ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 38
Appearance
ఐరాస భద్రతామండలి తీర్మానం 38 | |
---|---|
తేదీ | జనవరి 17 1948 |
సమావేశం సం. | 229 |
కోడ్ | S/RES/38 (Document) |
విషయం | భారత పాకిస్తాన్ సమస్య |
వోటింగు సారాంశం | 9 అనుకూల వోట్లు సున్నా ప్రతికూల వోట్లు 2 ఆబ్సెంటు |
ఫలితం | ఆమోదం |
భద్రతాసమితి కూర్పు | |
శాశ్వత సభ్యులు | |
Non-permanent members |
కాశ్మీరు సమస్యపై 1948 జనవరి 17 న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 38 ని అమోదించింది. కాశ్మీరు పరిస్థితిని ఏ విధంగానూ తీవ్రతరం చేయకుండా ఉండాలనీ, పరిస్థితిని మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలనీ భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలకు ఐరాస ఈ తీర్మానంలో పిలుపునిచ్చింది. సమస్య మండలి పరిశీలనలో ఉండగా పరిస్థితిలో ఏదైనా భౌతికమైన మార్పులు ఏర్పడితే తనకు తెలియజేయాలని ఇది ఇరుపక్షాలనూ అభ్యర్థించింది.
ఈ తీర్మానానికి అనుకూలంగా తొమ్మిది ఓట్లు రాగా, వ్యతిరేకంగా వోట్లేమీ రాలేదు. ఉక్రెయిన్, సోవియట్ యూనియన్లు వోటింగులో పాల్గొనలేదు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల జాబితా 1 నుండి 100 (1946-1953)