Jump to content

సి.ఎస్.మురుగభూపతి

వికీపీడియా నుండి
రామనాథపురం సి.ఎస్.మురుగభూపతి
వ్యక్తిగత సమాచారం
జననం(1914-02-14)1914 ఫిబ్రవరి 14
మూలంభారతదేశం
మరణం1998 మార్చి 21(1998-03-21) (వయసు 84)
సంగీత శైలిభారత శాస్త్రీయ సంగీతం
వృత్తిమృదంగ విద్వాంసుడు
వాయిద్యాలుమృదంగం

రామనాథపురం సి.ఎస్.మురుగభూపతి (1914-1998) ఒక కర్ణాటక సంగీత మృదంగ విద్వాంసుడు. ఇతడు పాల్గాట్ మణి అయ్యర్ (1912-1981), పళని సుబ్రమణియం పిళ్ళై (1908-1962)ల సమకాలికుడు. ఈ ముగ్గురు విద్వాంసులను "మార్దంగిక త్రిమూర్తులు" అని పిలిచేవారు.[1]

ఆరంభ జీవితం

[మార్చు]

చల్లస్వామి సిర్చాబాయి మురుగభూపతి 1914, ఫిబ్రవరి 14న తమిళనాడు రాష్ట్రానికి చెందిన రామనాథపురంలో జన్మించాడు. ఇతడు మృదంగంలో ప్రాథమిక పాఠాలు తన తండ్రి సిర్చాబాయి సర్వై వద్ద[2] తరువాత పళణి ముత్తయ్య పిళ్ళై వద్ద నేర్చుకున్నాడు.ఇతడు తన మృదంగశైలిని అభివృద్ధి చేసుకోవడంలో తన సోదరుడు సి.ఎస్.శంకరశివం భాగవతార్ ప్రభావం ఎక్కువగా ఉంది.[2][3]కుంభకోణం అళగనంబి పిళ్ళై ఇతడికి మృదంగంలో కొన్ని మెళకువలు నేర్పాడు.[1]

ముఖ్యమైన కచేరీలు

[మార్చు]

ఇతడు అరియకుడి రామానుజ అయ్యంగార్, చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, దండపాణి దేశికర్, చెంబై వైద్యనాథ భాగవతార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్,[1][4][5]జి.ఎన్.బాలసుబ్రమణియం, మదురై మణి అయ్యర్, ఎం.డి.రామనాథన్, రామనాథ్ కృష్ణన్, టి.ఎం.త్యాగరాజన్, మహారాజపురం సంతానం, మదురై సోమసుందరం, టి.ఎన్.శేషగోపాలన్, టి.ఆర్.మహాలింగం (వేణువు), మైసూరు దొరైస్వామి అయ్యంగార్ (వీణ), తిరుమకూడలు చౌడయ్య (వాయులీనం), టి.ఎన్.కృష్ణన్ (వాయులీనం), లాల్గుడి జయరామన్ (వాయులీనం) వంటి మహామహుల కచేరీలకు ఇతడు మృదంగ సహకారం అందించాడు. [1][3]

శిష్యులు

[మార్చు]

ఇతని ముఖ్యమైన శిష్యులలో మవిలెక్కర శంకరకుట్టి నాయర్, కారైకుడి కృష్ణమూర్తి, కుంభకోణం ప్రేమ్‌కుమార్, బి.ధ్రువరాజ్, జి.హరిశంకర్[1][2] మొదలైనవారు ఉన్నారు.

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]

మరణం

[మార్చు]

ఇతడు 1998, మార్చి 28వ తేదీన తన 84వయేట మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Ramanathapuram C S Murugabhoopathy: The Last of the Titans, an Obituary by K S Kalidas, May 1998. Shruti, 164: 15-16.
  2. 2.0 2.1 2.2 2.3 N. Scott Robinson. "South Indian Percussionist Page". nscottrobinson.com. Retrieved 16 March 2011.
  3. 3.0 3.1 3.2 Publication of the Percussive Arts Centre, Bangalore
  4. An interview of Ramathapuram C S Murugabhoopathy published in the music magazine Shruti, July 1985 (issue 17 S, page 6)
  5. A radio interview of Ramanathapuram C S Murugabhoopathy conducted by Mr Subramanya Deshikar (AIR Madras)
  6. "Padma Awards Directory (1954-2009)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 2013-05-10.
  7. "Sangeet Natak Akademi Puraskar (Akademi Awards) list of Awardees". Sangeet Natak Akademi, www.sangeetnatak.org/. Archived from the original on 17 February 2012. Retrieved 16 March 2011.