Jump to content

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భాగల్పూర్

అక్షాంశ రేఖాంశాలు: 25°15′19″N 87°02′34″E / 25.2553°N 87.0428°E / 25.2553; 87.0428
వికీపీడియా నుండి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భాగల్పూర్
నినాదంచారిత్ర్యం మమ జీవనమ్
రకంప్రజా
స్థాపితం2017
డైరక్టరుప్రొ. అరవింద్ చౌబే
అండర్ గ్రాడ్యుయేట్లు300+
పోస్టు గ్రాడ్యుయేట్లు50+
స్థానంభాగల్పూర్, బీహార్, భారతదేశం
25°15′19″N 87°02′34″E / 25.2553°N 87.0428°E / 25.2553; 87.0428
కాంపస్పట్టణ
సంక్షిప్త నామముఐఐఐటీ భాగల్పూర్, ట్రిపుల్ ఐటీ భాగల్పూర్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భాగల్పూర్ (ఐఐఐటీ భాగల్పూర్, ట్రిపుల్ ఐటీ భాగల్పూర్) అనేది బీహార్ రాష్ట్రంలోని ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం. విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనా క్రింద స్థాపించబడింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు, 2020 ప్రకారం భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను పొందింది. 2020 మార్చి 20న లోక్‌సభలో, 2020 సెప్టెంబరు 22 రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది.[1][2] భాగల్‌పూర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోని 50 ఎకరాల ప్రాంగణంలో 2017 జూలై నుండి ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది.[3] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ద్వారా 2019 ఏప్రిల్ వరకు దాని స్వంత డైరెక్టర్‌ను పొందే వరకు మెంటార్‌గా ఉంది.[4]

చరిత్ర

[మార్చు]

భారత ప్రభుత్వం 2010లో వివిధ రాష్ట్రాల్లో కొత్త ఐఐఐటీ కళాశాలలను స్థాపించాలని నిర్ణయించుకుంది.[5] 2012 మార్చి 14న నేషనల్ స్క్రీనింగ్ కమిటీకి రెండవ సమావేశంలో, బీహార్ ప్రభుత్వాన్ని వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక కోసం కోరింది.[6] ఐఐఐటీ భాగల్పూర్ ప్రతిపాదనను 2016 సెప్టెంబరు 2న నేషనల్ స్క్రీనింగ్ కమిటీ ఆమోదించింది.

పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన ఐఐఐటీ భాగల్పూర్ ఏర్పాటు చేయబడింది. యాభై శాతం వాటాను భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ముప్పై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం, మిగిలినది పరిశ్రమ భాగస్వామి బెల్ట్రాన్ చేతిలో ఉంది.[5] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి సంస్థ ఐఐఐటీ భాగల్పూర్ మెంటర్ ఇన్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది.[7]

చిహ్నం

[మార్చు]

ఐఐటీ గౌహతిలోని డిజైన్ డిపార్ట్‌మెంట్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన డిజైనర్ మోహిజీత్ దాస్ ఐఐఐటీ భాగల్పూర్‌ లోగోను రూపొందించాడు. వికారమశిల మహావిద్యాలయం, భాగల్‌పురి చీర వంటి కొన్నింటి నుండి ప్రేరణ పొంది ఈ లోగో రూపొందించబడింది.[8]

ప్రాంగణం

[మార్చు]

ఐఐఐటీ భాగల్పూర్ శాశ్వత ప్రాంగణం కోసం భాగల్పూర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సమీపంలోని 50 ఎకరాలు (20 హె.) భూమిని,[5] ఐఐఐటీ నిర్మాణంకోసం 128.53 కోట్ల రూపాయలు కేటాయించబడింది.[6] 2021 అక్టోబరు 7న శాశ్వత ప్రాంగణ నిర్మాణం ప్రారంభమయింది.[9] భూకంపాలు, వరదలను తట్టుకునేలా ఈ ఐఐఐటీ భవనం నిర్మించబడుతోంది.[6] రాష్ట్ర ప్రభుత్వం మొదట నలంద జిల్లాలోని చండీ బ్లాక్‌లోని 100 ఎకరాలు (40 హె.) భూమిని గుర్తించింది, భూ యజమానుల నిరసనల కారణంగా భూ సేకరణకు ముందుకు వెళ్ళలేకపోయింది.[5]

తాత్కాలిక ప్రాంగణం

[మార్చు]

ఈ సంస్థకు సంబంధించిన విద్యాసంస్థలు ప్రస్తుతం తాత్కాలిక భవనంలోనే కొనసాగుతున్నాయి. భాగల్పూర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ తన క్యాంపస్‌లోని భవనాలను ఐఐఐటీ భాగల్పూర్ కు అందించింది.

కోర్సుల వివరాలు

[మార్చు]

ఐఐఐటీ భాగల్పూర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్‌ అనే మూడు బిటెక్ కోర్సులను అందిస్తోంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో 150 మంది విద్యార్థులు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 75 మంది, మెకాట్రానిక్స్‌లో 38 మంది విద్యార్థులు ఉన్నారు.[7] 2021 ఆగస్టు నుండి ఈ సంస్థ ఎంటెక్, పిహెచ్.డి. ప్రారంభించింది.

విద్యార్థి మండలి

[మార్చు]

విద్యార్థి మండలి అనేది అన్ని క్లబ్‌లు, పండుగలను పర్యవేక్షించే ప్రధాన ఎన్నుకోబడిన విద్యార్థి సంఘం. ఇది కౌన్సిల్ వివిధ క్లబ్‌లకు పంపిణీ చేసే బడ్జెట్‌ను కలిగివుంటుంది.[10] స్టూడెంట్ కౌన్సిల్ అధికారిక అనుమతి తర్వాత, విద్యార్థులు ఆసక్తుల ఆధారంగా కొత్త క్లబ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యార్థి సెనేట్ అనేది ఎన్నుకోబడిన విద్యార్థి సంఘం, ఇది హాస్టల్‌లు, మెస్ కమిటీ పాలన వంటి విద్యాపరమైన అనేక సమస్యలపై దృష్టి సారిస్తుంది.

విద్యార్థి సంఘాలు

[మార్చు]

ఇతర కార్యకలాపాలు, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ విద్యాసంస్థలో పలు విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. కల్చరల్ సొసైటీ, స్పోర్ట్స్ సొసైటీ, టెక్నికల్ సొసైటీ అనే 3 విభాగాలుగా ఈ సంఘాలు విభజించబడ్డాయి. టెక్నికల్ సొసైటీలో ఏఐ/ఎంఎల్ క్లబ్, కోడింగ్ క్లబ్, రోబోటిక్స్ క్లబ్, వెబ్ డెవలప్‌మెంట్ క్లబ్ అనే 4 క్లబ్‌లు ఉన్నాయి. కల్చరల్ సొసైటీలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్యాన్స్ క్లబ్, డ్రమాటిక్స్ క్లబ్, లిటరేచర్ క్లబ్, మ్యూజిక్ అండ్ సింగింగ్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, క్విజ్ క్లబ్ అనే 7 క్లబ్‌లు ఉన్నాయి. స్పోర్ట్స్ సొసైటీలో బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్, అథ్లెటిక్స్ అనే 4 క్లబ్‌లు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Parliament passes IIIT amendment bill, giving national importance tag to five new institutes". The Times of India. 2020-09-22. ISSN 0971-8257. Archived from the original on 2022-09-01. Retrieved 2023-02-04.
  2. "IIIT Laws (Amendment) Bill 2020 passed in Rajya Sabha; know about the bill". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-22. Retrieved 2023-02-02.
  3. "Tech-cradle cheer for state IIIT project stuck for years over land to be set up on Bhagalpur Engineering College campus".
  4. "Director | Indian Institute of Information Technology Bhagalpur". www.iiitbh.ac.in. Retrieved 2023-02-03.
  5. 5.0 5.1 5.2 5.3 "Indian Institute of Information Technology unit soon at Bhagalpur college". The Times of India. Patna. 7 March 2017. Retrieved 2023-02-03.
  6. 6.0 6.1 6.2 "भागलपुर में खुलेगा बिहार का पहला ट्रिपल आईटी" [Bihar's first IIIT will open in Bhagalpur]. Hindustan (newspaper). Bhagalpur. 21 September 2016.
  7. 7.0 7.1 "Indian Institute of Information Technology Bhagalpur". josaa.nic.in. Joint Seat Allocation Authority 2017. Retrieved 2023-02-03.
  8. "IIIT Bhagalpur Logo Design (Official)".
  9. Biswas, Avijit (21 June 2017). "IIIT-Bhagalpur to become functional from August; IIT-Guwahati to mentor". The Hindustan Times. Bhagalpur. Retrieved 2023-02-03.
  10. i, DG IIIT (20 June 2019). "Google Developer Student Club at IIIT-Bhagalpur". Bhagalpur. Retrieved 2023-02-03.