సుజిత
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సుజిత | |
---|---|
జననం | సుజిత 1983 జూలై 12[1] |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1983–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ధనుష్ |
తల్లిదండ్రులు | టి.ఎస్. మణి (నాన్న) రాధ (అమ్మ) |
బంధువులు | దర్శకుడు సూర్యకిరణ్ - (అన్న) నటి కల్యాణి - (వదిన) |
సుజిత ఒక దక్షిణ భారత సినీ, టీవీ నటి.[3] తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో, టీవీ సీరియళ్ళలో నటించింది.
ఈమె అన్న సూర్యకిరణ్ సినీ దర్శకుడు. ఇతను తెలుగులో సుమంత్ హీరోగా సత్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. నటి కల్యాణి ని వివాహం చేసుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]సుజిత కేరళ లోని తిరువనంతపురం లో టి.ఎస్. మణి, రాధ దంపతులకు జన్మించింది.[4] ఆమెకు ఒక అన్న, ఒక చెల్లెలు ఉన్నారు.[1] అన్న సూర్యకిరణ్ సినీ దర్శకుడు నటి కల్యాణి ని వివాహం చేసుకున్నాడు.[5]
ప్రకటనలు రూపొందించే ధనుష్ తో ఆమె వివాహం జరిగింది. వారు పొల్లాచ్చిలో స్థిరపడ్డారు.[2] వారికి ఒకరు సంతానం.[6]
నటించిన సినిమాలు
[మార్చు]సుజిత పసివాడి ప్రాణం సినిమాలో మాట్లాడలేని, వినలేని అబ్బాయి గా నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా కథ మొత్తం ఈ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. తరువాత ముద్దుబిడ్డ సినిమాలో కృష్ణ, రజనీ లా కొడుకు గా నటించారు. గణేష్ సినిమాలో వెంకటేష్ చెల్లెలుగా నటించింది. ఈ సినిమాలో ఆమెది ముఖ్యమైన పాత్ర. జై చిరంజీవ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటించింది.[7]
సినిమాల పాక్షిక జాబితా
[మార్చు]- పసివాడి ప్రాణం
- ముద్దుబిడ్డ
- మా ఇంటి కృష్ణుడు (1990)
- గణేష్
- వాలి (1999)
- ఆజాద్
- జై చిరంజీవ
- కణం
సీరియళ్ళు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "An exclusive interview with the Golden Girl of Chinnathirai , Sujitha". nilacharal.com. Retrieved February 21, 2015.
- ↑ 2.0 2.1 "Sujitha". nettv4u.com. Archived from the original on 2015-02-21. Retrieved February 21, 2015.
- ↑ "సుజిత కుటుంబం, ప్రొఫైలు". celebritykick.com. Retrieved 19 September 2016.
- ↑ "ഓര്മ വെച്ച നാള് മുതല്". mathrubhumi.com. Archived from the original on 19 జనవరి 2014. Retrieved 14 December 2013.
- ↑ "Sujitha Profile". whataboutu.com. Archived from the original on 10 జూన్ 2013. Retrieved 22 November 2012.
- ↑ "Family members". celebritykick.com. Retrieved February 21, 2015.
- ↑ "jaichiranjeeva Review". idlebrain.com. Retrieved 22 November 2012.