Jump to content

ఉప్పలకలువగుంట

వికీపీడియా నుండి

ఉప్పలకలువగుంట గ్రామం కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఉప్పలకలువగుంట
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెడన,గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 65 కి.మీ

గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామములో 24 ఎకరాల (38,880 చదరపు మీటర్లు) లో విస్తరించుకున్నఒక భారీ చెరువును, ఐదు సంవత్సరాల క్రితం, గ్రామీణ నీటి సరఫరా సంస్థ (R.W.S) కు అప్పగించినారు. ఈ చెరువు దాదాపు 250 క్యు.సెక్. ల నీటిని నిల్వ చేసే సామర్ధ్యం ఉన్నది. అప్పటి నుండి ఈ చెరువు, ఈ గ్రామములోని జలసంరక్షణతోపాటు, మండలంలోని 28 గ్రామాలలోని 13,000 మంది ప్రజల దాహార్తిని తీర్చుచున్నది. ప్రస్తుతం ఈ నీటి పథకం అభివృద్ధికి రు. 5 కోట్ల నిధులు మంజూరవగా, వీటిలో ఒకటిన్నర కోట్ల రూపాయలతో, చెరువు పూడికతీత మరియూ రీటైనింగ్ వాల్ నిరంఆణ పనులు చేపట్టబోవుచున్నారు.[1]

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం కమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక వేడుకలను 2016,మే-15 ఆదివారం నుండి 19వతేదీ గురువారం వరకు, ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించెదరు. 15వతేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు అమ్మవారు, చేవేండ్రపాలెంలోని, పుట్టింటికి చెందిన, కూనపరెడ్డి వంశీయుల ఇంటికి వెళ్ళి, అక్కడ పూజలు అందుకుంటారు. తిరిగి అదే రోజు సాయంత్రం ఊరేగింపుగా గ్రామంలోని ఆలయంలోనికి ప్రవేశించెదరు. ఇక అక్కడ నుండి ఉత్సవాలు ప్రారంభమగుతవి.[2]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు అమరావతి; 2015,మే-10; 14వపేజీ.
  2. ఈనాడు కృష్ణా; 2016,మే-12; 4వపేజీ.