ఇ.శ్రీధరన్

వికీపీడియా నుండి
(ఈ. శ్రీధరన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎలత్తువాలాపిల్ శ్రీధరన్
జననం (1932-06-12) 1932 జూన్ 12 (వయసు 92)
కరుకపుతుర్, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
( ప్రస్తుతం త్రిఠాల నియోజకవర్గం, కేరళ, భారతదేశం )
ఇతర పేర్లుమెట్రో మ్యాన్
విద్యాసంస్థప్రభుత్వ విక్టోరియా కళాశాల, పాలక్కాడ్, కేరళ
యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ ( జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ )
వృత్తిIRSE ఆఫీసర్ (రిటైర్డ్)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కొంకణ్ రైల్వే, ఢిల్లీ మెట్రో, కొచ్చి మెట్రో , అనేక రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులు
పురస్కారాలుపద్మ విభూషణ్, పద్మశ్రీ, చేవాలియర్ డి లా లెజియన్ డి హోన్నూర్, జీవితకాల సాఫల్య పురస్కారం[1] నాయుడమ్మ మెమోరియల్ పురస్కారం

ఈ. శ్రీధరన్ (జననం: జూన్ 12, 1932) ఈయన సివిల్ ఇంజనీర్. ఈయనను మెట్రో మాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 2008లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.[2]శ్రీధరన్ 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటి చేసి కాంగ్రెస్ అభ్యర్థి షఫి పరంబిల్‌ చేతిలో ఓడిపోయారు.[3]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1932, జూన్ 12 న కరుకపుతుర్, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కేరళ, పాలక్కాడ్ జిల్లా, భారతదేశం) లో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను పాలక్కాడ్ జిల్లాలోని పట్టాంబి సమీపంలో ఉన్న ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్ లో పూర్తి చేశాడు. ఈయన తన ఇంజనీరింగ్ విద్యను ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ కళాశాలను జెఎన్‌టియుకె అని పిలుస్తారు.[4][5]

కెరీర్

[మార్చు]

ఈయన కోజికోడ్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో  సివిల్ ఇంజనీరింగ్ లెక్చరర్‌గా పనిచేశాడు. ఈయన బాంబే పోర్ట్ ట్రస్ట్‌లో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌గా  పనిచేశారు. 1953లో యుపీఎస్సి నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షను క్లియర్ చేసి, ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఇ) లో చేరాడు. 1954 డిసెంబర్‌లో దక్షిణ రైల్వేలో  ప్రొబేషనరీ అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరాడు.

పంబన్ వంతెన పునరుద్ధరణ

[మార్చు]

1964 డిసెంబరులో ఒక తుఫాను కారణంగా రామేశ్వరాన్ని, తమిళనాడు ప్రధాన భూభాగానికి అనుసంధానించే పంబన్ వంతెన కొట్టుకుపోయింది. ఈ వంతెన మరమ్మతులు చేయటానికి రైల్వేలు ఆరు నెలల లక్ష్యాన్ని నిర్దేశించగా, శ్రీధరన్ యొక్క యజమాని ఈ ప్రాజెక్టు నుంచి వివిధ కారణాల రీత్యా తప్పిచుకోవడం వల్ల ఈ ప్రాజెక్టు మరమ్మతుల బాధ్యత ఈయన తీసుకున్నాడు.  ఈయన ఈ ప్రాజెక్టును 46 రోజుల్లో పునరుద్ధరి ఈ రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి  పురస్కారం అందుకున్నాడు.

కోల్ కత్తా మెట్రో

[మార్చు]

భారతదేశంలో మొట్టమొదటి మెట్రో అయినటువంటి కోల్ కత్తా మెట్రోకి 1970 లో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్‌గా దీని మెట్రో అమలు, ప్రణాళిక, రూపకల్పనకు బాధ్యత వహించాడు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి భారతదేశంలో కొత్త ప్రయాణ విభాగానికి శ్రీకారం చుట్టాడు. ఈయన 1975 లో ఈ పదవికి రాజీనామా చేసాడు.

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్

[మార్చు]

ఈయన అక్టోబర్ 1979 లో కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో చేరాడు. ఈయన చేరినప్పుడు ఈ సంస్థ ఉత్పాదకత లేని దశలో ఉంది. దీని మొదటి ఓడ అయినటువంటి ఎమ్.వి. రాణి పద్మిని ఉత్పత్తి నిర్మాణ దశలో ఆగిపోయింది. ఈయన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈయన అధ్యక్షతలో 1981 లో ఈ షిప్‌యార్డ్  యొక్క మొదటి ఓడ అయినటువంటి ఎంవి రాణి పద్మినిని ప్రారంభించారు.

కొంకన్ రైల్వే

[మార్చు]

ఈయనకు జూలై 1987లో వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందాడు. ఈయన జూలై 1989 లో ఇంజనీరింగ్ సభ్యుల సంఘంలో, రైల్వే బోర్డు, భారత ప్రభుత్వ మాజీ అఫీషియో కార్యదర్శి పదవులు చేపట్టారు. ఈయన జూన్ 1990 లో అన్ని విధులకు పదవీ విరమణ చేసిన తరువాత, తన సేవలు దేశానికి ఇంకా అవసరమని ప్రభుత్వం భావించి 1990 లో అప్పటి రైల్వే మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ కొంకణ్ రైల్వే విభాగానికి సిఎండిగా నియమించారు. భారతదేశంలో BOT (బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన చేపట్టిన మొదటి పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో 82 కిలోమీటర్ల పొడవున 93 సొరంగాలు, మృదువైన నేల ద్వారా సొరంగ మార్గం, మొత్తం ప్రాజెక్టు 760 కిలోమీటర్లు, 150 కి పైగా వంతెనలను కలిగి ఉంది. కొంకణ్ రైల్వేను ఎక్స్‌ట్రీమ్ రైల్వే కార్యక్రమంలో ప్రపంచంలో క్లిష్టతరమైన ప్రాజెక్టులను నిర్మించిన క్రిస్ టారెంట్ ఈ ప్రాజెక్టును అత్యంత కష్టతరమైన రైల్వే ప్రాజెక్టుగా పేర్కొన్నారు.

ఢిల్లీ మెట్రో

[మార్చు]

ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ ఈయనను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించాడు. ఈ ప్రాజెక్టును 1997 మధ్య నాటికి అన్ని షెడ్యూల్ విభాగాలలో గడువు తేదీ కన్నా ముందే పూర్తిచేసి ప్రశంశలు అందుకున్నాడు. ఈ ప్రాజెక్టు విజయం కారణంగా మీడియా ఇతన్ని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రబోధించింది. ఈయన 2005 చివరి నాటికి పదవీ విరమణ చేస్తానని ప్రకటించాడు కాని ఢిల్లీ మెట్రో రెండవ దశ పూర్తి బాధ్యతలు అతనికి ఆప్పజెపుతు ఈయన పదవీకాలం పొడిగించబడింది. ఈయన ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో 16 సంవత్సరాల సేవ తరువాత డిసెంబర్ 31, 2011 న పదవీ విరమణ చేశాడు.

పురస్కారాలు , ప్రశంశలు

[మార్చు]
  • రైల్వే మంత్రి పురస్కారం (1963)
  • పద్మశ్రీ పురస్కారం (2001)
  • టైమ్స్ ఆఫ్ ఇండియా వారి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ (2002)
  • ఓం ప్రకాష్ భాసిన్ అవార్డు (2002)
  • CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నాయకత్వానికి జూరర్స్ అవార్డు (2002–03)
  • పబ్లిక్ సర్వీస్ ఎక్సలెన్స్ కొరకు AIMA (ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్) పురస్కారం (2003)
  • ఐఐటి ఢిల్లీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ (హోనోరిస్ కాసా) డిగ్రీ. డా.వై.నాయుడమ్మ స్మారక పురస్కారం
  • చండిఘర్ లోని శిరోమణి ఇన్స్టిట్యూట్ నుండి భరత్ శిరోమణి పురస్కారం (2005)
  • ఫ్రాన్స్ ప్రభుత్వం చేవాలియర్ డి లా లెజియన్ డి హోన్నూర్ (నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్) (2005)
  • కిమ్ప్రో ప్లాటినం స్టాండర్డ్ (బిజినెస్)
  • నేషనల్ స్టేట్స్ మాన్ ఫర్ క్వాలిటీ ఇన్ ఇండియా (2007)
  • పద్మ విభూషణ్ పురస్కారం (2008)
  • డాక్టర్ ఆఫ్ లిట్రేచర్, రాజస్థాన్ టెక్నికల్ యూనివర్శిటీ, కోటా, రాజస్థాన్
  • 2009 లో ఐఐటి రూర్కీ నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ (హోనోరిస్ కాసా).
  • 2012 లో మనోరమ న్యూస్ చేత న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్.

మూలాలు

[మార్చు]
  1. "'Metro man' Sreedharan gets Lifetime achievement Governance Award 2013'".
  2. "Sreedharan on Vaishno Devi Board". The Hindu. March 28, 2012. (subscription required)
  3. Sakshi (2 May 2021). "కేరళ: మరోసారి లెఫ్ట్‌ ప్రభుత్వం.. పాలక్కడ్‌ నుంచి మెట్రోమాన్‌ ఓటమి". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
  4. "'Man of tomorrow'". 18 November 2019.
  5. "Delhi Metro Rail". Retrieved 18 November 2019.