ఏటీఎం (వెబ్ సిరీస్)
ఏటీఎం | |
---|---|
దర్శకత్వం | సి.చంద్రమోహన్ |
రచన | హరీష్ శంకర్ .ఎస్ |
నిర్మాత | దిల్ రాజు |
ఛాయాగ్రహణం | మౌనిక్ కుమార్.జి |
సంగీతం | ప్రశాంత్ ఆర్.విహారి |
నిర్మాణ సంస్థ | దిల్ రాజు ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 20 జనవరి 2023[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఏటీఎం 2023లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన వెబ్ సిరీస్ కు సి.చంద్రమోహన్ దర్శకత్వం వహించాడు. వీజే సన్నీ, సుబ్బరాజు, పృథ్వీరాజ్, కృష్ణ బూరుగుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ జనవరి 20న జీ5 ఓటీటీలో విడుదలైంది.[2]
కథ
[మార్చు]జగన్ (వీజే సన్నీ) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జల్సా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు జగన్ పాత కారును కొట్టేసి అమ్మేయగా ఆ కారులో రూ.10 కోట్లు విలువ చేసే డైమండ్స్ ఉంటాయని జగన్‌కు తర్వాత తెలుస్తుంది. డైమండ్ ఓనర్ జగన్, అతని స్నేహితులను పట్టుకుని డైమండ్స్ లేదా రూ.10 కోట్లు డబ్బు ఇవ్వమని, లేదా చంపేస్తానని బెదిరిస్తాడు, దింతో 10 రోజుల సమయం అడిగిన జగన్ ఆ క్రమంలో ఏటీఎంకు డబ్బులు తీసుకెళ్లే వాహనాన్ని దొంగలించగా ఆ వ్యానులో వాళ్లకు రూ.25 కోట్లు దొరుకుతాయి. పోలీసులు ఈ చోరీ కేసును ఛేదించేందుకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ హెగ్డే (సుబ్బరాజు)కు అప్పగిస్తారు. హెగ్డే దొంగలను ఎలా పట్టుకుంటాడు? రూ.25 కోట్లు ఎలా రికవరీ చేశాడు? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- వీజే సన్నీ
- సుబ్బరాజు
- పృథ్వీరాజ్
- కృష్ణ బూరుగుల
- రవిరాజ్
- రాయల్ శ్రీ
- దివి
- దివ్యవాణి
- షఫీ
- హర్షిణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్స్
- నిర్మాత: హర్షిత్ రెడ్డి, హన్షిత
- కథ: హరీష్ శంకర్ .ఎస్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సి.చంద్రమోహన్
- సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
- సినిమాటోగ్రఫీ: మౌనిక్ కుమార్ .జి
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (13 January 2023). "'ఏటీఎం'.. 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ A. B. P. Desam (20 January 2023). "'ఏటీఎం' వెబ్ సిరీస్ రివ్యూ : వీజే సన్నీ దొంగతనం సక్సెసా? ఫెయిలా?". Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.
- ↑ NTV Telugu (20 January 2023). "ఏటీఎం (వెబ్ సిరీస్-జీ5)". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.