ఉత్సవ్ (1984 సినిమా)
Appearance
ఉత్సవ్ | |
---|---|
దర్శకత్వం | గిరీష్ కర్నాడ్ |
రచన | కృష్ణ బస్రూర్, గిరీష్ కర్నాడ్ (స్క్రీన్ ప్లే) శరద్ జోషి(డైలాగ్) |
నిర్మాత | శశి కపూర్ |
తారాగణం | శంకర్ నాగ్, రేఖ, అనురాధ పటేల్, అమ్జద్ ఖాన్, శశి కపూర్, శేఖర్ సుమన్ |
Narrated by | అమ్జద్ ఖాన్ |
ఛాయాగ్రహణం | అశోక్ మోహతా |
కూర్పు | భానుదాసు దివాకర్ |
సంగీతం | లక్ష్మీకాంత్-ప్యారేలాల్, వసంత్ దేవ్ (పాటలు) |
విడుదల తేదీ | 21 డిసెంబరు 1984 |
సినిమా నిడివి | 145 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ఉత్సవ్ 1984లో విడుదలైన హిందీ చలనచిత్రం. సా.శ. 2వ శతాబ్దంలో శూద్రకుడు సంస్కృతంలో రాసిన మృచ్ఛకటికమ్ నాటకం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించాడు.[1][2] శంకర్ నాగ్, రేఖ, అనురాధ పటేల్, అమ్జద్ ఖాన్, శశి కపూర్, శేఖర్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ
[మార్చు]శూద్రకుడు ఒక రాజు. ఇతడు క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం, సా.శ. ఐదవ శతాబ్దం మధ్య కొంతకాలం జీవించినట్లు భావిస్తారు.[3] క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దం మొదటి త్రైమాసికంలో ప్రడియోటా రాజవంశం చివరి పాలక రాజు పాలనలో పురాతన నగరమైన ఉజ్జయినిలో జరిగిన ఇతివృత్తం (వసంతసేన (రేఖ) ఉజ్జయినిలో ఒక పేద బ్రాహ్మణ వ్యక్తైన చారుదత్తా (శేఖర్ సుమన్) తో కలిసే అవకాశం) ఆధారంగా మృచ్ఛకటికమ్ నాటకం రాయబడింది.[4]
నటవర్గం
[మార్చు]- శశి కపూర్
- రేఖ
- అమ్జద్ ఖాన్
- శంకర్ నాగ్
- కుల్భూషన్ ఖర్బందా
- శేఖర్ సుమన్
- నీనా గుప్తా
- అనురాధ పటేల్
- అనుపమ్ ఖేర్
- అన్నూ కపూర్
- సంజన కపూర్
- కునాల్ కపూర్
- హరీష్ పటేల్
- యూనుస్ పర్వేజ్
- సతీష్ కౌశిక్
- ఉత్సవ్ కపాడియా
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గిరీష్ కర్నాడ్
- నిర్మాత: శశి కపూర్
- రచన: కృష్ణ బస్రూర్
- మాటలు: శరద్ జోషి
- ఆధారం: శూద్రకుడు రాసిన మృచ్ఛకటికమ్ నాటకం
- వ్యాఖ్యానం: అమ్జద్ ఖాన్
- సంగీతం: లక్ష్మీకాంత్-ప్యారేలాల్
- పాటలు: వసంత్ దేవ్
- ఛాయాగ్రహణం: అశోక్ మోహతా
- కూర్పు: భానుదాసు దివాకర్
అవార్డులు
[మార్చు]- 1985: భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ఉత్తమ కళా దర్శకత్వం - నాచికెట్ పట్వర్ధన్, జయూ పట్వర్ధన్
- 1985: ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ పాటల రచయిత - వసంత్ దేవ్ ("మన్ క్యున్ బెహ్కా")[5]
- 1985: ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ గాయని - అనురాధ పౌడల్ ("మేరే మ్యాన్ బాజే మృదాంగ్")
ఇతర వివరాలు
[మార్చు]- ఇందులో శశికపూర్ చేసిన పాత్ర అమితాబ్ బచ్చన్ చేయాల్పివుంది. 1982 జూలైలో బెంగళూరులో జరిగిన ప్రమాదంలో అమితాబ్ బచ్చన్ కు గాయాలయ్యాయి. అందువల్ల నిర్మాతైన శశికపూర్ ఇందలుఓ నటించాల్సివచ్చింది.[6]
- 1984, ఆగస్టు 23న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారినుండి 'ఎ' సర్టిఫికెట్ లభించింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu, Movies (10 June 2019). "Girish Karnad — actor with a conscience". Namrata Joshi. Archived from the original on 10 June 2019. Retrieved 1 July 2019.
- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (12 June 2019). "గిరీష్ కర్నాడ్.. ఓ ప్రత్యామ్నాయ సృజనసారథి". బెందాళం క్రిష్ణారావు. Archived from the original on 12 June 2019. Retrieved 1 July 2019.
- ↑ Richmond, Farley P. (1990). "Characteristics of Sanskrit Theatre and Drama". In Farley P. Richmond; Darius L. Swann; Phillip B. Zarrilli (eds.). Indian Theatre: Traditions of Performance. Honolulu: University of Hawaii Press. pp. 55–62. ISBN 0824811909.
- ↑ Oliver, Revilo Pendelton (1938). "Introduction to 'The Little Clay Cart.'". In Rozelle Parker Johnson; Ernst Krenn (eds.). Illinois Studies in Language and Literature. Vol. 23. Urbana: University of Illinois Press. pp. 9–44.
- ↑ "Best Lyricist (Popular)". Filmfare Awards Official wlistings, Indiatimes. Archived from the original on 18 మే 2011. Retrieved 1 జూలై 2019.
- ↑ "Of Jennifer and MTR (Shashi Kapoor interview)". The Hindu. 31 January 2005. Archived from the original on 14 మే 2014. Retrieved 1 July 2019.
- ↑ "Utsav (1984)". Central Board of Film Certification (CBFC). 23 August 1984. Archived from the original on 20 డిసెంబరు 2013. Retrieved 1 July 2019.