ఆల్మోరా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆల్మోరా
अल्मोड़ा
పర్వత ప్రాంతము
ఆల్మోరా is located in Uttarakhand
ఆల్మోరా
Location in Uttarakhand, India
Coordinates: 29°37′N 79°40′E / 29.62°N 79.67°E / 29.62; 79.67Coordinates: 29°37′N 79°40′E / 29.62°N 79.67°E / 29.62; 79.67
దేశము మూస:Country data భారత దేశము
రాష్ట్రము ఉత్తరాఖ్ండ్
జిల్లా అల్మోరా
Elevation  m ( ft)
Population (2011)
 • Total 1
భాషలు
 • అధికార భాష హిందీ
Time zone IST (UTC+5:30)
పిన్‌కోడ్ 263601
దూరవాణి కోడ్ 91-5962
Vehicle registration UK-01
లింగ నిష్పత్తి 1142 /
Climate Alpine (BSh) and Humid subtropical(Bsh) (Köppen)
Avg. annual temperature −3–28 °C (27–82 °F)
Avg. summer temperature 12–28 °C (54–82 °F)
Avg. winter temperature −3–15 °C (27–59 °F)
Website almora.nic.in

అల్మోర కుమావొన్ ప్రాంతం లో ఎత్తైన ప్రదేశం లో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషను. 5 కి. మీ. ల పరిధి గల ఈ ప్రదేశం సూయల్ నది మరియు కోసి నది మధ్య కలదు. ఈ హిల్ స్టేషను సముద్ర మట్టానికి 1651 మీ. ల ఎత్తున వుంది చుట్టూ అందమైన పచ్చని అడవులు కలిగి వుంటుంది. క్రి. శ. 15 మరియు 16 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని చాంద్ మరియు కాత్యూర్ వంశాలు పరి పాలించాయి.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

పర్యాటక ఆకర్షణ ప్రదేశాలలో మంచు తో నిండిన హిమాలయ శిఖరాలను అల్మోర కొండల నుండి చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది.ఇక్కడ కాసర్ దేవి ఆలయం, నందా దేవి ఆలయం, చితి ఆలయం, కాతర్మాల్ సూర్య ఆలయం మొదలైనవి ఇక్కడ కల కొన్ని మత సంబంధిత క్షేత్రాలు.

నందాదేవి ఆలయం[మార్చు]

ఇక్కడ ఉన్న ప్రాచీనమైన నందా దేవి ఆలయం ముఖ్యమైనది. ఈ ఆలయం కుమావొనీ శిల్ప శైలి లో నిర్మించబడింది. ఈ ఆలయం లోని దేవతను చంద్రవంశ రాజులు పూజించారని విశ్వసిస్తున్నారు. ప్రతి సంవత్సరం భక్తులతో దేవాలయం కిట కిట లాడుతుంది.

కాసర్ దేవి ఆలయం[మార్చు]

అల్మోరాలో కాసర్ దేవి ఆలయం కూడా అల్మోరా కు 5 కి.మీ.ల దూరం లో కలదు. ఈ ఆలయాన్ని 2 వ శతాబ్దం లో నిర్మించారు. స్వామి వివేకానందుడు తన తపస్సు ను ఇక్కడ చేసారని విశ్వసించబడుతుంది.

సూర్యాస్తమయం మరియు సూర్యోదయం[మార్చు]

పర్యాటకులు ఇక్కడ అందమైన సూర్యోదయ మరియు సూర్యాస్తమయ దృశ్యాలు బ్రైట్ ఎండ్ కార్నర్ నుండి చూడవచ్చు. సిమ్టోల మరియు మర్టోల ప్రదేశాలు పిక్నిక్ కు బాగుంటాయి.

జింకలపార్కు[మార్చు]

అల్మోరా పట్టణం నుండి 3 కి. మీ.ల దూరం లో జింకల పార్కు ఉంది. ఇందులో!అనేక లేళ్ళు, చిరుతలు హిమాలయ నల్ల ఎలుగుబంటి వంటివి ఉన్నాయి.

సింటోలా[మార్చు]

అల్మోరా కు 3 కి.మీ.ల దూరంలో సింటోలా ఉంది. సింటోలా అనేది గ్రానైట్ హిల్ మరియు డైమండ్ మైనింగ్ సెంటర్. ఇక్కడి నుండి సుందరమైన పైన్ మరియు దేవదార్ చెట్లతో కూడిన పర్వత శ్రేణులను చూడవచ్చు. అల్మోరా లోని పర్యాటకాకర్షణ ప్రాంతాలలోఇది ఒకటి. ఇది హార్స్ షూ రిజ్ కు ఎదురు భాగంలో వుంటుంది.

పర్వతారోహణ[మార్చు]

ఉత్తారాంచల్ రాష్ట్రంలోని పలు పట్టణాలలో ఉన్నట్లు ణ అల్మోరాలో కూడా పర్వతారోహణ ( ట్రెక్కింగ్) ఒక పర్యాటాకార్షణగా ఊంది. అల్మోరా నుండి సుమారు 5 కి.మీ.ల దూరంలో అల్మోర పర్వత శ్రేణుల దృశ్యాలు కనపడతాయి. అల్మోర నుండి జగేస్వర్‌కు చక్కని మార్గం ఉంది. కుమావొనీ గ్రామాల మీదుగా ఈ మార్గంలో పర్వతారోహకులు పయనిస్తుంటారు. ఈ పర్వతమార్గంలో జగేశ్వర్ ఆలయసమూహం మరియు వ్రిద్ జగేశ్వర్‌ ఆలయాలు ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ నుండి కాసర్ దేవి టెంపుల్‌కు కూడా వెళ్ళవచ్చు. పర్వతారోహణకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలం. సాహసికులకు పిండారీ పర్వతమార్గం అనుకూలమైనది. ఈ మార్గం సుందరమైన అడవులు మరియు లోయల గుండా వెళుతుంది. నంద దేవి మరియు నందాకోట్ పర్వతాల మధ్య పిండారీ గ్లేసియర్ ఉంది.

లాల్ బజార్[మార్చు]

అల్మోర లో ఉన్న లాల్ బజార్ ఒక షాపింగ్ ప్రాంతం. రుచికరమైన స్వీట్‌లు మరియు అనేక అలంకరణ వస్తువులూ ఇక్కడ అనుకూలమైన ధరలలో లభ్యమౌతాయి. ఇక్కడ కుందేలు చర్మంతో తయారు చేయబడి వెచ్చగా వుండే చక్కని దుస్తులు లభ్యమౌతాయి.

మర్టోలా[మార్చు]

అల్మోరా కు 10 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక విహార ప్రదేశం మర్టోలా. ఇక్కడ పచ్చని అడవులు మరియు తోటలు ఉన్నాయి. ఇక్కడ అనేక మంది విదేశీయులు తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. ఈ ప్రదేశానికి పనువనౌళ నుండి కాలి నడకన చేరాలి.

గోవింద వల్లభపంత్ శాంక్చ్యురీ మరియు మ్యూజియం[మార్చు]

అల్మోరాలో గోవింద్ వల్లభ పంత్ మ్యూజియం, బిన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ (వన్యప్రాణుల అభయారణ్యం) ఉంది. ఇక్కడ పర్వతారోహణ మరియు మౌంటెన్ బైకింగ్ పర్యాటకులను ఆనందపరుస్తుంటాయి. ఈ మ్యూజియం అల్మోర లోని మాల్ రోడ్ లో ఉంది. దీనిలో ఈ ప్రాంత సంస్కృతి, చరిత్ర, కు సంబంధిన వస్తువులు, పురావస్తు వస్తువులు ప్రదర్శిస్తారు. కత్యూరి, చాంద్ వంస్తులకు చెందిన విలువైన వస్తువులు కూడా ఇక్కడ కలవు. పురాతన పెయింటింగ్ లు కూడా చూడవచ్చు. ఈ మ్యూజియం ఉ.10.30 గం నుండి సా.4.30 గం వరకు తెరచి వుంటుంది.

జింకలపార్క్[మార్చు]

అల్మోరా లోని ప్రధాన ఆకర్షణ అయిన డీర్ పార్క్ అల్మోర కు 3 కి.మీ.ల దూరంలో ఉంది. అంతేకాక ఇక్కడ నారాయణ్ తివారి దేవి ఆలయం కూడా ఉంది. దీని చుట్టూ పైన్ చెట్లు ఉంటాయి. పర్యాటకులు ఇక్కడ డీర్, చిరుత, హిమాలయ నల్ల ఎలుగుబంటులను చూడవచ్చు. సాయంత్రాలు విశ్రాంతి నడకలు చేయవచ్చు.

బ్రైట్ ఎండ్ కార్నర్[మార్చు]

బ్రైట్ ఎండ్ కార్నర్ అనే సుందర ప్రదేశం అల్మోరకు 2 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ నుండి మంచు శిఖరాల మధ్య జరిగే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆనందించవచ్చు. చంద్రోదయం కూడా ఆనందించవచ్చు. ఈ ప్రదేశానికి లార్డ్ బ్రిటన్ పేరు పెట్టారు. ఇక్కడ మాల్ రోడ్ మొదలవుతుంది. ఇక్కడే శ్రీ రామకృష్ణ కుటీర్ ఆశ్రమం కలదు. ఇక్కడకు ధ్యానం కొరకు ఏప్రిల్ నుండి జూన్ మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకూ వద్తుంటారు. ఇక్కడ వివేకానంద గ్రంధాలయం మరియు ఒక మెమోరియల్ కూడా ఉన్నాయి. హిమాలయ పర్యటనలో స్వామి వివేకానంద ఈ ప్రదేశంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.

బిన్సార్ వన్యమృగ అభయారణ్యం[మార్చు]

బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి అల్మోర టవున్ కు 30 కి.మీ.ల దూరంలో ఉంది.. ఈ అభయారణ్యం సముద్ర మట్టానికి 900 నుండి 2500 మీ.ల ఎత్తున 45.59 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. ఎన్నో రకాల జంతువులకు ఇది సహజ నివాసంగా వుంది. దీనిలో 200 రకాల పక్షులు, మరియు వివిధ జాతుల మొక్కలు కూడా కూడా ఉన్నాయి.

ప్రయాణ వసతులు[మార్చు]

ఈ ప్రదేశానికి వాయు, రైలు, రోడ్ మార్గాలలో తేలికగా చేరవచ్చు. పంత్ నగర్ ఎయిర్ పోర్ట్, కతోగోడం రైల్వే స్టేషను అల్మోర కు సమీపం. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆల్మోరా&oldid=1672068" నుండి వెలికితీశారు