆగస్టు 13 - 2024 మార్చి 11) తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత.[1][2]2002లో వచ్చిన సత్యం చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. సూర్యకిరణ్ సోదరి సుజిత కూడా నటి. ఇతను సినీనటి కల్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత వ్యక్తిగత కారణాల వలన ఈ జంట విడిపోయింది.[3]

జీవితం

[మార్చు]

సూర్యకిరణ్ ఆగష్టు 9న టి. ఎస్. మణి, రాధ దంపతులకు చెన్నైలో జన్మించాడు. వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. సూర్య కిరణ్ మాస్టర్ సురేష్ పేరుతో సుమారు 200 దాకా చిత్రాలలో బాలనటుడిగా కనిపించాడు. తర్వాత పలు చిత్రాలలో నహాయనటుడిగా నటించాడు.

సూర్యకిరణ్ నటి కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి కొన్ని చిత్రాలలో నటించింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరూ విడిపోయారు.[3]

సినిమారంగం

[మార్చు]

మలయాళంలో తన సినిమా కెరీర్ ను ప్రారంభించి, మాస్టర్ సురేష్ పేరుతో బాలనటుడిగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషలలో 200 చిత్రాలకు పైగా నటించి ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన సత్యం ఇతనికి మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్-6 చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

దర్శకత్వం వహించిన చిత్రాలు

[మార్చు]
  1. నీలిమలై (2017)
  2. చాప్టర్ 6 (2010)
  3. రాజు భాయ్ (2007)
  4. బ్రహ్మాస్తం (2006)
  5. ధన 51 (2005)
  6. సత్యం (2003)

మరణం

[మార్చు]

సూర్యకిరణ్‌ అనారోగ్యంతో బాధపడుతూ మార్చి 11, 2024న చెన్నైలో మరణించాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "సూర్యకిరణ్". telugu.filmibeat.com. Retrieved 23 June 2018.
  2. "DIRECTOR TO BECOME HERO?". Archived from the original on 2017-12-28. Retrieved 2018-06-24.
  3. 3.0 3.1 "Bigg Boss fame Suryakiran: Unknown facts about the director". thehansindia.com. 13 September 2020. Archived from the original on 22 August 2023. Retrieved 16 September 2020.
  4. Eenadu (11 March 2024). "'సత్యం' దర్శకుడు సూర్యకిరణ్‌ కన్నుమూత". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
  5. Chitrajyothy (11 March 2024). "సత్యం దర్శకుడు సూర్యకిరణ్‌ ఇకలేరు! | Director Surya kiran is no more avm". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.

ఇతర లంకెలు

[మార్చు]