కర్ణాటక బ్యాంక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్ణాటక బ్యాంకు
Typeప్రైవేట్ బ్యాంకు
బి.ఎస్.ఇ: 532652
NSEKTKBANK
పరిశ్రమబ్యాంకింగ్, ఆర్ధిక సేవలు
స్థాపన18 February 1924; 100 సంవత్సరాల క్రితం (18 February 1924)
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంమంగళూరు, కర్ణాటక, భారత దేశం
Areas served
ప్రాంతాల సేవలు
Key people
ProductsRetail banking, corporate/wholesale banking, treasury operations, credit card, bancassurance
RevenueIncrease7,092.33 crore (US$890 million) (2022)[1]
Decrease 1,634.00 crore (-14.37%) (2022)[1]
Increase 508.62 crore (US$64 million) (5.40%) (2022)[1]
Total assetsIncrease ₹92,040.55 crore (7.50%) (2022)[1]
Number of employees
8,519 (2022)[1]
Capital ratio15.66%[1]
కర్ణాటక బ్యాంకు లోగో
కర్ణాటక బ్యాంక్ బనవర

కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్(Karnataka Bank Limited) స్వాతంత్య్రానికి  పూర్వం కర్ణాటక రాష్ట్రం  మంగళూరు 1924 సంవత్సరంలో స్థాపించబడిన ప్రైవేట్ రంగ బ్యాంకు.  భారతదేశ వ్యాప్తంగా విస్తరించిన  శాఖలతో బ్యాంకు సేవలను వినియోగదారులకు అందిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ 1924 ఫిబ్రవరి 18 న కర్ణాటకలోని మంగళూరులో కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ గా స్థాపించబడింది. దక్షిణ కన్నడ రీజియన్  బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి ఈ బ్యాంకు స్థాపించబడింది. మే 23, 1924సంవత్సరంలో బ్యాంకు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ధృవీకరణ పత్రాన్ని పొందింది. కర్ణాటక ఏప్రిల్ 4, 1966లో భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించడానికి తమ లైసెన్సును పొందటం జరిగింది. ఈ బ్యాంకు నెలకొల్పడంలో బి.ఆర్.వ్యాసరాయచార్ , దక్షిణ కన్నడ ప్రాంతంలోని ఇతర సభ్యులు ప్రోత్సహించారు. కర్ణాటక  బ్యాంకు 11 రాష్ట్రాలలో 36 కొత్త శాఖలను ప్రారంభించింది - పంజాబ్ తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ, సిక్కిం, కేరళ, పశ్చిమ బెంగాల్,ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక లలో ఉన్నాయి.[2]

అభివృద్ధి

[మార్చు]

భారతదేశంలో 'A' క్లాస్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అయిన కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్, శృంగేరి శారదా బ్యాంక్ లిమిటెడ్, చిత్రదుర్గ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ కర్ణాటకల విలీనంతో బ్యాంకు సంవత్సరాలు గడిచే కొద్దీ అభివృద్ధి చెందింది.

ప్రొఫెషనల్ బ్యాంకింగ్ సేవలు, నాణ్యమైన వినియోగ దారుల సేవలను అందించడంలో 9 దశాబ్దాలకు పైగా అనుభవం ప్రస్తుతం 22 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించిన 879 శాఖలతో భారతదేశం అంతటా ఉన్నది. కర్ణాటక బ్యాంకులో 8,220 మంది ఉద్యోగులు, 1,46,000 మంది వాటాదారులు (షేర్ హోల్డర్) ,10.21 మిలియన్లకు పైగా వినియోగదారులతో ఉంది.[3]

అవార్డులు

[మార్చు]

కర్ణాటక బ్యాంకు వినియోగ దారులకు సేవలను అందచేయడమే గా గుర్తింపు పొందిన సంస్థలనుంచి అవార్డులు, ప్రశంసలను పొందింది.[4]

  • ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2015. .
  • నాలుగు అసోచామ్ సోషల్ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డులు.
  • కర్ణాటక బ్యాంక్ ఐబీఏ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డును పొందింది.
  • 2015 సీఎఫ్బీపీ జమ్నాలాల్ బజాజ్ అవార్డులను కర్ణాటక బ్యాంక్ రావడం జరిగింది.
  • ఐడీఆర్బీటీ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డు.
  • ISO 27001:2005 సర్టిఫికేషన్ పొందింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Balance Sheet 31.03.2022" Archived 2022-08-08 at the Wayback Machine karnatakabank.com
  2. "Karnataka Bank Ltd". Business Standard India. Retrieved 2022-07-04.
  3. "About us | Karnataka Bank". karnatakabank.com. Archived from the original on 2022-07-05. Retrieved 2022-07-04.
  4. "Karnataka Bank > Company History > Banks - Private Sector > Company History of Karnataka Bank - BSE: 532652, NSE: KTKBANK". www.moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-04.