ఇష్ సోధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇష్ సోధి
2018 లో సోధి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఇందర్‌బీర్ సింగ్ సోధి
పుట్టిన తేదీ (1992-10-31) 1992 అక్టోబరు 31 (వయసు 31)
లూఢియానా, పంజాబ్, భారతదేశం
మారుపేరుIce Ice Sodhi
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 262)2013 అక్టోబరు 9 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2023 జనవరి 02 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 187)2015 ఆగస్టు 2 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2023 మార్చి 31 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.61
తొలి T20I (క్యాప్ 64)2014 జూలై 5 - వెస్టిండీస్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 5 - ఇంగ్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.61
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13–presentNorthern Districts
2016/17అడిలైడ్ స్ట్రైకర్స్
2017–2018నాటింగ్‌హామ్‌షైర్
2018–2019రాజస్థాన్ రాయల్స్
2018జమైకా తలావాస్
2020St Kitts and Nevis Patriots
2021వోర్సెస్టర్‌షైర్
2022వెల్ష్ ఫైర్
2023సోమర్సెట్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 FC
మ్యాచ్‌లు 19 46 100 93
చేసిన పరుగులు 524 166 155 2,587
బ్యాటింగు సగటు 22.78 8.73 9.11 21.92
100లు/50లు 0/4 0/0 0/0 0/13
అత్యుత్తమ స్కోరు 65* 25 19 82*
వేసిన బంతులు 3,803 2,287 2,071 17,177
వికెట్లు 54 55 121 303
బౌలింగు సగటు 42.94 38.05 22.87 33.05
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0 17
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 2
అత్యుత్తమ బౌలింగు 6/86 4/58 4/28 7/30
క్యాచ్‌లు/స్టంపింగులు 11/– 10/– 31/– 38/–
మూలం: ESPNCricinfo, 1 September 2023

ఇందర్బీర్ సింగ్ "ఇష్" సోధీ (జననం 1992 అక్టోబరు 31) భారతదేశంలోని పంజాబ్‌లో జన్మించిన న్యూజిలాండ్ క్రికెటర్, అతను అన్ని ఫార్మాట్‌లలో న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు, దేశీయ క్రికెట్‌లో కాంటర్‌బరీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. [1] అతను కుడిచేతి లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు, కుడిచేతితో బ్యాటింగ్ చేస్తాడు. అతను 2018 జనవరిలో T20I బౌలర్లలో నం.1 ర్యాంకింగ్‌కు చేరుకున్నాడు. [2]

జీవితం తొలి దశలో

[మార్చు]

సోధీ ఒక పంజాబీ. భారతదేశంలోని లూథియానాలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. [3] అతని తాతలు పాకిస్తాన్ విభజనకు ముందు లాహోర్ నుండి వచ్చారు. [4] అతను నాలుగు సంవత్సరాల వయస్సులో తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌లోని పాపటోటోకి మారాడు. అతను పాపటోటో హై స్కూల్‌లో చదివాడు. [5]

దేశీయ, T20 కెరీర్

[మార్చు]

సోధి 2012–13 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరఫున రంగప్రవేశం చేశాడు.

2017లో, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు జట్టులో సోధి పేరు లేదు. అపుడతను అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున గాయపడీన క్రిస్ జోర్డాన్‌ స్థానంలో ఆడ్డాడు. జనవరి 18న స్ట్రైకర్స్ కోసం తన మూడవ గేమ్‌లో, అతను 3.3 ఓవర్లలో 6/11తో మ్యాచ్‌ను ముగించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ని గెలుచుకున్నాడు. లసిత్ మలింగ 6/7 తర్వాత బిగ్ బాష్ చరిత్రలో ఇవి రెండవ అత్యుత్తమ గణాంకాలు. [6] [7]

అతను 2018-19 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లలో 36 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలరు. [8] 2020 IPL వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ అతన్ని విడుదల చేసింది. [9] 2020 జూలైలో, అతను 2020 కరీబియన్ ప్రీమియర్ లీగ్ కోసం సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [10] [11]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

న్యూజిలాండ్ 2013 బంగ్లాదేశ్ పర్యటనలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతని అంతర్జాతీయ రంగప్రవేశం జరిగింది. 2014 జూలైలో వెస్టిండీస్‌పై ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు. 2014 నవంబరులో సోధీ పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. మొదటి టెస్ట్‌లో, అతను 63 పరుగులు చేశాడు, ఇది వ్యక్తిగత అత్యుత్తమ స్కోరే కాక, టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ నంబర్-టెన్ బ్యాట్స్‌మన్ చేసిన అత్యుత్తమ స్కోరు. సోధీ 2015 ఆగస్టు 2న జింబాబ్వేపై న్యూజిలాండ్ తరపున వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు [12]

2018 మేలో, న్యూజిలాండ్ క్రికెట్ ద్వారా 2018–19 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌ను పొందిన ఇరవై మంది ఆటగాళ్లలో అతను ఒకడు. [13] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [14] [15] 2021 ఆగష్టులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో సోధిని ఎంపిక చేశారు. [16]


2022 డిసెంబరులో, సోధీని 4 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ టెస్టు స్క్వాడ్‌లో పాకిస్తాన్ పర్యటన కోసం మళ్ళీ తీసుకున్నారు. [17] మొదటి టెస్ట్‌లో, అతను టెస్టు క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల పంట తీసాడు. [18] మొదటి ఇన్నింగ్స్‌లో అతని కెరీర్‌లో అత్యుత్తమ 65 పరుగులను సాధించాడు. [19]

మూలాలు

[మార్చు]
 1. "Players / New Zealand / Ish Sodhi". Cricinfo. Retrieved 11 October 2013.
 2. "Munro and Sodhi on top of the world" (in ఇంగ్లీష్). Retrieved 2018-01-04.
 3. "Blackcap spinner Ish Sodhi ties knot in Auckland!". Archived from the original on 2022-12-26. Retrieved 2023-09-12.
 4. "To be here is special': Sodhi reveals family connection with Lahore". Retrieved 2023-05-08.
 5. Mark Geenty (2013-09-14), New Black Cap Sodhi in a spin after rapid rise, retrieved 2018-06-05
 6. cricket.com.au (2017-01-18), Sodhi takes six to sink Thunder, retrieved 2017-01-19
 7. MrCricket1760 (2012-12-12), Lasith Malinga 6/7 vs Perth Scorchers 12/12/12, retrieved 2017-01-19{{citation}}: CS1 maint: numeric names: authors list (link)
 8. "Plunket Shield, 2018/19: Most wickets". ESPN Cricinfo. Retrieved 20 March 2019.
 9. "Where do the eight franchises stand before the 2020 auction?". ESPN Cricinfo. Retrieved 12 February 2020.
 10. "Nabi, Lamichhane, Dunk earn big in CPL 2020 draft". ESPN Cricinfo. Retrieved 6 July 2020.
 11. "Teams Selected for Hero CPL 2020". Cricket West Indies. Retrieved 6 July 2020.
 12. "New Zealand tour of Zimbabwe and South Africa, 1st ODI: Zimbabwe v New Zealand at Harare, Aug 2, 2015". ESPNCricinfo. Retrieved 2 August 2015.
 13. "Todd Astle bags his first New Zealand contract". ESPN Cricinfo. Retrieved 12 February 2020.
 14. "Sodhi and Blundell named in New Zealand World Cup squad". ESPN Cricinfo. Retrieved 12 February 2020.
 15. "Uncapped Blundell named in New Zealand World Cup squad, Sodhi preferred to Astle". International Cricket Council. Retrieved 3 April 2019.
 16. "Black Caps announce Twenty20 World Cup squad, two debutants for leadup tours with stars absent". Stuff. 9 August 2021. Retrieved 9 August 2021.
 17. "Sodhi & Phillips return to Test squad, Tickner retained". New Zealand Cricket. Archived from the original on 22 డిసెంబర్ 2022. Retrieved 15 December 2022. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 18. "Sodhi's maiden fifer keeps NZ in the hunt". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2022-12-30.
 19. "PAK vs NZ: Ish Sodhi registers his career-best Test score". Geo Super (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-30.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇష్_సోధి&oldid=4080461" నుండి వెలికితీశారు