Jump to content

ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్

వికీపీడియా నుండి
ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్
సర్వీసు అవలోకనం
AbbreviationIRAS
Formed1920లు
ప్రధాన కార్యాలయంరైల్ భవన్
న్యూ ఢిల్లీ
దేశం India
శిక్షణ అకాడమీIndian Railway Institute of Financial Management (IRIFM), సికిందరాబాదు https://irifm.indianrailways.gov.in/
నియంత్రణ అధికారిరైల్వే మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
కేడర్ పరిమాణం800
సర్వీస్ ఛీఫ్
హెడ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్

ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, భారత ప్రభుత్వంలోని గ్రూప్ A సెంట్రల్ సివిల్ సర్వీస్‌లో ఒకటి. ఈ సర్వీస్ కింద ఉన్న సివిల్ సర్వెంట్లు భారతీయ రైల్వేల ఎకౌంట్లు ఫైనాన్సుల నిర్వహణకు బాధ్యత వహిస్తారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 25-30 మంది IRAS ఆఫీసర్లు రిక్రూటౌతారు. ప్రస్తుతం, IRAS క్యాడర్‌లో దాదాపు 800 మంది అధికారులు ఉన్నారు.


IRAS లో మొదటివి

[మార్చు]
మొదటి IRAS అధికారి మిస్టర్ దేవేందర్ యాదవ్, IRAS, 1930
మొదటి IRAS ఫైనాన్షియల్ కమిషనర్ Mr KS భండారి, IRAS, 1939
భారత ప్రభుత్వానికి మొదటి IRAS అధికారి కార్యదర్శి మిస్టర్ YT షా, IRAS, 1944
మొదటి IRAS జనరల్ మేనేజర్ Mr R నర్సింహన్, IRAS, 1955
ప్రథమ మహిళ IRAS అధికారి శ్రీమతి ప్రియా ప్రకాష్, IRAS, 1957
ప్రథమ మహిళ IRAS ఫైనాన్షియల్ కమిషనర్ (రైల్వేస్) శ్రీమతి విజయలక్ష్మి విశ్వనాథన్, IRAS, 1967
భారత ప్రభుత్వ కార్యదర్శిగా నియమితులైన ప్రథమ మహిళ IRAS అధికారి శ్రీమతి ఉషా మాథుర్, IRAS

పాత్ర, పని

[మార్చు]

ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విధులు రైల్వేలో అన్ని స్థాయిలలోని ఎగ్జిక్యూటివ్‌తో కలిసి ఉంటాయి. అత్యున్నత స్థాయి విధాన రూపకల్పనలో, ఫైనాన్స్ కమీషనర్ ఉంటారు. వారికి సహాయంగా, అదనపు సభ్యుడు (ఫైనాన్స్), అదనపు సభ్యుడు (బడ్జెట్), సలహాదారు (ఫైనాన్స్), సలహాదారు (అకౌంటింగ్ సంస్కరణలు) ద్వారా బడ్జెట్, ఖర్చులు, ఆదాయాలు, అకౌంటింగ్, అకౌంటింగ్ డెవలప్‌మెంట్/సంస్కరణలు మొదలైనవారు ఉంటారు. జోనల్ స్థాయిలో, జనరల్ మేనేజర్‌కు అతని సహాయకులతో పాటు ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సహాయం చేస్తారు. డివిజనల్ స్థాయిలో ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ విషయాలలో డివిజనల్ రైల్వే మేనేజర్‌కు సహాయం చేయడానికి కూడా ఇలాంటి ఏర్పాటే ఉంది. ప్రధాన ఉత్పత్తి యూనిట్లు, వర్క్‌షాప్‌లతో పాటు, అవి ఉత్పాదక యూనిట్లైనా, మరమ్మత్తు/ నిర్వహణ యూనిట్లైనా, అంతర్నిర్మితంగా అసోసియేట్ ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ వ్యవస్థ ఉంటుంది. స్టోర్స్ ఆర్గనైజేషన్, వేల కోట్ల రూపాయల విలువైన స్టోర్‌లు, సామానులకు బాధ్యత వహిస్తుంది. దీనికి కూడా ఫైనాన్స్ & అకౌంట్స్ సహాయం చేస్తుంది. సంక్షిప్తంగా, నిర్ణయం తీసుకునే ప్రక్రియలో అకౌంట్స్ అండ్ ఫైనాన్స్‌తో నేరుగా సంబంధం లేని రైల్వే కార్యకలాపాలంటూ ఏవీ లేవు. అదనంగా, ఈ అధికారులు డివిజనల్ రైల్వే మేనేజర్లు, అదనపు జనరల్ మేనేజర్లు మొదలైన నిర్వహణ పోస్టులను కూడా ఆక్రమిస్తారు.[1]

భారతీయ రైల్వేల IRAS కేడర్, రైల్వే ఫైనాన్స్, అకౌంటింగ్ విధులకు బాధ్యత వహిస్తుంది. భారతీయ రైల్వే ఖాతాల నిర్వహణ, ఎగ్జిక్యూటివ్‌కు ఆర్థిక సలహాలివ్వడం ఈ కేడర్ ప్రధాన విధులు. జోనల్ స్థాయిలో, IRAS అధికారులు ఆర్థిక సలహాదారు, ముఖ్య ఎకౌంట్స్ అధికారులుగా నియమించబడతారు. డివిజన్ స్థాయిలో వారు డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్లుగా ఉంటారు. బడ్జెట్ నిర్వహణ, వ్యయ నియంత్రణ, సంపాదన అకౌంట్లు, వివిధ కార్యనిర్వాహక ప్రతిపాదనల ఆర్థిక పరిశీలన వంటివి IRAS అధికారులు నిర్వహించే కొన్ని విధులు. భారతీయ రైల్వేలో ప్రతి ఖర్చు ఆర్థిక పరిశీలన ద్వారానే జరగాలి. భారతీయ రైల్వే వ్యవహారాలపై IRAS కేడరుకు గణనీయమైన నియంత్రణను ఉంటుంది.

ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అధికారులు డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీగా డిప్యూటేషన్‌పై వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో సేవలందిస్తున్నారు. వారిని డిప్యుటేషన్‌పై వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించేందుకు పంపిస్తారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The IRAS Times-About IRAS".