కంటి వెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంటి వెలుగు
Kanti Velugu .jpg
కంటి వెలుగు
ప్రాంతంమల్కాపూర్‌, మెదక్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనఆగస్టు 15, 2018
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

కంటి వెలుగు తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.ఈ పథకాన్ని ఆగస్టు 15, 2018న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఇదే రోజూ గవర్నర్ నరసింహన్ మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఐదు నెలలపాటు కొనసాగుతుంది.[1] ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించింది.

పథకం వివరాలు[మార్చు]

గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిగా, పట్టణాల్లో వార్డును పరిధిగా కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తారు. ఈ క్యాంపులో ఒక మెడికల్ ఆఫీసర్, కంటి వైద్యుడు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, ఆశా వర్కర్లతో కూడిన ఆరు నుంచి ఎనిమిది మందితో కూడిన బృందం సేవలందిస్తుంది. ఈ వైద్యబృందం రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పథకంలో 799 బృందాల్లో 940 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 1000 మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. 33 వేల మంది సిబ్బందిని ఈ కార్యక్రమం కోసం కేటాయించారు.

కంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య[మార్చు]

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది ప్రజలు కంటి సమస్యలతో బాధ పడుతున్నారు.

కంటి వ్యాధులు సంఖ్య
శుక్లాలు 43 శాతం
బాల్యంలో అంధత్వం 4 శాతం
నెలలు నిండని శిశువులకు సమస్యలు 4 శాతం
డయాబెటిక్‌ రెటీనోపతి 7 శాతం
చూపు మందగించడం 3 శాతం
నీటి కాసులు (గ్లకోమా) 7 శాతం

మూలాలు[మార్చు]

  1. "KCR: తెలంగాణలో ఆగస్టు 15 నుంచి ఐదు నెలలపాటు 'కంటి వెలుగు". 14 August 2018.