ఓ. పన్నీరు సెల్వం
ఓ. పన్నీరుసెల్వం | |||
శాసనసభాపక్ష ఉప నేత
| |||
పదవీ కాలం 14 జూన్ 2021 – 23 జూన్ 2022 | |||
ముందు | దురై మురుగన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బోడినాయకనూర్ | ||
పదవీ కాలం 29 మే 2006 – 14 మే 2011 | |||
ముందు | కేఏ. సెంగోట్టైయం | ||
తరువాత | పనృతి ఎస్. రామచంద్రన్ | ||
నియోజకవర్గం | బోడినాయకనూర్ | ||
2వ ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 21 ఆగష్టు 2017 – 6 మే 2021 | |||
గవర్నరు | సి.హెచ్.విద్యాసాగర్ రావు (అదనపు భాద్యత) బన్వారిలాల్ పురోహిత్ | ||
ముందు | ఎం. కె. స్టాలిన్ | ||
తరువాత | ఉదయనిధి స్టాలిన్ | ||
6వ ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 6 డిసెంబర్ 2016 – 15 ఫిబ్రవరి 2017 | |||
గవర్నరు | సి.హెచ్.విద్యాసాగర్ రావు (అదనపు భాద్యత) | ||
ముందు | జయలలిత | ||
తరువాత | ఎడపడి కె. పలనిసామి | ||
పదవీ కాలం 28 సెప్టెంబర్ 2014 – 23 మే 2015 | |||
గవర్నరు | కొణిజేటి రోశయ్య | ||
ముందు | జయలలిత | ||
తరువాత | జయలలిత | ||
పదవీ కాలం 21 సెప్టెంబర్ 2001 – 2 మార్చి 2002 | |||
గవర్నరు | సి.రంగరాజన్ (అదనపు భాద్యత) పి. ఎస్. రామమోహన్ రావు | ||
ముందు | జయలలిత | ||
తరువాత | జయలలిత | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పెరియకుళం,తమిళనాడు | 1951 జనవరి 14||
రాజకీయ పార్టీ | అన్నాడీఎంకే పార్టీ (1973– ప్రస్తుతం) | ||
జీవిత భాగస్వామి | విజయలక్ష్మీ[1] | ||
నివాసం | * తెంపెన్నై 31, గ్రీన్ వేస్ రోడ్డు, రాజా అణ్ణామలైపురం, చెన్నై, తమిళనాడు, భారతదేశం (అథికారిక నివాసం) |
ఓ. పన్నీరు సెల్వం తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఓ.పన్నీర్ సెల్వం 1977లో అన్నాడీఎంకేలో ఓ సాధారణ కార్యకర్తగా తన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన 1980లో పెరియకుళం 18వ వార్డు కమిటీ ప్రతినిధిగా, 1984లో పెరియకుళం 18వ వార్డు కార్యదర్శిగా, 1993లో పెరియకుళం పట్టణ కార్యదర్శిగా, 1996లో పెరియకుళం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా, 1997లో తేని జిల్లా ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శిగా, 1998లో పెరియకుళం పట్టణ కార్యదర్శిగా, 2000లో జిల్లా పార్టీ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. ఓ.పన్నీర్ సెల్వం 2001లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరియకుళం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2001 సెప్టెంబరు 21 నుండి 2002 మార్చి 2 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. పన్నీర్ సెల్వం తరువాత జయలలిత మంత్రివర్గంలో 2002లో ప్రజాపనుల శాఖ, రెవెన్యూ శాఖామంత్రిగా పనిచేశాడు.
ఓ.పన్నీర్ సెల్వం 2004లో పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శిగా, 2006లో ఎమ్మెల్యేగా, శాసనసభలో విపక్ష నేతగా, విపక్ష ఉప నేతగా, 2007లో పార్టీ కోశాధికారిగా, 2011లో బోడినాయకనూర్ ఎమ్మెల్యేగా, ఆర్థిక మంత్రిగా, జయలలిత అక్రమాస్తుల కేసులో రెండోసారి అభిశంసనకు గురికావడంతో 2014లో రెండోసారి 2014 సెప్టెంబరు 28 నుండి 2015 మే 23 వరకు ముఖ్యమంత్రిగా,[2] 2015లో ఆర్థిక మంత్రిగా, తమిళనాడు అసెంబ్లీ శాసనసభాపక్ష నేతగా,[3] 2016లో తిరిగి బోడినాయకనూర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, జయలలిత మరణానంతరం తమిళనాడు రాష్ట్రానికి 2016 డిసెంబరు 6 నుంచి 2017 ఫిబ్రవరి 5వ తేదీ వరకు మూడొవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[4] ఓ.పన్నీర్ సెల్వం తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 21 ఆగస్టు 2017 నుండి వరకు 2021 మే 6 తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.
ఎన్నికల్లో పోటీ
[మార్చు]ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓటింగ్ % | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రత్యర్థి ఓటింగ్ % |
---|---|---|---|---|---|---|---|
2001 | పెరియకుళం | అన్నా డీఎంకే | గెలుపు | 54.28 | ఎం. అబూ తాహిర్ | డీఎంకే | 38.62 |
2006 | పెరియకుళం | అన్నా డీఎంకే | గెలుపు | 49.81 | ఎల్. మూకయ్య | డీఎంకే | 39.00 |
2011 | బోడినాయకనూర్ | అన్నా డీఎంకే | గెలుపు | 56.69 | ఎస్. లక్ష్మణన్ | డీఎంకే | 38.89 |
2016 | బోడినాయకనూర్ | అన్నా డీఎంకే | గెలుపు | 49.38 | ఎస్. లక్ష్మణన్ | డీఎంకే | 41.63 |
2021 | బోడినాయకనూర్ | అన్నా డీఎంకే | గెలుపు | 46.58 | తంగా తమిళ్ సెల్వన్ | డీఎంకే | 41.45 |
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (1 September 2021). "గుండెపోటుతో తమిళనాడు మాజీ సీఎం సతీమణి మృతి.. పన్నీర్ సెల్వంను కన్నీళ్లతో ఓదార్చిన శశికళ". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TeluguOne News (22 May 2015). "సెల్వం రాజీనామా, జయలలిత శాసనసభా పక్షనేతగా ఎన్నిక". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
- ↑ Sakshi (14 August 2015). "పన్నీర్‌సెల్వంకు పెద్ద పీట". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
- ↑ Sakshi (6 December 2016). "సీఎంగా పన్నీర్ సెల్వం". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.