ఎం. జయశ్రీ
ఎం. జయశ్రీ | |
---|---|
జననం | 1921 మైసూరు, మైసూరు రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత కర్ణాటక, భారతదేశం) |
మరణం | 2006 అక్టోబరు 29ఆధారం చూపాలి] మైసూరు, కర్ణాటక, భారతదేశం | (వయసు 84–85)[
వృత్తి |
|
క్రియాశీలక సంవత్సరాలు | 1948–1996 |
ఎం. జయశ్రీ (1921-2006) ప్రధానంగా కన్నడ చిత్రాలలో పనిచేసిన భారతీయ నటి. రాయరా సోసే (1957), నాగరహావు (1972), ఎరడు కనసు, శ్రీ శ్రీనివాస కళ్యాణ వంటి చిత్రాలలో ఆమె సహాయక పాత్రలకు ప్రసిద్ధి చెందింది.
ఆమెను ప్రేమగా 'అమ్మ ఆఫ్ సిల్వర్ స్క్రీన్' అని పిలిచేవారు. 1970లో అమర భారతి చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకుంది.
కెరీర్
[మార్చు]తమిళ చిత్రం వజివిల్ తిరునాళ్ తో ఆమె అరంగేట్రం చేసింది.[1] దీనిని కన్నడ చిత్ర నిర్మాత హొన్నప్ప భాగవతర్ గమనించి, 1948లో వచ్చిన భక్త కుంభారా చిత్రంలో ఆమెకు అవకాశమిచ్చాడు. దీనితో ఆమె కన్నడ చిత్రసీమలోనూ అడుగుపెట్టింది.[2]
కన్నడలో ఆమె తదుపరి ప్రాజెక్ట్ 1949లో నాగకన్నిక, జి. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం.[3] జానపద కథ ఆధారంగా నిర్మించిన తొలి కన్నడ చిత్రం కూడా ఇదే. ఆమె 1951లో తిలోత్తమేలో టైటిల్ రోల్ పోషించింది. క్రమంగా ఆమె డా. రాజ్‌కుమార్, కళ్యాణ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, టైగర్ ప్రభాకర్, రాజేష్, గంగాధర్, శ్రీనాథ్.. ఇలా చాలా మంది ప్రముఖ నటులకు తల్లి, అత్త మొదలైన సహాయక పాత్రలకు మారింది. ఐదు దశాబ్దాల నటజీవితంలో జయశ్రీ దాదాపు 500 చిత్రాల వరకు నటించింది.
మరణం
[మార్చు]జయశ్రీ 2006 అక్టోబరు 29న తెల్లవారుజామున గుండెపోటుతో మైసూరులోని శ్రీ వాసవి శాంతిధామ అనే వృద్ధాశ్రమంలో మరణించింది.[1]
జీవిత చరమాంకంలో ఆమె వృద్ధాశ్రమంలో గడిపింది. 1990లలో జయశ్రీ కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది. ఆమె చివరి చిత్రం సవిరా మెట్టిలు, ఇది పుట్టన్న కనగల్ అసంపూర్తి చిత్రం, దీనిని కె. ఎస్. ఎల్. స్వామి పూర్తి చేసాడు.
పురస్కారాలు
[మార్చు]- 1970-71-'అమర భారతి' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు.
పాక్షిక ఫిల్మోగ్రఫీ
[మార్చు]తెలుగు
[మార్చు]- మంచి మనసుకు మంచి రోజులు (1956)
- అంతులేని కథ (1976)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ಬೆಳ್ಳಿತೆರೆಯ ಅಜರಾಮರ ಅಭಿನೇತ್ರಿ ಎಂ. ಜಯಶ್ರೀ" [Immortal actress of silver screen M. Jayashree]. The Newsism.com (in Kannada). 12 July 2017. Archived from the original on 21 జనవరి 2020. Retrieved 21 September 2020.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Bhakta Kumbara". nthwall.com. Archived from the original on 9 February 2015. Retrieved 21 September 2020.
- ↑ B V Shiva Shankar (16 March 2007). "Sepia stories at 60". The Hindu. Archived from the original on 9 May 2013.