ఎత్తుకు పైఎత్తు (1958 సినిమా)
ఇదే పేరుగల మరొక సినిమా కోసం ఎత్తుకు పైఎత్తు (1978 సినిమా) చూడండి.
ఎత్తుకు పైఎత్తు (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాపీ చాణక్య |
---|---|
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎం.బాలయ్య, జానకి, రేలంగి, లక్ష్మీరాజ్యం, ఛాయాదేవి |
సంగీతం | మాస్టర్ వేణు |
నిర్మాణ సంస్థ | సారథీ స్టూడియోస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఎత్తుకు పైఎత్తు తాపీ చాణక్య దర్శకత్వంలో సారథీ స్టూడియోస్ 1958లో నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రం ద్వారా బాలయ్య వెండితెరకు పరిచయమయ్యాడు.
కథ
[మార్చు]గోవిందయ్య, కైలాసం అనే ఇద్దరు పెద్దలు, ఒకానొక కీర్తిశేషుడు ఊళ్ళో పాఠశాలకోసం ఇచ్చిన డబ్బును కాజేయాలని చూస్తారు. అలాగే పొత్తుకుదరక పోట్లాడుకుంటున్న దంపతుల్ని విడదీసి మనోవర్తి దావాల మీద వాళ్ళని కోర్టుల వెంట తిప్ప్పి చెరిసగం పంచుకు తినబోతారు. బడి కూలిపోతే అదే బాగని అక్కడ మిల్లు కట్టబోతాడు గోవిందయ్య. అతనెక్కడ బాగుపడతాడోనని కైలాసం కంగారు పడతాడు. వీళ్ళ మూలాన చీలికలైపోయిన ఊళ్ళో జనం వీళ్ళ ఘోరాలు తెలిసికూడా ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. ఎన్నికల వేళకు వాళ్ళు కళ్ళు తెరుస్తారు. బడిపంతులూ, గోవిందయ్య మేనల్లుడు రాజా జనానికి పరిస్థితులు వివరించి చెబుతారు. తరువాత అంతా కూడబలుక్కుని వంచకుల ఎత్తులకు పై యెత్తు వేసి, వాళ్ళకు బుద్ధి చెప్పి ఊరు బాగుచేసుకుంటారు.[1]
సాంకేతికవర్గం
[మార్చు]- కథ: నాగార్జున
- మాటలు: తాపీ ధర్మారావు, నార్ల చిరంజీవి, కొండేపూడి
- పాటలు: కొసరాజు రాఘవయ్యచౌదరి, తాపీ ధర్మారావు
- సంగీతం: వేణు
- నృత్యాలు: వేదాంతం జగన్నాథశర్మ
- కళ:వి.సూరన్న
- కూర్పు: సంజీవి
- ఛాయాగ్రహణం:యూసుఫ్ మూల్జి
నటీనటులు
[మార్చు]- గుమ్మడి
- సి.ఎస్.ఆర్.
- రేలంగి
- లక్ష్మీరాజ్యం
- వల్లం నరసింహారావు
- నాగయ్య
- షావుకారు జానకి
- బాలయ్య
- పెరుమాళ్ళు
- నిర్మలాదేవి
- ఛాయాదేవి
- పార్వతి
- హేమలత
- బొడ్డపాటి
- సుబ్రహ్మణ్యం
- కుమారి బాల
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు వేణు సంగీతం సమకూర్చాడు.[2]
క్ర.సం. | పాట | పాడినవారు | రచయిత |
---|---|---|---|
1 | ఊగండి ఊగండి ఉయ్యాల సాగండి సాగండి జంపాల | జిక్కి బృందం | కొసరాజు |
2 | అంది అందనిలాగ ఆకాశమేలేవు ఆగి మచ్చిక మాట | పి.సుశీల | తాపీ ధర్మారావు |
3 | ఎవడనుకున్నాడెవడనుకున్నాడు ఇట్లాఉండే పిచ్చాలన్నా | ఘంటసాల | కొసరాజు |
4 | ఏందో చెప్పండి చూద్దాం ఏందో చెప్పండి | జిక్కి బృందం | కొసరాజు |
5 | జూటా మాటల్తొ ఎందుకయ్యా మనకంతా | ఘంటసాల, ఎస్.జానకి బృందం | కొసరాజు |
6 | సిక్కింది సేతులో కీలుబొమ్మా ఇది ఎక్కడికి పోతావే తోలుబొమ్మ | ఘంటసాల, ఎస్.జానకి బృందం | కొసరాజు |
7 | శరభ శరభ అశరభా ఏలుకో కోటయ్య ఏలుకో | ఘంటసాల, జిక్కి బృందం | కొసరాజు |
8 | ఎవరేమన్నా మనకేమి ఎక్కడవున్నా మనకేమి | కొసరాజు |
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (12 January 1958). "సారథీ స్టూడియోస్ వారి 'ఎత్తుకు పై యెత్తు '". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 26 January 2020.[permanent dead link]
- ↑ కొల్లూరు భాస్కరరావు. "ఎత్తుకుపైఎత్తు 1968". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 26 జనవరి 2020. Retrieved 26 January 2020.