Jump to content

ఓటమి

వికీపీడియా నుండి

గెలుపుకు వ్యతిరేకం ఓటమి. ఓటమిని ఆంగ్లంలో Defeat అంటారు.

క్రీడలు

[మార్చు]

ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు జట్ల మధ్య పోటీ జరిగినపుడు ఒకరు గెలుపొందడం మరొకరు ఓడిపోవడం జరుగుతుంది. క్రీడలలో గెలుపొందిన వారు, ఓడిన వారు మళ్ళీ మళ్ళీ పలు పోటీలలో పాల్గొంటారు.

రాజకీయాలు

[మార్చు]

రాజకీయాలలో ఒక పదవి కోసం ఒక వ్యక్తి మాత్రమే నిలబడినపుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. అలాకాక ఒక పదవి కోసం ఇద్దరు లేదా కొంతమంది పోటీ చేసినప్పుడు ఒకరు గెలుపొందగా మిగతా అభ్యర్థులు ఓటమి చెందుతారు.

మంచినేతను ఓడిస్తే ఓడేది ఓటరే:
సరైన మంచి నిర్ణయాలు తీసుకొనగలిగి ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోగల రాజకీయవేత్తను ఎన్నుకున్నప్పుడే సరైన అభివృద్ధి జరుగుతుంది. కొన్ని సమయాలలో ఓటరు డబ్బుకో, మద్యానికో ప్రలోభపడి తమ అమూల్యమైన ఓటును సరిగా వినియోగించలేకపోతారు, తద్వారా మంచి నేతను కోల్పోతారు, ఎన్నికైన నేత సరైన సమయంలో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, లేదా నిర్ణయాలు తీసుకోకపోవడంలో జాప్యం వల్ల నష్టం జరిగి ఆ ప్రభావం ఓటరుపై పడుతుంది.

భారత దేశ రాజకీయాలలో ఓటమి చెందిన ప్రముఖులు:
ఇందిరాగాంధీ, నందమూరి తారక రామారావు, ఎన్.జి.రంగా, చిరంజీవి, వెంకయ్య నాయుడు, షీలా దీక్షిత్

యుద్ధాలు

[మార్చు]

రాజ్యం కోసం జరిగిన యుద్ధాలలో ఒకరి సైన్యాన్ని మరొకరి సైన్యం లొంగదీసుకోవడం, బందీ చేయడం, లేదా హతమార్చడం చేసేవారు. గెలుపొందిన రాజు, ఓడిపోయిన రాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేవాడు.

పురాణాలు

[మార్చు]

భారతంలో శక్తివంతుడు, సత్యవర్తనుడు, పరాక్రముడైన భీష్మునికీ తప్పలేదు ఓటమి, మహాభారత యుద్దంలో అర్జునుడి రథం ముందు భాగంలో శిఖండి అస్త్రం చేతబూని ఉండడం చూడగానే భీష్ముడు తన చేతిలోని అస్త్రం జారవిడిచాడు. అదను చూసి అర్జునుడు భీష్ముడిని హతమార్చాడు.

సామెతలు

[మార్చు]

ఓటమి గెలుపుకు తొలిమెట్టు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గెలుపు


బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఓటమి&oldid=2954409" నుండి వెలికితీశారు