Jump to content

ఇచ్ఛాపురపు రామచంద్రం

వికీపీడియా నుండి
ఇచ్ఛాపురపు రామచంద్రం
ఇచ్ఛాపురపు రామచంద్రం
జననం
ఇచ్ఛాపురపు రామచంద్రం

(1940-06-16) 1940 జూన్ 16 (వయసు 84)
మరణం2016 ఆగస్టు 11(2016-08-11) (వయసు 76)
విశాఖపట్నం
మరణ కారణంగుండె వ్యాధి
వృత్తికథా రచయిత

ఇచ్ఛాపురపు రామచంద్రం ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. ఆయన సావిత్రి బాయిపూలే ట్రస్ట్‌ సలహాదారు, ఆంధ్రప్రదేశ్‌ అవయవ దాతల సంఘం ముఖ్య కార్యకర్త.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలో సత్యవతి, వైద్యనాథం దంపతులకు 1940, జూన్ 16న జన్మించాడు.[1] బి.ఎ. (ఎకనామిక్స్‌) చదివాడు. వృత్తిరీత్యా 1968 నుండి జీవితభీమా సంస్థలో పనిచేసి 2000 సంవత్సరంలో అనకాపల్లి బ్రాంచి ఆఫీసులో పదవీవిరమణ చేశాడు. తరువాత విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. ఈయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.[2]

రచనలు

[మార్చు]

ఇచ్ఛాపురపు రామచంద్రం 500లకు పైగా కథలు, కథానికలు, రేడియో నాటికలు రాసి ప్రజాదరణ పొందాడు. కాశీమజిలీ కథలను అనువాదం చేశాడు. బాలసాహిత్యంలో 40నుంచి 50 వరకూ పుస్తకాలు రాసిన ఆయన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక పత్రికల్లో ఆయన కథలు వందకుపైగా ప్రచురితమయ్యాయి.[3]

  1. దారి పక్క దీపాలు (కథా సంపుటం)
  2. సిద్ధార్థ (కథా సంపుటం)
  3. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి : సరళ సుందర పౌరాణిక ఉత్కంఠ కథా సంగ్రహము
  4. భట్టి విక్రమార్క కథలు
  5. శ్రీ భగవద్గీతా సారం
  6. ఉపనిషత్తుల సారం
  7. జంతువుల కథలు

సామాజిక సేవ

[మార్చు]

ఈయన సావిత్రి బాయిపూలే ట్రస్ట్‌ సలహాదారు గాను, ఆంధ్రప్రదేశ్‌ అవయవ దాతల సంఘం ముఖ్య కార్యకర్తగాను పనిచేశాడు. అవయవ దాన ఆవశ్యకతపై సాగిస్తున్న ఉద్యమాన్ని వెన్నుదన్నుగా నిలిచాడు. ఇతడి మరణానంతరం తన కళ్లను మోహిసిన్‌ ఐ బ్యాంకుకు, పార్ధివదేహాన్ని ఆంధ్ర మెడికల్‌ కళాశాలకు అందజేశాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈయనకు కుమార్తె కవిత, కుమారుడు రాజేంద్ర ఉన్నారు.

మరణం

[మార్చు]

ఈయన గుండె సంబంధిత ఇబ్బందితో 2016 ఆగస్టు 05న విశాఖపట్నం లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో అక్కడ ఈయనకు బైపాస్‌ సర్జరీ చేశారు. కానీ పరిస్థితి విషమించడంతో 2016, ఆగష్టు 11వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. సూర్య దినపత్రికలో[permanent dead link] పైడిమర్రి రామకృష్ణ వ్యాసం[permanent dead link]
  2. 2.0 2.1 2.2 విలేకరి, విశాఖపట్నం (12 August 2016). "ఇచ్ఛాపురపు ఇక లేరు". సాక్షి. Archived from the original on 12 ఆగస్టు 2016. Retrieved 12 August 2016.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "రచయిత ఇచ్ఛాపురపు రామచంద్రం కన్నుమూత 12-08-2016". Archived from the original on 2016-08-13. Retrieved 2016-08-12.