ఉమ్మడి మొగుడు
స్వరూపం
| ఉమ్మడి మొగుడు (1987 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | భాస్కరరావు |
|---|---|
| తారాగణం | శోభన్ బాబు , రాధిక శరత్‌కుమార్, చంద్రమోహన్ |
| సంగీతం | కె. చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | కె.వి.వి. సత్యనారాయణ |
| భాష | తెలుగు |
ఉమ్మడి మొగుడు 1987లో విడుదలైన తెలుగు సినిమా. రాఘవేంద్ర మూవీ క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, రాధిక, కీర్తి , చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తిసంగీతాన్నందించాడు.[1]
తారగణం
[మార్చు]- శోభన్ బాబు
- కీర్తి
- చంద్రమోహన్
- రాధికా శరత్‌కుమార్
- గొల్లపూడి మారుతీరావు
- ఎం.ప్రభాకరరెడ్డి
- కాంతారావు
- జె.వి.సోమయాజులు
- సూర్యకాంతం
- వై.విజయ
- అనిత
- సుభ
- జయవాణి
- చిట్టిబాబు
- మదన్ మోహన్
- ఏచూరి
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాణ సంస్థ: రాఘవేంద్ర మువీ క్రియేషన్స్
- నిర్మాత: కె.వి.వి.సత్యనారాయణ
- సంగీతం: కె.చక్రవర్తి
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.భాస్కరరావు
- పాటలు: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందర రామమూర్తి,సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- మాటలు: మద్దిపట్ల సూరి, కొంపెల్ల సత్యం
- ఛాయా గ్రహణం: చెంగయ్య
- నృత్యాలు: సలీం
- కళ: కళాధర్
- కూర్పు: కె.సత్యం
- విడుదల తేదీ: 1987 ఫిబ్రవరి 5.
పాటల జాబితా
[మార్చు]1.శ్రీరస్తు ఇల్లాలి చిరునవ్వులు అలిగేటి ప్రియురాలి,
2.ముద్దబంతి ముద్దబంతి మందారంలా మారిందమ్మా చూడు,
3.రాక రాక వచ్చింది తొలకరి చినుకు లేక లేక ఇచ్చింది జీవితాన వెలుగు,
4.రాముడంటి మంచివాడ్ని కృష్ణుడంటి కొంటేవాడ్ని,
5.పైడిబొమ్మ ఇల్లాలికి పచ్చగాజులు నీరు పండు చూలాలికి,
బాహ్య లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Ummadi Mogudu (1987)". Indiancine.ma. Retrieved 2020-08-19.