ఒ.ఎస్.త్యాగరాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒ.ఎస్.త్యాగరాజన్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుఒ.ఎస్.టి.
జననం (1947-04-03) 1947 ఏప్రిల్ 3 (వయసు 77)
మూలంతంజావూరు, భారతదేశం
సంగీత శైలిభారతీయ శాస్త్రీయ సంగీతం
వృత్తిగాయకుడు

ఒ.ఎస్.త్యాగరాజన్ (జ. 3 ఏప్రిల్ 1947[1]) చెన్నైకి చెందిన కర్ణాటక గాత్ర విద్వాంసుడు.

విశేషాలు

[మార్చు]

ఇతని తండ్రి ఒ.వి.సుబ్రహ్మణ్యం సంగీత విద్వాంసుడు. ఇతడు మొదట తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తరువాత టి.ఎం.త్యాగరాజన్ వద్ద శిక్షణ పొందాడు. లాల్గుడి జయరామన్ ఇతడు వృత్తిలో ఎదగడానికి సహాయపడ్డాడు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఎ- గ్రేడు కళాకారుడిగా ఇతడు అనేక కచేరీలను చేశాడు. ఇతడు చెన్నైలోని అన్ని పేరున్న సంగీతసభలతోపాటుగా దేశంలోని పలు ప్రాంతాలలో కార్యక్రమాలను చేశాడు. ఇతడి గాత్రానికి లాల్గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, వి.వి.సుబ్రహ్మణ్యం వయోలిన్ వాద్యంతో, పాల్గాట్ మణి అయ్యర్, టి.కె.మూర్తి, పాల్గాట్ ఆర్.రఘు, కరైకుడి మణి, త్రిచి శంకరన్, ఉమయల్పురం కె.శివరామన్ మృదంగ వాద్యంతో, జి.హరిశంకర్ కంజీరతో, విక్కు వినాయకరం ఘటవాద్యంతో సహకారాన్ని అందించారు.[2] ఇతడు అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా, సింగపూర్, మధ్య ఆసియా దేశాలు, మలేసియా, హాంగ్ కాంగ్, దక్షిణ ఆఫ్రికా, ఐరోపా దేశాలు వంటి అనేక దేశాలలో పర్యటించి అక్కడ సంగీత కచేరీలు చేశాడు. అన్నామలై విశ్వవిద్యాలయంలో లలితకళల విభాగానికి ఇతడు డీన్‌గా ఐదు సంవత్సరాలు పనిచేశాడు. ఎంతో మంది శిష్యులకు సంగీత శిక్షణను ఇచ్చాడు.

అవార్డులు, గౌరవాలు

[మార్చు]
ఉమయల్పురం కె.శివరామన్‌తో ఒ.ఎస్.త్యాగరాజన్
 • సంగీత నాటక అకాడమీ అవార్డు
 • శ్రీకృష్ణ గానసభ, చెన్నై వారిచే "సంగీత చూడామణి"
 • కళాసాగరం, హైదరాబాదు వారిచే "సంగీత కళాసాగర"
 • సంగీత సామ్రాజ్యం, మదురై వారిచే "నాద గాన కళా ప్రవీణ"
 • షణ్ముఖానంద సంగీత సభ, న్యూఢిల్లీ వారిచే "నాద భూషణం"
 • వాణీ మహల్ వారిచే "వాణీ కళాసుధాకర"
 • ఇండియన్ ఫైన్ ఆర్ట్స్, చెన్నై వారిచే "జి.ఎన్.బాలసుబ్రమణియం అవార్డు"
 • చెన్నై కల్చరల్ అకాడమీ వారిచే "కళాశిరోమణి"

వివాదాలు

[మార్చు]

ఇండియా #మీటూ ఉద్యమంలో భాగంగా గాయిని చిన్మయి తన ట్విట్టర్ అకౌంటులో ఒ.ఎస్.త్యాగరాజన్‌చే లైంగిక వేధింపులకు గురైన వారి వివరాలు బయటపెట్టింది.[3] మరొక ప్రవాస భారతీయ కర్ణాటక సంగీత విద్యార్థిని చేసిన లైంగిక ఆరోపణలు సోషియల్ మీడియాలో వివరంగా ప్రచురింపబడింది.[4] దీనితో మద్రాస్ సంగీత అకాడమీ ఇతని, ఆరోపణలు ఎదుర్కొన్న మరికొందరు కళాకారుల కచేరీలను 2018, 19 సంవత్సరాలలో రద్దు చేసింది.

మూలాలు

[మార్చు]
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-28. Retrieved 2021-02-27.
 2. http://www.lokvani.com/lokvani/article.php?article_id=9297
 3. "Chinmayi Sripaada on Twitter". Twitter (in ఇంగ్లీష్). Retrieved 2018-10-13.
 4. "'OS Thyagarajan molested me': Carnatic singer's former student speaks out". The News Minute. 2018-10-12. Retrieved 2018-10-13.

బయటి లింకులు

[మార్చు]