అక్షాంశ రేఖాంశాలు: 15°35′51.900″N 79°8′9.060″E / 15.59775000°N 79.13585000°E / 15.59775000; 79.13585000

కందులాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందులాపురం
పటం
కందులాపురం is located in ఆంధ్రప్రదేశ్
కందులాపురం
కందులాపురం
అక్షాంశ రేఖాంశాలు: 15°35′51.900″N 79°8′9.060″E / 15.59775000°N 79.13585000°E / 15.59775000; 79.13585000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకంభం
విస్తీర్ణం9.62 కి.మీ2 (3.71 చ. మై)
జనాభా
 (2011)[1]
10,766
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,900/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు5,126
 • స్త్రీలు5,640
 • లింగ నిష్పత్తి1,100
 • నివాసాలు2,445
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523333
2011 జనగణన కోడ్590890

కందులాపురం ప్రకాశం జిల్లా, కంభం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కంభం నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2445 ఇళ్లతో, 10766 జనాభాతో 962 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5126, ఆడవారి సంఖ్య 5640. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2100 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 228. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590890[2].

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ గ్రామాన్ని పసికందులపల్లె అనే పేరుతో పూర్వము పిలిచేవారు . పూర్వం ఈ గ్రామంలో పిల్లలు ఎక్కువ జన్మించేవారట అందుకనే ఈ గ్రామానికి పసికందుల పల్లె అనే పేరు వచ్చిందని ఆపేరు కాలక్రమంలో కందులపురం వాడుకలో కందులాపురంగా మారిపోయినది . ఆ గ్రామ కురువృద్దులు చెప్పుతున్నారు .

సమీప గ్రామాలు

[మార్చు]

నాగులవరం 6 కి.మీ, కంభం 3 కి.మీ, రావిపాడు 7 కి.మీ, కాకర్ల 8 కి.మీ, వెలగలపాయ 8 కి.మీ.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

అంగనవాడీ కేంద్రం. ప్రాథమికోన్నత పాఠఃశాల గ్రామంలో త్రాగునీటి కోసం మాలకొండ మీద ఒక మంచి నీళ్ల ట్యాంకి, కందుల పురం గ్రామం సమీపంలో కొండ అనుకొని మంచి నీళ్ల ట్యాంకి ఉన్నాయి.

త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామంలో, 2014, అక్టోబరు-2న గాంధీజయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [3]. ఆ పధకం అమలు జరగడంలేదు అందుకు కారణం బోరులో నీరు యెండిపోయినది ప్రస్తుతం కంభం చెరువుకి నీరు రావడంతో తాగునీటి సమస్య పరిష్కారం అయినది

బ్యాంకులు

[మార్చు]

సిండికేట్ బ్యాంక్, కందులాపురం (నాగులవరం) శాఖ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఎం.జి. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బి.ఇ.డి), శ్రీసాధన జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర బిఈడి కాలేజ్, శ్రీ వాసవి విద్యానికేతన్, కృపామృత స్కూల్, సెయింట్ జాన్స్ స్కూల్, అక్షర స్కూల్, గౌతమి అండ్ గౌతమ్ స్కూల్ అండ్ కాలేజ్

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

గ్రామానికి సాగు, త్రాగు నిటీకి కంభం చెరువెే ఆధారం, కాని వరుస కరువు, వానలు కురవక చెరువులో నీరు లేక గ్రామంలో నీరు లభింఛక ట్యాంకర్లతో నిటినీ అందిస్తున్నారు, రైతు కూలీలు ఆంధ్రప్రదేశ్ప్రదేశ్ సంఘం పోరాట ఫలితంగా రామన్న కతువ నుంచి చెరువుకు నీరు రావడంతో కందులాపురం గ్రామంలో కందుల పురం గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య పరిష్కారం అయినది

రాజకీయాలు

[మార్చు]

కందులాపురం రాజకీయాలు స్వార్ధ రాజకీయాలు కొనసాగుతున్నవి .

గ్రామ పంచాయతీ

[మార్చు]

బేస్తవారిపేట సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేసి ఉత్తమ సేవలు అందిచారు . ముతకపల్లే మూర్తిరెడ్డి వరుసగా 3 సార్లు సర్పంచిగా కందులాపురం గ్రామపంచాయితికి ఎన్నికై రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచి అవార్డు అందుకున్నారు . ముతకపల్లే మూర్తిరెడ్డిగారి విగ్రహం కందులాపురం సెంటర్లో ఉన్నది . 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కల్లకుంట మెర్సీ కమలా ఆనంద్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ g.వెంకటేశ్వరరెడ్డి ఎన్నికైనారు. ప్రస్తుతం ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతున్నది . 2021 వ సంవత్సరంలో ఎస్సీ మహిళా రిజర్వ్ కేటగిరీలో బత్తుల తిరుపాలమ్మ సర్పంచిగా ఎన్నికయ్యారు.ప్రస్తుతం కందులాపురం గ్రామ పంచాయితీ మేజర్ పంచాయితీగా కొనసాగుతున్నది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ పట్టాభి రామాలయం:- కందులాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నెహ్రూ బజారులో వెలసిన ఈ ఆలయ జీర్ణోద్ద్ధ్రణ పనులకు, 2015, జూన్-11వ తేదీ గురువారంనాడు, వేదపండితులు, గ్రామస్థులు భూమిపూజ నిర్వహించారు. 25 లక్షల రూపాయల విరాళాలతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినారు. [4]అంకాలమ్మ గుడి ఉరిలో పొలాల మధ్యలో ఉన్నది . తర్లుపాడు రోడ్డులో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సమీపంలో రౌదుళి అంకాలమ్మ పురాతన ఆలయం ఉండేది . గడిచిన 10 సంవత్సరాలలో ఆలయాన్ని అభివృద్ధి చేసి నూతన విగ్రహ ప్రతిష్ఠ చేసి నిత్యం అన్నదానం చేస్తున్నారు .

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, కంది, పప్పు శెనగ, ధనియాలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, భవన నిర్మాణ పని,

గ్రామ ప్రముఖులు

[మార్చు]

.ముతకపల్లె మూర్తిరెడ్డి బేస్తవారిపేట సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేసి ఉత్తమ సేవలు అందిచారు . ముతకపల్లే మూర్తిరెడ్డి వరుసగా 3 సార్లు సర్పంచిగా కందులాపురం గ్రామపంచాయితికి ఎన్నికై రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచి అవార్డు అందుకున్నారు . ముతకపల్లే మూర్తిరెడ్డిగారి విగ్రహం కందులాపురం సెంటర్లో ఉన్నది .

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]