ఎం. సుధీర్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మారేపల్లి సుధీర్‌ కుమార్‌

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2000 నుండి 2006

వ్యక్తిగత వివరాలు

జననం 1962 ఆగష్టు 30
ములుకనూర్ గ్రామం, భీమదేవరపల్లి మండలం, హనుమకొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
తల్లిదండ్రులు మారెపల్లి జాన్‌, కిరీటమ్మ
జీవిత భాగస్వామి శోభారాణి
సంతానం సుజన్ కుమార్, సుకీర్తి
నివాసం హనుమకొండ
వృత్తి రాజకీయ నాయకుడు, వైద్యుడు

మారేపల్లి సుధీర్‌ కుమార్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున వరంగల్ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.[1][2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఎం. సుధీర్‌ కుమార్‌ 1962 ఆగష్టు 30న హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం, ములుకనూర్ గ్రామంలో మారెపల్లి జాన్‌, కిరీటమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌లో ఎండీ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

ఎం. సుధీర్‌ కుమార్‌ వొడితల రాజేశ్వర్ రావు, వి.లక్ష్మీకాంత రావుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తరువాత 2001లో టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యత్వం తీసుకొని ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగాను పని చేశాడు. ఆయన 1995లో ములుకనూర్ ఎంపీటీసీగా గెలిచి 1995 నుండి 2000 వరకు భీమదేవరపల్లి మండల పరిషత్తు అధ్యక్షుడిగా, ఆ తరువాత 2000లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో భీమదేవరపల్లి నుండి జెడ్పిటిసిగా ఎన్నికై 2000 నుండి 2006 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్‌గా పని చేశాడు.


ఎం. సుధీర్‌ కుమార్‌ 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్కతుర్తి నుండి జెడ్పిటిసిగా ఎన్నికై హనుమకొండ జిల్లా పరిషత్తు చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[4][5] ఆయనను 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున వరంగల్ పార్లమెంట్‌ అభ్యర్థిగా ఏప్రిల్ 12న బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.[6][7]

మూలాలు[మార్చు]

  1. Sakshi (12 April 2024). "వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా సుధీర్‌కుమార్‌". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  2. The Hindu (12 April 2024). "BRS names M. Sudheer Kumar as its candidate for Warangal LS seat" (in Indian English). Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  3. Eenadu (13 April 2024). "తొలిసారి బరి.. ఎంపీ పీఠంపై గురి". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  4. The Hindu (8 June 2019). "New zilla parishad chairpersons". Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 28 January 2022.
  5. Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.
  6. NT News (13 April 2024). "సుధీర్‌ మాదిగకే టికెట్‌.. వరంగల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉద్యమ నేత". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  7. Sakshi (13 April 2024). "ఉద్యమ నేతకు అవకాశం". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.