Jump to content

ఎం. రామకృష్ణారెడ్డి

వికీపీడియా నుండి

ఎం. రామకృష్ణారెడ్డి (1948 మార్చి 8 - 2022 మే 25) ప్రముఖ సినీనిర్మాత. అభిమానవంతులు చిత్రం ద్వారా 1973లో సినీరంగ ప్రవేశం చేసారు.

ప్రారంభ జీవితం

[మార్చు]

1948 మార్చి 8న నెల్లూరు జిల్లా గూడూరులో మస్తానమ్మ, ఎం సుబ్బరామరెడ్డి దంపతులకు ఎం. రామకృష్ణారెడ్డి జన్మించారు. మైసూరు యూనివర్శిటీలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేశారు. అనంతరం తయారీ రంగానికి సంభందించిన వ్యాపారాన్ని నిర్వహిస్తుండేవారు. అప్పుడు తన బంధువు ఎంఎస్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయన చిత్రసీమలోకి అడుగుపెట్టారు.

సినిమా కెరీర్

[మార్చు]

1973లో శ్రీ రామకృష్ణా ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి రంగనాథ్, శారద కాంబినేషన్ లో అభిమానవంతులు సినిమా రూపొందించారు. ఈ సినిమాలో ఎస్వి రంగారావు, రాజబాబు, అంజలీ దేవి, రమాప్రభ ముఖ్య పాత్రల్లో నటించగా ఈ మూవీతోనే ఫటాఫట్ జయలక్ష్మి, శోభానాయుడులను సినీ పరిశ్రమకు ఆయన పరిచయం చేసారు. వాకాడ అప్పారావుతో కలిసి చంద్ర మోహన్ హీరోగా ఆయన మూడిళ్ల ముచ్చట సినిమా చేశారు. కృష్ణ హీరోగా అగ్ని కెరటాలు, శోభన్ బాబు హీరోగా అల్లుడుగారు జిందాబాద్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. వైకుంఠపాళి, గడుసుపిల్లోడు, సీతాపతి సంసారం, మావూరి దేవత లాంటి చిత్రాలను నిర్మించారు. అమ్మోరుతల్లి చిత్రాన్ని డబ్ చేసి విజయం సాధించారు.

మరణం

[మార్చు]

ఎం. రామకృష్ణారెడ్డి 2022 మే 25న అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు.[1] ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Senior Producer M Ramakrishna Reddy passes away | టాలీవుడ్‌‌లో మరో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత– News18 Telugu". web.archive.org. 2022-05-26. Archived from the original on 2022-05-26. Retrieved 2022-05-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)