Jump to content

ఆశిష్ షెలార్

వికీపీడియా నుండి
ఆశిష్ షెలార్
ఆశిష్ షెలార్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 డిసెంబరు 15
గవర్నరు సీ.పీ. రాధాకృష్ణన్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు బాబా సిద్దిఖీ
నియోజకవర్గం వాండ్రే వెస్ట్

పదవీ కాలం
2012 జూలై 28 – 2014 అక్టోబర్ 27
తరువాత మహదేవ్ జంకర్
నియోజకవర్గం శాసనసభ్యుల కోటా

పదవీ కాలం
2019 జూన్ 16 – 2019 నవంబర్ 12
ముందు వినోద్ తావ్డే
తరువాత వర్ష గైక్వాడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1972-10-03) 1972 అక్టోబరు 3 (వయసు 52)
సింధుదుర్గ్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రతిమా షెలార్
సంతానం ఓంకార్ షెలార్
పూర్వ విద్యార్థి G.J అద్వానీ కాలేజ్ ముంబై (ఎల్‌ఎల్‌బీ)
యూనివర్సిటీ ఆఫ్ ముంబై
వృత్తి రాజకీయ నాయకుడు

ఆశిష్ షెలార్ (జననం 3 అక్టోబర్ 1972) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వాండ్రే వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 డిసెంబరు 15న మూడో ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆశిష్ షెలార్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాండ్రే వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బాబా సిద్దిఖీ చేతిలో 1,691 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన 2012లో మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2012 జూలై 28 నుండి 2014 అక్టోబర్ 27 వరకు ఎమ్మెల్సీగా పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బాబా సిద్దిఖీపై 26,911 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

ఆశిష్ షెలార్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వాండ్రే వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బాబా సిద్దిఖీపై 26,507 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా[4] ఎన్నికై 2019 జూన్ 16 నుండి 2019 నవంబర్ 12 వరకు పాఠశాల విద్యా శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆసిఫ్ జకారియాపై 19,931 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[5] 2024 డిసెంబరు 15న మూడో ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[6][7][8]


మూలాలు

[మార్చు]
  1. "Maharashtra portfolios: Fadnavis keeps Home, Shinde Urban Development; Ajit gets Finance" (in Indian English). The Hindu. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  7. "Maharashtra portfolio allocation: CM Fadnavis keeps home ministry, Ajit Pawar gets finance, Shinde gets urban development". The Times of India. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  8. "Fadnavis retains Home, Ajit Finance, Shinde gets Urban, Works, and Housing" (in ఇంగ్లీష్). The Indian Express. 22 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.