Jump to content

ఎల్.ఎస్.ఎన్. ప్రసాద్

వికీపీడియా నుండి
ఎల్.ఎస్.ఎన్. ప్రసాద్
జననం(1914-01-01)1914 జనవరి 1
మరణం2009 ఏప్రిల్ 22(2009-04-22) (వయసు 95)
పాట్నా, బీహార్
సమాధి స్థలంపాట్నా
25°06′00″N 85°01′00″E / 25.10000°N 85.01667°E / 25.10000; 85.01667
ఇతర పేర్లులాలా సూరజ్ నందన్ ప్రసాద్
వృత్తిపిల్లల వైద్యం
క్రియాశీల సంవత్సరాలు1939–2009
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Development of pediatrics in Bihar
జీవిత భాగస్వామిశకుంతలా దేవి
పిల్లలు8
పురస్కారాలుపద్మశ్రీ

లాలా సూరజ్ నందన్ ప్రసాద్ (1914–2009) భారతీయ శిశువైద్యుడు, పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మాజీ పిల్ల వైద్య ప్రొఫెసర్. పిల్ల వైద్య విభాగ[1] స్థాపన వెనుక, సంస్థ లోని పిల్లల వార్డును 250 పడకల పిల్లల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం వెనుక అతని కృషి ఉంది.[2][3] 1964 లో ఇండియన్ పీడియాట్రిక్ సొసైటీ, అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఆఫ్ ఇండియాలు విలీనమైనప్పుడు అతను ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. [4] భారత ప్రభుత్వం 1974 లో అతనికి నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది [5]

జీవిత చరిత్ర

[మార్చు]

లాలా సూరజ్ నందన్ ప్రసాద్ 1914 నూతన సంవత్సరం రోజున బీహార్ షరీఫ్ [2] లో బాబూ రామ్ ప్రసాద్ లాల్వాస్ అనే న్యాయవాదికి జన్మించాడు.[3] అతను 1933 లో దుమ్కా జిల్లా స్కూల్ నుండి మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించి భాగల్పూర్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచి, మెక్‌ఫెర్సన్ గోల్డ్ మెడల్ సాధించాడు. 1939 లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మెడికల్ కాలేజ్ నుండి పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి MBBS ఉత్తీర్ణుడయ్యాడు.[2] దానాపూర్, గోపాల్‌గంజ్, [2] [6] లో ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాత, 1940 లో తాను చదువుకున్న కాలేజీ లోనే డిప్యూటీ సూపరింటెండెంట్‌గా చేరాడు. 1945 వరకు అక్కడ పనిచేశాక,[2] ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడ పిల్లల ఆరోగ్యంలో డిప్లొమా పూర్తి చేశాడు.[3] అతను UK లోనే ఉంటూ, 1946లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నుండి MRCP పొందాడు. ఆ తర్వాత 1947 వరకు అక్కడ అనారోగ్యంతో ఉన్న పిల్లల కోసం హాస్పిటల్, రాయల్ ఇన్‌ఫర్మరీ ఆఫ్ ఎడిన్‌బర్గ్, లండన్ హాస్పిటల్ వంటి సంస్థలలో పనిచేశాడు.[3]

1947 లో ప్రసాద్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1948 లో పాట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మెడిసిన్ విభాగంలో లెక్చరర్‌గా చేరి, 1962 లో ప్రొఫెసరయ్యాడు.[6] అక్కడ తన పదవీకాలంలో, పీడియాట్రిక్స్ విభాగాన్ని ప్రారంభించాడు. తరువాత, పిల్లల వార్డును 250 పడకల సామర్థ్యంతో ఆసుపత్రిగా అభివృద్ధి చేశాడు.[2] అతను పాట్నాలోని రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు గౌరవ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. [7] అరవైల ప్రారంభంలో ప్రసాద్, జార్జ్ కోయెల్హోతో కలిసి అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఆఫ్ ఇండియాను, ఇండియన్ పీడియాట్రిక్ సొసైటీనీ 1964లో ఒక గొడుగు కింద విలీనం చేశాడు [1] కొత్త సంస్థ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కు ప్రసాద్ వ్యవస్థాపక అధ్యక్షుడయ్యాడు. [4] అతను 1971 డిసెంబరు 31 న [6] న పాట్నా మెడికల్ కాలేజ్ నుండి రిటైరయ్యాడు. అయితే వివిధ వైద్య కమిటీలతో ఉన్న అనుబంధంతో తన కార్యకలాపాలను కొనసాగించాడు.

వివిధ వైద్య సమావేశాలలో 50కి పైగా పరిశోధనా పత్రాలను [6] సమర్పించిన ప్రసాద్, [8] రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ (1964), అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (1964), ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (1974)లో సభ్యుడు.[3] [7] నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాజీ ఉపాధ్యక్షుడైన ప్రసాద్ 1974లో పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా నియమితుడయ్యాడు. [3] [7] అదే సంవత్సరం, భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.[5] ప్రసాద్ 2009 ఏప్రిల్ 22 న 95 సంవత్సరాల వయస్సులో పాట్నా నివాసంలో మరణించాడు, అతనికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అతని భార్య శకుంతలా దేవి అతని కంటే ముందు మరణించింది.[3][2] [6] అతని గౌరవార్థం పాట్నాలో డాక్టర్ లాలా సూరజ్ నందన్ ప్రసాద్ మెమోరియల్ క్లినిక్ పేరుతో ఆరోగ్య కేంద్రాన్ని స్థాపించారు.[9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "IAP History". Indian Academy of Pediatrics. 2015. Retrieved 7 June 2015."IAP History". Indian Academy of Pediatrics. 2015. Retrieved 7 June 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "IAP History" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Lala Suraj Nandan Prasad is dead". Bihar Times. 23 April 2009. Archived from the original on 22 May 2015. Retrieved 7 June 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Lala Suraj Nandan Prasad is dead" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "Lala Surajnandan Prasad". Slide Share. 2015. Retrieved 7 June 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Lala Surajnandan Prasad" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. 4.0 4.1 "Past Presidents". Indian Academy of Pediatrics. 2015. Retrieved 7 June 2015."Past Presidents". Indian Academy of Pediatrics. 2015. Retrieved 7 June 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Past Presidents" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. 5.0 5.1 "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 "Fruitful and purposeful life". Pratap Pharmaceuticals. 2015. Retrieved 7 June 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Fruitful and purposeful life" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  7. 7.0 7.1 7.2 "Obituary" (PDF). National Academy of Medical Sciences. 2015. Retrieved 7 June 2015.
  8. "1979 Symposium on Recent Advances in Clinical Practice". B.R.Singh Hospital & Centre For Medical Education & Research. 2015. Archived from the original on 19 May 2017. Retrieved 7 June 2015.
  9. "Lala Suraj Nandan Prasad Memorial Clinic". Here. 2015. Retrieved 7 June 2015.