కబీర్ ఖాన్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కబీర్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ కబీర్ ఖాన్
పుట్టిన తేదీ (1974-04-12) 1974 ఏప్రిల్ 12 (వయసు 50)
పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 132)1994 ఆగస్టు 26 - శ్రీలంక తో
చివరి టెస్టు1995 ఫిబ్రవరి 9 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 95)1994 సెప్టెంబరు 11 - శ్రీలంక తో
చివరి వన్‌డే2000 ఆగస్టు 27 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990–2004Peshawar
1993–1994House Building Finance Corporation
1995–2005హబీబ్ బ్యాంక్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 4 10 114 93
చేసిన పరుగులు 24 10 1,459 257
బ్యాటింగు సగటు 8.00 10.00 13.38 6.94
100లు/50లు 0/0 0/0 –/3 0/0
అత్యుత్తమ స్కోరు 10 5 66* 27
వేసిన బంతులు 655 371 17,230 3,946
వికెట్లు 9 12 437 114
బౌలింగు సగటు 41.11 25.25 21.18 25.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 26 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 3 0
అత్యుత్తమ బౌలింగు 3/26 2/23 8/52 4/20
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 44/– 20/–
మూలం: Cricinfo, 2009 మే 27

మహ్మద్ కబీర్ ఖాన్ (జననం 1974, ఏప్రిల్ 12 ) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. 1994 నుండి 2000 వరకు పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా రాణిస్తూ పాకిస్తాన్ తరపున నాలుగు టెస్టులు, పది వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.

2008లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు. 2010లో రాజీనామా చేశాడు. 2011 నుండి 2014 వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి రావడానికి ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు కొంతకాలం శిక్షణ ఇచ్చాడు. 2021లో సౌదీ అరేబియా ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు.

జననం

[మార్చు]

కబీర్ ఖాన్ 1979, ఏప్రిల్ 12న పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వాలోని పెషావర్‌లో జన్మించాడు.పష్టూన్ జాతికి చెందినవాడు.[1][2]

క్రికెట్ రంగం

[మార్చు]

ఖాన్ మొదటిసారిగా 1994-95లో శ్రీలంక పర్యటనలో ఆడాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో లీగ్ క్రికెట్‌కు కొంతకాలం ఆడాడు. ప్రస్తుతం స్కాట్లాండ్‌లోని స్టిర్లింగ్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో క్లబ్ ప్రొఫెషనల్‌గా ఉన్నాడు.

కోచింగ్ కెరీర్

[మార్చు]

2005లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ టీమ్ జట్టుకు కోచ్ అయ్యాడు. అక్కడ అనుభవం సంపాదించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.

2010 ఆగస్టు 19న, స్కాట్లాండ్ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్‌లోని అధికారుల జోక్యం కారణంగా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ కోచ్‌గా నిష్క్రమించాడు;[3] ఖాన్ ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. వన్డే క్రికెట్‌లో ప్రపంచంలో 13వ ర్యాంక్‌ని పొందాడు.

2010 అక్టోబరులో, మూడు సంవత్సరాల ఒప్పందంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు.[4] అయినప్పటికీ, 2011 డిసెంబరులో ఆఫ్ఘనిస్తాన్ కోచ్‌గా వచ్చాడు. 2012 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20, 2015 క్రికెట్ ప్రపంచ కప్‌కు జట్టు అర్హతను పర్యవేక్షించాడు, వ్యక్తిగత కారణాల వల్ల 2014 సెప్టెంబరులో రాజీనామా చేశాడు.[5]

2021లో సౌదీ అరేబియా ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. థాయ్‌లాండ్‌లో జరిగిన 2023 ఏసీసీ పురుషుల ఛాలెంజర్ కప్‌లో అతను జట్టుకు శిక్షణ ఇచ్చాడు.[6]మూలాలు

[మార్చు]
  1. "The man who gave Afghanistan their mojo". 22 August 2013. Retrieved 22 August 2014.
  2. "Afghanistan: A castle from ruins". 7 October 2013. Archived from the original on 19 July 2016. Retrieved 22 August 2014.
  3. Dispute with board ends Kabir Khan's coaching tenure Archived 24 జూలై 2012 at the Wayback Machine
  4. "Kabir Khan to coach UAE". ESPN Cricinfo. 2 October 2010. Retrieved 19 February 2015.
  5. "Kabir Khan quits as Afghanistan coach". ESPNcricinfo. 2 September 2014. Retrieved 4 April 2023.
  6. Pike, Jon (9 March 2023). "Challenger Cup triumph evidence of progress in Saudi cricket". Arab News. Retrieved 4 April 2023.

బాహ్య లింకులు

[మార్చు]