ఇన్శాట్-3డీఆర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్శాట్-3డీఆర్
పేర్లుఇండియన్ నేషనల్ శాటిలైట్ 3డీ రిపీట్
మిషన్ రకంవాతావరణ అధ్యయన ఉపగ్రహం
నిర్వహించే సంస్థఈండియన్ నేషనల్ శాటిలైట్(INSAT)
మిషన్ కాలముజీవితకాలం:10సంవత్సరాలు
Elapsed: 4 సంవత్సరంలు, 7 నెలలు, 8 రోజులు
అంతరిక్షనౌక లక్షణాలు
ఉపగ్రహ బస్I-2K
తయారీదారుడుఇస్రో శాటిలైట్ సెంటరు
Space Applications Centre
ప్రారంభ ద్రవ్యరాశి2,211 కి.గ్రా. (4,874 పౌ.)[1]
పొడిగా ఉన్నప్పుడు ద్రవ్యరాశి956 కి.గ్రా. (2,108 పౌ.)[1]
శక్తి1,700 W[1]
మిషన్ ప్రారంభం
ప్రారంభ తేదీ8,సెప్టెంబరు2016,సాయంత్రం4:50(ఐ.ఎస్.టి)
రాకెట్GSLV (Mk II)F05
ప్రారంభించిన స్థలంసతిష్ థవన్ అంతరిక్ష ప్రయోగ సంస్థ,రెండవ ప్రయోగ వేదిక
Contractorఇస్రో
ఆర్బిటాల్ పరామితులు
నిర్దేశ వ్యవస్థGeocentric
Regimeభూస్థిరకక్ష్య
Longitude74° E[1]
EpochPlanned

ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపకల్పన చేసి తయారు చేసినది.ఇన్శాట్ శ్రేనికి చెందిన ఉపగ్రహాలను వాతావరణ అద్యాయనం చెయ్యుటకై అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టారు.వాతావరణ పరిసశోధన, అద్యాయనానికై ఇంతకు ముందు కల్పన-1, ఇన్శాట్-3A, ఇన్శాట్-3D ఉపగ్రహాలను ప్రయోగించారు, అవి 10 సంవస్తరాలుగా అంతరిక్షంలో నిర్దిష్ట అక్షాంశంలో నిర్దిష్ట కక్ష్యలో ప్రదక్షిణలు చేస్తూ సేవలందిస్తున్నాయి[2]. 2013 జూలై 26 న ఫ్రాన్సులోని ఫ్రెంచిగయనా అంతరిక్ష కేంద్రంనుండి, ఫ్రన్సు అంతరిక్ష సంస్థ సహాకారంతో అంతరిక్ష కక్ష్యలో ఇన్శాట్-3డీఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు.అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ఉపగ్ర్హం సేవలు నిలచి పోవడం వలన, ఆ లోటును భర్తీ చేయుటకు ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టుచున్నారు.[3]

ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహ వివరాలు[మార్చు]

ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహన్ని కేవలంభూమి మీది వాతావరణ సమాచారాన్నే కాకుండ సముద్రం మీదివాతావరణాన్ని అధ్యాయనం చెయ్యటానికి, భూమి ఉపరితలం పై, సముద్రజలాలవాతావరణంలో ఏర్పడె విప్పతులను గుర్తించి ముందుగానే సమాచారం అందించుటకై తయారు చేసారు.ఈ ఉపగ్రహంలో 6-ఛానల్ ఇమేజరు,9-ఛానల్ సౌండరు అనే శాస్త్రీయ పరికరాలను, మెట్రోలాజికల్ డాటారిలే ట్రాన్స్‌ఫాండర్సు (డీఆర్‌టీ) శాటిలైట్ ఏయిడెద్ సెర్చ్ అండ్ రిసోర్స్ (ఎస్‌ఏఏస్‌ అండ్ ఏర్) అనే శాస్త్రియ పరికరాలను కూడా ఉపగ్రహంలో అదనంగా అమర్చారు.ఈ ఉపగ్రహంలో అమర్చిన 6 ఛానల్ ఇమేజరు ద్వారా భూమిపైన, సముద్రజలాలపైన జరిగే మార్పులను పొటోతీసి పంపెటందుకు ఉపయోగిస్తారు.ఈ ఉపగ్రహం కూడా భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ప్రదక్షణలు చేస్తూ సేవలందిస్తుంది[3].

ఉపగ్రహం బరువు:2211 కిలోలు.ఉపగ్రహంసేవలు అందించు జీవితకాలం 10సంవత్సరాలు.ఉపగ్రహకొలతలు 2.4X1.6X1.5 మీటర్లు, విద్యుత్తు ఉత్పత్తికై రెండు సౌరఫలకాలు కల్గిఉన్నది.సౌరఫలకలు 1700వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయు సామర్ధ్యం కల్గి ఉన్నాయి.90ఏచ్ కెపాసిటీ లిథియం-అయాన్ బ్యాటరీ ఉపగ్రహంలో అమర్చారు.ఉపగ్రహం కై అయినఖర్చు 50కోట్లు.ఈఉపగ్రహన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టూ వాహకనౌకకు అయిన ఖర్చు 160 కోట్లు.

ఉపగ్రహ ప్రయోగం[మార్చు]

ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వి-F05 ఉపహ్రగ వాహకనౌకసాయంతో 2016, సెప్టెంబరు 8 వతేది, గురువారము సాయంత్రం 4:50గంటలకు నింగిలోకి విజయవంతంగా ప్రయోగించారు.అనుకున్న విధంగా 1,023 సెకన్లకు భూసమాంతర బదిలీ క్షక్యలో,170 కిలోమీటర్ల పెరోజి,35,975 కి.మీ అపోజీలో,20.61 డీగ్రీల కోణంలో ప్రవేశపెట్టారు[4].

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 Radhakrishan, Vignesh (8 September 2016). "Isro's advanced weather satellite launched: Here are 8 things to know". Hindustan Times. Retrieved 8 September 2016. CS1 maint: discouraged parameter (link)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-29. Retrieved 2016-09-08.
  3. 3.0 3.1 "నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌ఎఫ్-ఎఫ్05". sakshi.com. 9-8-2016. http://web.archive.org/web/20160908031413/http://epaper.sakshi.com/930185/Andhra-Pradesh/08-09-2016#page/5/1. Retrieved 08-09-2016. 
  4. "నింగిలోకి ఇన్‌శాట్-3డీఅర్". sakshi.com. 9-9-2016. http://web.archive.org/web/20160909034029/http://epaper.sakshi.com/931140/Andhra-Pradesh/09-09-2016#page/15/1.