ఇన్శాట్-4B ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్శాట్-4B ఉపగ్రహం
ఇన్శాట్-4B ఉపగ్రహం
మిషన్ రకంCommunications
ఆపరేటర్ISRO
COSPAR ID2007-007A Edit this at Wikidata
SATCAT no.30793
మిషన్ వ్యవధి12 years
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-3K
తయారీదారుడుISRO
లాంచ్ ద్రవ్యరాశి3,028 kilograms (6,676 lb)
డ్రై ద్రవ్యారాశి1,335 kilograms (2,943 lb)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ11 March 2007, 22:03 (2007-03-11UTC22:03Z) UTC[1]
రాకెట్Ariane 5ECA
లాంచ్ సైట్Kourou ELA-3
కాంట్రాక్టర్Arianespace
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం93.48° east
సెమీ మేజర్ ఆక్సిస్42,163.57 kilometres (26,199.23 mi)
విపరీతత్వం0.0003909
Perigee altitude35,776 kilometres (22,230 mi)
Apogee altitude35,809 kilometres (22,251 mi)
వాలు0.07 degrees
వ్యవధి23.93 hours
ఎపోచ్11 November 2013, 22:16:22 UTC[2]
 

ఇన్శాట్-4B ఒక భారతీయ ఉపగ్రహం.ఇది ఒక సమాచార ప్రసార ఉపగ్రహం. దీనిని భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థలో (INSS) భాగంగా, భారతీయ అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) రూపకల్పన చేసి, తయారు చేసిన ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని 2007 న అంతరిక్షములో భూస్థిర కక్ష్యలో, 93.48° డిగ్రీల తూర్పు రేఖాంశములోని కక్ష్యలో స్థిరపరచారు.[3]

ఉపగ్రహ సమాచారం[మార్చు]

1-3K శాటిలైట్ బస్ ఆధారంగా ఇన్శాట్-4B ఉపగ్రహాన్ని రూపొందించారు.ఉపగ్రహం పూర్తి బరువు, ఇంధన సహితంగా 3,025 కిలోగ్రాములు (6,676 పౌండ్లు, ఖాళి ఉపగ్రహంబరువు 1,335 కిలోగ్రాములు (2,943 పౌండ్లు).ఈ ఉపగ్రహం పనిచేయు జీవితకాలం 12 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఉపగ్రహానికి అవసరమైన విద్యుతు ఉత్పత్తికి రెండు సౌరపలకను అమర్చారు. ఉపగ్రహంలో సమాచార వ్యవస్థకి 12 C-band, 12-Ku band ట్రాన్స్‌పాండరులను పొందుపరచారు.[4] ఉపగ్రహం యొక్క విద్యుతు క్షమత 5859 W.

ఉపగ్రహ ప్రయోగం[మార్చు]

ఇన్శాట్-4B ఉపగ్రహాన్నిదక్షిణ అమెరికా, ఫ్రెంచి గయానాలోని కౌరౌ (kourou) అంతరిక్షప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు. అంతరిక్షములోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టు కార్యాన్ని ఏరియన్‌స్పేస్ వారు గుత్తేదారు పద్ధతి (contract) లో నిర్వహించారు. ఏరియన్‌స్పేస్ వారు తయారుచేసిన ఏరియన్ 5ECA అనే ఉపగ్రహ వాహక రాకెట్ ద్వారా 2007 మార్చి 11 న ప్రయోగ కేంద్రంలోని ELA-3 ప్రయోగవేదిక నుండి ఉపగ్రహాన్ని అంతరిక్షములోకి పంపి భూసమస్థితి బదిలీకక్ష్యలో (GTO) ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఉపగ్రహంలోని మోటారును మండించి కక్ష్యను పెంచి భూస్తిర కక్ష్యకు చేర్చారు. అంతిమంగా, ఉపగ్రహకక్ష్య పెరిజీ 35,776కి.మీ, అపోజీ 35,809 కిలోమీటర్లు, వాలు 0.07 డిగ్రీలు. కక్ష్య భ్రమణసమయం 23.93 గంటలు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 12 November 2013.
  2. "INSAT 4B Satellite details 2007-007A NORAD 30793". N2YO. 11 November 2013. Retrieved 12 November 2013.
  3. "UCS Satellite Database". Union of Concerned Scientists. 1 September 2013. Archived from the original on 4 జనవరి 2014. Retrieved 12 November 2013.
  4. Krebs, Gunter. "Insat 4A, 4B". Gunter's Space Page. Retrieved 12 November 2013.