కన్నెగంటి రాధ
కన్నెగంటి రాధ సుప్రసిద్ధ రంగస్థల నటులు.
జీవిత విశేషాలు
[మార్చు]మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాధ, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి, మేనమామల సంరక్షణలోనే పెరిగారు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]రాధ అన్నగారైన నాసరయ్య జనతా ఆర్ట్ థియేటర్ స్థాపించి విశేషంగా నాటకాలు ప్రదర్శిస్తుండేవారు. తన ప్రభావం తమ్ముడైన రాధ మీద పడింది. వీరిద్దరు అనేకమంది రచయితలతో పరిచయాలు పెంచుకొని, ఎన్నో కొత్త నాటకాలు ప్రదర్శించారు. నాసరయ్య స్థాపించిన జనతా ఆర్ట్ థియేటర్ నుండి రాష్ట్రమంతటా ప్రదర్శనలిచ్చారు.
జనతా ఆర్ట్ ధియేటర్ వారి భయం నాటకానికి దర్శకత్వం వహించి, ఒక ప్రధాన పాత్ర (పి.యస్) పోషించి అనేక పరిషతుల్లో బహుమతులు అందుకున్నారు.
చీకటి తెరలు నాటికలో శంకర్ పాత్ర ధరించి గూడూరు, తిరుపతి, గెద్దనాపల్లి, రాజమండ్రి, నెల్లూరు, వేటపాలెం మొదలైన పరిషతులలో ప్రథమ బహుమతులు సంపాదించారు.
యడ్లపల్లి పరిషత్తులో రాధ ప్రదర్శించిన రైలు ప్రమాదం నాటిక మాజీ రాష్ట్రపతి, ఆనాటి మంత్రివర్యులు నీలం సంజీవరెడ్డి కోరికపై మళ్లీ ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఆ పరిషత్తులో ఉత్తమ ప్రదర్శన, రంగాలంకరణ, విలన్ పాత్రకు, మరికొన్ని బహుమతులు ఈ నాటిక సంపాదించింది.
రాధ గుంటూరు, చిలకలూరిపేట, గుంతకల్లు మొదలగు ప్రదేశాలకు వెళ్లి, ఆ సమాజాలవారు ప్రదర్శించే భయం నాటకానికి దర్శకత్వం వహించి, దిగ్విజయంగా ప్రదర్శించి అనేక ప్రశంసలు పొందారు.
ఇతర వివరాలు
[మార్చు]ఒకసారి వీరు టి.బి. వ్యాధికి గురై వైద్యంకొరకు మంగళగిరి శానిటోరియంలో చేరారు. ఆక్కడ జరుగుతున్న అవినీతికి స్పందించి, రోగులందరిచే హాస్పటల్ ఆహారం తీసుకోకుండా నిరాకరింపచేసారు. నిరసన జరిగినన్ని రోజులు రోగులందరికి రాధ ఇంటినుండి ఆహారం తెప్పించారు. సమస్య పెద్ద ఆధికారుల దృష్టికి వెళ్లి వారు స్పందించి సమస్యను రోగులకు అనుకూలంగా పరిష్కరించారు. హాస్పటల్ వార్షికోత్సవంలో రాధ నాటిక ప్రదర్శన ఏర్పాటుచేసి, వారిని ఘనంగా సత్కరించారు.
మరణం
[మార్చు]తెలుగు నాటకరంగానికి విశిష్ట సేవలు అందించిన రాధ చిన్నవయసులోనే మరణించారు.
మూలాలు
[మార్చు]- కన్నెగంటి రాధ, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 217.