Jump to content

కంచెర్ల పాలెం

కంచెర్ల పాలెం
గ్రామం
పటం
కంచెర్ల పాలెం is located in ఆంధ్రప్రదేశ్
కంచెర్ల పాలెం
కంచెర్ల పాలెం
అక్షాంశ రేఖాంశాలు: 16°16′41″N 80°39′1″E / 16.27806°N 80.65028°E / 16.27806; 80.65028
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంతెనాలి
అదనపు జనాభాగణాంకాలు
  లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08644 Edit this on Wikidata )
పిన్‌కోడ్522 202

కంచెర్ల పాలెం, గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

కడప జిల్లా గండిపేట ప్రాంతం నుండి వలస వచ్చిన కుటుంబాలతో వచ్చిన గ్రామమే "కంచల" అను ఊరు. తొలి నాళ్ళలో భూమిని గుంతలు తీయగా వచ్చిన నీటితో వ్యవసాయం చేయడం వలన "కంచల" అనే పేరుతో ఊరుగా పేరుతెచ్చుకున్న గ్రామం, కాలక్రమేణా "కంచలపాలెం" గా, తరువాత "కంచర్లపాలెం"గా రూపాంతరం చెందింది.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అరుణ కుమారి, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • కంచెర్లపాలెం గ్రామంలో వెలసిన శ్రీ గంగా సర్వమంగళ సమేత ఓంకారేశ్వరస్వామివారి కళ్యాణోత్సవం, 2014, మే-10, శనివారం నాడు, కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలప్రాంగణంలో నిర్వహించిన విశేషపూజలలో గంగా సమేతుడైన శ్రీ ఓంకారేశ్వరస్వామివారికి, భక్తులు, తలంబ్రాలు అర్పించారు. ఉదయం స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి, మద్యాహ్నం అన్నసంతర్పణ నిర్వహించారు.
  • ఈ గ్రామంలోని భగవాన్ వెంకయ్యస్వామి ఆలయంలో 2014, ఫిబ్రవరి-10 సోమవారం నాడు, విగ్రహప్రతిష్ఠా పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగినవి. దత్తాత్రేయ, నాగపంచమ మూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించారు.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

గ్రామ విశేషాలు

[మార్చు]
  1. జిల్లాలో మొట్టమొదట గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేసింది ఈ వూరిలోనే.
  2. గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం పిలుపు మేరకు, ఈ గ్రామాన్ని లోక్ సభ సభ్యులు [[గల్లా జయదేవ్]] భార్య, గల్లా పద్మావతి, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయాడానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంది. పద్మావతి, ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకుడు కృష్ణ కుమార్తె. ఈ గ్రామం ఆమె తల్లి ఇందిర స్వగ్రామం.

మూలాలు

[మార్చు]