కనకవ్వ
గొట్టె కనకవ్వ | |
---|---|
జననం | 1957 |
వృత్తి | జానపద గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2000 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | బాలయ్య |
పిల్లలు | ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు[1] |
తల్లిదండ్రులు | జంగపల్లి రాజవ్వ(తల్లి) |
గొట్టె కనకవ్వ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద గాయని. ఆమె 2022లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విశిష్ట మహిళ పురస్కారంకు ఎంపికైంది.[2]
జననం
[మార్చు]కనకవ్వ 1957లో తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, బొడిగేపల్లి గ్రామంలో జన్మించింది. కనకవ్వకు ఐదుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు.[3]
కళ జీవితం
[మార్చు]కష్టాన్ని నమ్ముకుంటూ జీవనం సాగించే కనకవ్వ చిన్నప్పటి నుంచే తల్లితో కలిసి నాటు వేసేందుకు, కలుపు తీసేందుకు వెళ్లేది, అలా తన తల్లి నుంచి జానపద పాటలను నేర్చుకోవడంతో పాటు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇతరుల నుంచి నేర్చుకొని తన కష్టం తెలియకుండా ఉండటానికి పాటలు పాడేది.[4] ఆమె పంట పోలాలు, గ్రామ పరిసరాల్లో తన సోదరితో కలిసి జానపద పాటలను అద్భుతంగా పాడుతున్న సమయంలో కొంతమంది యువకులు ఆ వీడియోలను రికార్డు చేసి టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలకు వచ్చిన ఆదరణతో కనకవ్వ పాడిన పాటల వీడియోను ఆమె సోదరి మైక్ టీవీ, 10 టీవీ ఆధ్వర్యంలో జరిగిన ఫోక్ స్టూడియో జానపద పాటల పోటీకి పంపగా, వారు ఆమెను అడిషన్స్‌కి పిలవగా ఆమె అక్కడికి వెళ్లి అడిషన్స్ ఇచ్చి 3వేల మందిని దాటుకుని ప్రథమ స్థానంలో నిలిచింది.[5][6]
కనకవ్వ తరువాత జానపద గాయినిగా మరి మేడారం జాతర పాట ‘గిన్నె రామా, గిన్నె రామా’ అంటూ పాడిన పాటతో యూట్యూబ్ ఫోక్ స్టార్‌గా మారింది. ఆమె తరువాత ఆడి నెమలీ మాటలకు గంగధారి, గొబ్బియల్లో గొబ్బియల్లో పాటలతో పాటు హైదరాబాద్ మహానగరం, సంక్రాంతి 2021 పాటలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.[7]
నటించిన సినిమాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (3 November 2020). "కనకవ్వ: అన్నీ బతుకుపాటలే." Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ Hindustantimes Telugu (8 March 2022). "వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు అవార్డులు.. జాబితా ఇదే." Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.
- ↑ 10TV (8 March 2021). "జానపదాల పులకరింత..మట్టి పాటల మహిళా మణిపూస కనకవ్వ." (in telugu). Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ HMTV (24 October 2020). "నా పాటకి ఆమె స్ఫూర్తి : కనుకవ్వ". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ BBC News తెలుగు (4 March 2020). "ఫోక్ సింగర్ కనకవ్వ: 60 ఏళ్ల వయసులో సోషల్ మీడియా స్టార్ అయిన తెలంగాణ జానపద గాయని". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ "మట్టి పాటల పూదోట కనకవ్వ". dishadaily.com. 8 March 2020. Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.