ఎండ్లూరి సుధాకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆచార్య.ఎండ్లూరి సుధాకర్
ఆచార్య ఎండ్లూరి సుధాకర్
జననంఎండ్లూరి సుధాకర్
జనవరి 21, 1959
నిజామాబాద్ లోని పాముల బస్తి
మరణం28 జనవరి 2022
హైదరాబాదు
మరణ కారణంగుండెపోటు
వృత్తికేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు లో ఆచార్యుడుగా , పదవీ బాధ్యతల నిర్వహణ

ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ (21 జనవరి, 1959 - 28 జనవరి 2022) (ఆంగ్లం: Yendluri Sudhakar) జనవరి 21, 1959నిజామాబాద్ లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించాడు. ఇతడు కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు, తెలుగు సలహా మండలి సభ్యుడు, తెలుగు అకాడమీ సభ్యుడు, తెలుగు విశ్వవిద్యాలయం E.C మెంబర్ సభ్యులు,హిందీ, ఉర్దూ కవితలు మరియు ఉర్దూ పద్యాలు లఘు చిత్రాల అనువాదకుడు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

బాల్యం[మార్చు]

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959 లో నిజామాబాద్ లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు . ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి లకు ప్రథమ సంతానం . వీరికి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు .

విద్యాభ్యాసం[మార్చు]

హైదరాబాద్ వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్ లోనే సాగింది . నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం .ఏ . ఎం.ఫిల్, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం లో పిహెచ్ .డి చేసారు .

రచనలు[మార్చు]

పుస్తకం ప్రక్రియ ప్రచురణ సంవత్సరం
1.వర్తమానం కవితలు మానస ప్రచురణలు,రాజమండ్రి జూలై 1992, జనవరి 1995
2.జాషువా' నాకథ ' ఎం.ఫిల్ పరిశోధన మానస ప్రచురణలు,రాజమండ్రి జూలై 1992
3.కొత్త గబ్బిలం దళిత దీర్ఘ కావ్యం మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . సెప్టెంబరు 1998, సెప్టెంబరు 2011
4.నా అక్షరమే నా ఆయుధం డా .శరణ్ కుమార్ లింబాలే ఆత్మ కథకి అనువాదం ............. 1999,సెప్టెంబరు
5.మల్లె మొగ్గల గొడుగు మాదిగ కథలు దండోరా ప్రచురణలు,హైదరాబాదు అక్టోబరు 1999
6.నల్లద్రాక్ష పందిరి (DARKY) ఉభయ భాషా కవిత్వం జె .జె ప్రచురణలు,హైదరాబాదు జూన్ 2002
7.పుష్కర కవితలు కవితలు మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . 2003
8.వర్గీకరణీయం దళిత దీర్ఘ కావ్యం మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . బ్లాక్ డే, డిసెంబరు 2004, గుడ్ ఫ్రైడే మార్చి 2005
9."ఆటా "జనికాంచె... అమెరికా యాత్రా కవితలు మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . జూన్ 2006
10.జాషువా సాహిత్యం- దృక్పథం - పరిణామం పిహెచ్. డి సిద్ధాంత గ్రంథం 1993 మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . ఏప్రిల్ 2007
11.గోసంగి దళిత దీర్ఘ కావ్యం అంబేద్కర్ సాహితీ విభాగం, బొబ్బిలి, విజయనగరం జిల్లా మే 2011
12.కథానాయకుడు జాషువా జీవిత చరిత్ర తెలుగు అకాడమి,హైదరాబాదు 2012
13.నవయుగ కవి చక్రవర్తి జాషువా మోనో గ్రాఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు అకాడమి,హైదరాబాదు నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు, డిసెంబరు 27, 27, 28 2012
14.కావ్యత్రయం దీర్ఘ కావ్య సంకలనమ్ మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి .
15.సాహితీ సుధ దళిత సాహిత్య వ్యాసాలు మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . 9,నవంబరు,2016
16.తెలివెన్నెల సాహిత్య వ్యాసాలు మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . 21-1-2017

ఉద్యోగం[మార్చు]

జీవిక కోసం రకరకాల వృత్తులు చేసాక, 1985 నుంచి 1990 వరకు సికింద్రాబాద్ లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ గా ఉద్యోగం చేసారు.1990 అక్టోబరు 6 వ తేది నుంచి నేటి వరకు [1][2]లో వివిధ పదవుల్ని నిర్వహిస్తున్నారు. 2004 సం.నుంచి 2011 సం.వరకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించే 'వాజ్మయి' సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా . సంపాదకుడిగా వ్యవహరించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ గా ఆధునిక శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు. 2009, సెప్టెంబరు 5వ తేదీ నుంచి రాజమండ్రి సాహిత్య పీఠానికి ఆచార్యులుగా, డీన్ గా బాధ్యతలు నిర్వహించాడు.తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు.ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. వీరి పర్యవేక్షణలో సుమారు ఎనభై మూడు ఎం.ఫిల్ మరియు ఇరవై మందికి పైగా పి హెచ్ డి డిగ్రీలు పూర్తి చేశారు.సుమారు ఆరుగురు వీరి పరిశోధన పర్యవేక్షణ లో గోల్డ్ మెడల్స్ సాధించారు.

విదేశాల్లో సమావేశాలు[మార్చు]

  • అమెరికా తెలుగు అసోసియేషన్‌లో జరిగిన పలు సాహిత్య సభల్లో ప్రసంగించాడు – జూలై 2002
  • మారిషస్‌లో ప్రపంచ తెలుగు సదస్సు– 2011, డిసెంబర్ 8,9,10
  • మే 2017లో అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో సిలికాన్ ఆంధ్రా ద్వారా మనబడి కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్నాడు.

మరణం[మార్చు]

సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ 28 జనవరి 2022న గుండెపోటుతో హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య స్వర్గీయ డా. పుట్ల హేమలత, ఇద్దరు కుమార్తెలు మానస ఎండ్లూరి, మనోఙ్ఞ.[3]

పురస్కారాలు[మార్చు]

  • లలిత కళా పరిషత్ పురస్కారం, నల్గొండ -1980
  • స్లిష్టల వెంకటల్లు దీక్షితులు స్మారక సాంస్కృతిక సాహితీ కళా సమితి , యలమంచిలి- 1990
  • ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు -1992
  • ఉదయభారతి జాతీయ అవార్డు, భువనేశ్వర్-1993
  • కవికోకిల జోషువ పురస్కారం
  • తిలక్ అవార్డు, బెంగళూరు
  • గరికపాటి సాహిత్య పురస్కారం. కాకినాడ
  • సమతా రచయితల పురస్కారం .అమలాపురం
  • రాజమండ్రి ప్రతిభాపురస్కార్, రాజమండ్రి
  • జాసిస్ అవార్డు, రాజమండ్రి.
  • మ్యాన్ ఆఫ్ ది ఇయర్, రాజమండ్రి 1994-95
  • తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం
  • బి.ఎస్. రాములు కథా పురస్కారం .జగిత్యాల
  • ఎన్.జి.రంగాసెంటరీ అవార్డు
  • డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ అవార్డు-2002
  • అమెరికా తెలుగు అసోసియేషన్ATA , డల్లాస్ , జూలై 2002
  • సినారె పురస్కారం - కరీంనగర్ 2002
  • శ్రీ నెదురుమల్లి జనార్ధన రెడ్డి ట్రస్ట్ ప్రకాశం, నెల్లూరు, 2003
  • సహృదయ సాహితీ పురస్కారం, వరంగల్. 2004
  • కొండెపూడి శ్రీనివాసరావు కవితాపురస్కారం, గుంటూరు, 2005
  • ఆంధ్రప్రదేశ్ అధికారభాషా సంఘ పురస్కారం – 2006
  • ఆంధ్రప్రదేశ్ ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం-2007
  • గాడేపల్లి కుక్కుటేశ్వరరావు స్మారక పురస్కారం. అద్దంకి. 2009
  • తపన ఫౌండేషన్ అవార్డు, 2011, రాజమండ్రి
  • ప్రతిభావంతులైన విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులకు రాష్ట్ర అవార్డు, సెప్టెంబర్ -2012
  • కవి జాషువా సాహిత్య AP ప్రభుత్వ అవార్డు, 2012
  • రాజహంస కృష్ణ శాస్త్రి కవితా పురస్కారం, 2014 - పిఠాపురం
  • ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారం 2014. హైదరాబాద్
  • యువకళా వాహిని ద్వారా డాక్టర్ జి ఎన్ రెడ్డి మెమోరియల్ అవార్డు 2020
  • అరుణ్ సాగర్ ట్రస్ట్ ద్వారా కవి అరుణ్ సాగర్ మెమోరియల్ అవార్డు 2021.[4]

సూచికలు[మార్చు]

  1. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం
  2. సాహిత్యం పీఠం , నన్నయ ప్రాంగణం రాజమండ్రి
  3. Andhrajyothy (28 January 2022). "ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ మృతి". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.

ఇవికూడా చూడండి[మార్చు]