ఎం. నారాయణరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. నారాయణరెడ్డి
ఎం. నారాయణరెడ్డి

ఎం. నారాయణరెడ్డి


మాజీ లోక్‌సభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు
పదవీ కాలం
1967 – 1971

లోక్‌సభ
ముందు హెచ్.సి.హెడా (భారత జాతీయ కాంగ్రెస్)
తరువాత ముదుగంటి రామగోపాల్ రెడ్డి (భారత జాతీయ కాంగ్రెస్)

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబరు 10, 1931
నిజామాబాదు, నిజామాబాదు జిల్లా, తెలంగాణ, భారతదేశం
మరణం ఫిబ్రవరి 2, 2020
నిజామాబాదు, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ (1982), తెలంగాణ రాష్ట్ర సమితి (2001)
నివాసం నిజామాబాదు, తెలంగాణ, భారతదేశం

ఎం. నారాయణరెడ్డి (సెప్టెంబరు 10, 1931 - ఫిబ్రవరి 2, 2020) తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బోధన్ శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు. విద్యావేత్తగా, రచయితగా, న్యాయవాదిగా గుర్తింపుపొందిన నారాయణ రెడ్డి 1969 నుండి 2001 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు.[1]

జననం[మార్చు]

నారాయణరెడ్డి 1931, సెప్టెంబరు 10న నిజామాబాదులో జన్మించాడు. చాదర్ ఘాట్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు.[2]

తెలంగాణ ఉద్యమం[మార్చు]

పార్లమెంట్ లో తెలంగాణ సాధన గురించి తొలిసారిగా 45 నిముషాలు మాట్లాడాడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకోసం యుపిఎ ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీపై హైకోర్టులో కేసువేసాడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

1967లో లోక్‌సభకు జరిగిన ఎన్నికలల్లో నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.సి.హెడాపై 20245 ఓట్ల తేడాతో గెలిచి, 1971 వరకు నిజామాబాదు ఎంపీగా పనిచేశాడు.[3] 1972లో కాంగ్రెస్ పార్టీ తరపున బోధన్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి గెలుపొందాడు.[4] అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 1984లో టిడిపి తరపున పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి బాలాగౌడ్ చేతిలో 2547 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.[5][6]

నిర్వహించిన పదవులు[మార్చు]

  1. అధ్యక్షుడు, రాష్ట్ర చెరకు రైతు సంఘం

మరణం[మార్చు]

నారాయణ రెడ్డి అనారోగ్యంతో నిజామాబాదులోని మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020, ఫిబ్రవరి 2న మరణించాడు.[7][8][9]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, నిజామాబాదు (2 February 2020). "మాజీ ఎంపీ నారాయణ రెడ్డి ఇక లేరు". Archived from the original on 2 ఫిబ్రవరి 2020. Retrieved 2 February 2020.
  2. "Members Bioprofile". Lok Sabha. Retrieved 2 February 2020.
  3. "All Members of Lok Sabha (Since 1952)". Lok Sabha. Retrieved 2 February 2020.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1972". www.elections.in. Archived from the original on 2 ఫిబ్రవరి 2020. Retrieved 2 February 2020.
  5. Sakshi (19 March 2019). "మీకు ఓటెయ్యబోమని ముందే నిక్కచ్చిగా చెప్పేవారు." Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  6. EENADU (19 April 2024). "హ్యాట్రిక్‌ వీరులు ఇద్దరు". Archived from the original on 19 April 2024. Retrieved 19 April 2024.
  7. "Torchbearer of early Telangana movement and ex-MP Narayana Reddy passes away in Nizamabad". The Hindu. 2 February 2020. Retrieved 2 February 2020.
  8. "నిజామాబాద్ మాజీ ఎంపీ కన్నుమూత". Sakshi TV. 2 February 2020. Retrieved 2 February 2020.
  9. "మాజీ ఎంపీ నారాయణరెడ్డి కన్నుమూత". ABN Andhra Jyothi. 2 February 2020. Retrieved 2 February 2020.[permanent dead link]