ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు


ఒకరు చెప్పే పచ్చి అబద్ధాన్ని మరొకరు గుడ్డిగా సమర్థిస్తున్నారనే అర్థంలో దీన్ని వాడుతారు.

ఎద్దు ఈనడమనేది ఘోరమైన అబద్ధం, అసంబద్ధం.. చిన్నపిల్లలు కూడా నమ్మరు. అంతటి దారుణమైన అబద్ధం ఒకరు చెప్తే.. దాన్ని నిజమేనని భావించి గానీ, ఈ అబద్ధానికి గౌరవాన్ని ఆపాదించే ఉద్దేశంతో గానీ, ఇతరులచేత ఈ అబద్ధాన్ని నమ్మించే దురాలోచనతో గాని, దానికి మరింత మసాలా జోడించే సందర్భంలో ఈ సామెతను వాడతారు. సాధారణంగా అబద్ధాన్ని ఇతరులచేత నమ్మించే ప్రయత్నం జరిగిన సందర్భంలోనే వాడతారు.

ఒక ప్రసిద్ధ ఉదాహరణ
2006 జనవరిలో ఆంధ్ర ప్రదేశ్లో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు బి.వి.రాఘవులు నీటిపారుదల ప్రాజెక్టుల్లో వెయ్యికోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించాడు. మరుసటి రోజు ఈనాడు పత్రిక ఆ విషయానికి సంబంధించి ఒక కార్టూను ప్రకటించింది. అవినీతి ఆరోపణలు సహజంగానే ముఖ్యమంత్రికి నచ్చవు. దీంతో కోపించిన ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈనాడును విమర్శిస్తూ ఎద్దు ఈనిందని రాఘవులన్నాడు, దూడను కట్టెయ్యమని ఈనాడంటోంది, అని అన్నాడు.

ఇటువంటిదే మరో సామెత ఉంది:అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు. అయితే ఇది వాడే సందర్భం మాత్రం వేరు.