జి.హరిశంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.హరిశంకర్
వ్యక్తిగత సమాచారం
జననం(1958-06-10)1958 జూన్ 10
చెన్నై, తమిళనాడు
మరణం2002 ఫిబ్రవరి 11(2002-02-11) (వయసు 43)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాద్య కళాకారుడు
వాయిద్యాలుకంజీర

గోవిందరావు హరిశంకర్, (1958-2002) ఒక కర్ణాటక సంగీత కంజీర వాద్య కళాకారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు చెన్నై నగరంలో 1958, జూన్ 10వ తేదీన జన్మించాడు. ఇతడు సంగీతంలో ప్రాథమిక శిక్షణను తన తండ్రి గోవిందరావు వద్ద తీసుకున్నాడు. తరువాత ఇతడు రామనాథపురం సి.ఎస్.మురుగభూపతి వద్ద, అటు పిమ్మట పాల్గాట్ మణి అయ్యర్ వద్ద నేర్చుకున్నాడు. ఇతడు ఆకాశవాణి, చెన్నై కేంద్రం నిలయ విద్వాంసుడు. ఇతడు ఎం.ఎల్.వసంతకుమారి, కారైకుడి మణి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, మాండొలిన్ శ్రీనివాస్, మల్లాది సోదరులు, త్రిచ్చి శంకరన్, లాల్గుడి ఎల్.కృష్ణన్ మొదలైన సంగీత విద్వాంసులకు పక్కవాద్యాన్ని అందించాడు[1]. ఇతడు లయచిత్ర, శ్రుతిలయ, గ్రాండ్ ఫినాలె వంటి అనేక సంగీత ఆల్బమ్‌లలో కంజీర ధ్వనిని వినిపించాడు.

ఇతని శిష్యులలో సి.పి.వ్యాసవిఠల, బెంగళూరు అమృత్, నెర్కుణం శంకర్ మొదలైన వారున్నారు. వారు అనేక మంది శిష్యులను కంజీర విద్వాంసులుగా తయారు చేసి తరువాతి తరానికి కంజీర వాద్య సంప్రదాయాన్ని విస్తరిస్తున్నారు.

1997లో ఇతనికి "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ కళైమామణి పురస్కారాన్ని ప్రకటించింది.[2] కేంద్ర సంగీత నాటక అకాడమీ 2001లో కర్ణాటక సంగీతం వాద్యవిభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును ఇతనికి ఇచ్చి సత్కరించింది. ఈ అవార్డు పొందిన ఏకైక కంజీర విద్వాంసుడు ఇతడే.[1]

ఇతడు బొల్లి వ్యాధి గ్రస్తుడు.[3]

ఇతడు తన 44వ యేట చెన్నై నగరంలో 2002, ఫిబ్రవరి 11వ తేదీన మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 " The Kanjira falls silent", by Aruna Subbiah, KutcheriBuzz Magazine (online edition); February 20, 2002; Madras
  2. web master. "G. Harishankar". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 11 March 2021.[permanent dead link]
  3. Centers, S. (2005). "Famous People with Albinism". SARA-Foundation.com. Campbell, California: Supporting Albinism Research and Awareness. Archived from the original on 2008-04-23. Retrieved 2008-04-26.