తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు - 2021 & 2022
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు అందజేసే పురస్కారం. గౌరమ్మను గంగలో పూజించే బతుకమ్మ సాక్షిగా.. దుర్గమ్మను నైవేద్యంతో పూజించే బోనం సాక్షిగా.. స్త్రీలను గౌరవించుకోవడం, సత్కరించుకోవడం తెలంగాణ రాష్ట్ర సంప్రాదాయం. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు ప్రత్యేక పురస్కారాలు అందజేస్తుంది.
2021 & 2022 పురస్కారాల్లో భాగంగా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిభామూర్తుల్లో వివిధ కేటగిరీల్లో 40 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసింది. వీరికి అవార్డుతోపాటుగా, లక్ష రూపాయల నగదు పురస్కారంతో అందజేసి సత్కరించారు.[1][2][3]
పురస్కార గ్రహీతలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | స్వస్థలం | రంగం |
---|---|---|---|
1 | ఆర్. లక్ష్మీ రెడ్డి | విద్యారంగం | |
2 | బడుగుల సుమతి | మహబూబ్‌నగర్ జిల్లా | వృత్తిసేవలు |
3 | ఉమా సుధీర్ | హైదరాబాద్ | పాత్రికేయ రంగం |
4 | రమాదేవి లంక | ||
5 | వాసిరెడ్డి కాశీరత్నం | సామాజిక సేవ | |
6 | సరస్వతి రమ | పాత్రికేయ రంగం | |
7 | వీణాదాస్ బాల్సా | పాత్రికేయ రంగం | |
8 | అనురాధ పాండురంగ | ||
9 | ఉషా ఆర్.రెడ్డి | ||
10 | ఏ. జ్యోతి గౌడ్ | హైదరాబాద్ | సామాజిక సేవ |
11 | చింతల పోశవ్వ | కామారెడ్డి జిల్లా | స్వయం ఉపాధి రంగం |
12 | మెస్రం తనూబాయి | ఆదిలాబాద్ | |
13 | వీణాదాస్ బైంగ్ | సాహితీ రంగం | |
14 | సునీతా కుమార్ | వైద్యరంగం | |
15 | సౌమ్య గుగులోత్ | నిజామాబాద్ జిల్లా | క్రీడారంగం |
16 | గూడేటి సరిత | క్రీడారంగం | |
17 | రసకట్ల సంధ్య | భూపాలపల్లి జిల్లా | వృత్తిసేవలు |
18 | వైష్ణవి సాయినాథ్ | హైదరాబాద్ | కళ రంగం |
19 | కె. సంగీత కళ & ఎం. రాజ్యలక్ష్మి (సంగీత సిస్టర్స్) | హైదరాబాద్ | కళా రంగం |
20 | మడావి ధ్రుపతా బాయి | ఆదిలాబాద్ | కళా రంగం |
21 | మర్సకొల కళావతి | ఆదిలాబాద్ జిల్లా | కళా రంగం |
22 | కనకవ్వ | సిద్ధిపేట జిల్లా | కళ రంగం |
23 | సమీనా బేగం | హైదరాబాద్ | విద్యా రంగం |
24 | డా. చింతపల్లి వసుంధర రెడ్డి | విద్యారంగం | |
25 | కమర్ జమాలి | సాహితీ రంగం | |
26 | మందల మమత | హనుమకొండ జిల్లా | సేవారంగం |
27 | బాసాని శ్వేతా | వృత్తిసేవలు | |
28 | ఏ. స్వప్న | వృత్తిసేవలు | |
29 | హరిదాస్‌పూర్ గ్రామా పంచాయితీ | సంగారెడ్డి జిల్లా | సామజిక సేవ |
30 | జడి శిరీష | వృత్తిసేవలు | |
31 | జి. ప్రియాంక | వృత్తిసేవలు | |
32 | ఎం. నిర్మలా ప్రభావతి | హైదరాబాద్ జిల్లా | వైద్యరంగం |
33 | సరోజ భూక్యా | వృత్తిసేవలు | |
34 | భూధరపు శశికళ | వృత్తిసేవలు | |
35 | సామల ఉమాదేవి | వృత్తిసేవలు | |
36 | జి.కె.సంతోషి భాయి | వృత్తిసేవలు | |
37 | పాకాల చైతన్య | వృత్తిసేవలు | |
38 | వాసీమా బేగం | వృత్తిసేవలు | |
39 | చంద్రకళ కొట్టెం | వృత్తిసేవలు | |
40 | చుంచు అంజమ్మ | సామజిక సేవలు |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (7 March 2022). "మహిళలకు విశిష్ట పురస్కారాలు". Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.
- ↑ Hindustantimes Telugu (8 March 2022). "వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు అవార్డులు.. జాబితా ఇదే." Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.
- ↑ Eenadu (7 March 2022). "పలు రంగాల్లో సేవ చేసిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు". Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.