ఆళ్ల రామకృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆళ్ల రామకృష్ణా రెడ్డి
ఆళ్ల రామకృష్ణారెడ్డి


శాసన సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 నుండి ప్రస్తుతం
నియోజకవర్గం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1974
పెదకాకాని, గుంటూరు జిల్లా
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ఆళ్ల రమా
బంధువులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
సంతానం 3
వృత్తి రాజకీయ నాయకుడు

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 & 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం & గ్రామంలో1968లో దశరధరామిరెడ్డి,[1] వీరరాఘవమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన గుంటూరు ఎసి కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆయనకు సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయనకు 2019 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేశ్ పై 5337 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]ఆయన జూన్ 2019లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ)కు ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (3 September 2020). "ఎమ్మెల్యే ఆర్కేకు పితృ వియోగం". Sakshi. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  2. India Today (2019). "Andhra Assembly polls: TDP's Nara Lokesh loses to YSR Congress's Ramakrishna Reddy" (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-06. Retrieved 6 July 2021.
  3. Mana Telangana (14 June 2019). "సిఆర్‌డిఎ చైర్మన్ గా ఆళ్ల రామకృష్ణారెడ్డి". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.