Jump to content

కర్రి రామారెడ్డి

వికీపీడియా నుండి
కర్రి రామారెడ్డి
డాక్టర్ కర్రి రామారెడ్డి
పుట్టిన తేదీ, స్థలం (1954-10-19) 1954 అక్టోబరు 19 (వయసు 70) అక్టోబరు 19, 1954
అనపర్తి,
తూర్పుగోదావరి,
ఆంధ్ర ప్రదేశ్
వృత్తిరచయిత, మానసిక వైద్యుడు
జాతీయతభారతీయుడు

కర్రి రామారెడ్డి ప్రముఖ మానసిక వైద్యనిపుణులు. ఈయన వైద్యునిగా ఒక లక్షా 45వేల మంది మానసిక రోగులకు చికిత్స అందించారు. వైద్య వృత్తిలో బిజీగా ఉంటూ విభిన్న డిగ్రీలు సాధించి ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించారు. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. వందల డిగ్రీలు సాధించినవాళ్ళు ఎందరో ఉన్నారు. అత్యున్నత చదువులతో ఉన్నత శిఖరాలకు వెళ్ళినవాళ్ళూ ఉన్నారు. కానీ విభిన్న వృత్తులకు సంబంధించిన కోర్సులను అవలీలగా పూర్తిచేస్తూ, పైగా డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్ లలో పాసవుతూ, అధ్యయనంకోసం నిరంతర విదార్ధిగా కొనసాగుతున్నవాళ్ళు చాలా అరుదు. కర్రి రామారెడ్డి వారిలో ఒకరు. 50 డిగ్రీలు సాధించారాయన. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో కూడా తనదైన ముద్రవేశారు. ప్రతిష్ఠాత్మక డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ పురస్కారాన్ని రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా అందుకున్నారు..[1]

జననం -విద్యాభ్యాసం

[మార్చు]

ఆయన కర్రి వెంకటరెడ్డి అలియాస్ పెద్దకాపు, మంగాయమ్మ దంపతులకు 1954 అక్టోబర్ 19 తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జన్మించారు. (అధికారికంగా 1.8.1952 పుట్టినతేదీగా నమోదయ్యింది.) ఆయన సోదరుడు కర్రి బాపిరెడ్డి, సోదరి ఎన్.సీతలతో పాటు ఆయన అనపర్తిలోనే ప్రాథమిక విద్య పూర్తిచేసారు. చిన్ననాటి నుంచే అనపర్తిలోని గంగిరెడ్డి గ్రంథాలయానికి వెళ్ళడం, అక్కడ పుస్తకాలు చదవడం అలవరచుకున్న డాక్టర్ రామారెడ్డి చదువులో బాగా రాణిస్తున్న కారణంగా ఏడున్నర సంవత్సరాల వయస్సులోనే ఫస్ట్ ఫారం పరీక్షకట్టి, ఆరవతరగతిలో జాయిన్ అయ్యారు.. ఇక కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ (ఆంధ్ర యూనివర్సిటీ) నుంచి ఎం.బి.బి.ఎస్. 64.2% మార్కులతో యూనివర్సిటీ టాపర్ గా ఉత్తీర్ణులయ్యారు.. డాక్టర్ పేరి శాస్త్రి ప్రైజ్ (సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్) పొందారు. అలాగే శ్రీమతి బుర్రా బాపనమ్మ గోల్డ్ మెడల్ (గైనికాలజీ అండ్ మిడ్‌వైఫరీ) అందుకున్నారు.డాక్టర్ ఎస్వీ రమణయ్య ప్రైజ్ (మిడ్‌వైఫరీ), డిస్టింక్షన్ ఇన్ ఫార్మకాలజీ కూడా పొందారు. ఆతర్వాత ఎం.డి.సైకలాజికల్ మెడిసిన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జాతీయ మానసిక నర విజ్ఞాన సంస్థ, నిమ్ హాన్స్ (బెంగళూరు) లో అభ్యసించారు.

ప్రాక్టీసు

[మార్చు]

రాజమహేంద్రవరం దానవాయిపేటలో 1980లో మానస హాస్పిటల్ ప్రారంభించి, కోస్తా జిల్లాల్లో తొలి ప్రైవేటు మానసిక వైద్య నిపుణులుగా ఎంతోమందికి మానసిక సమస్యలు సరిచేశారు. ఈ 50 పడకల ఆసుపత్రిద్వారా గడచిన 44ఏళ్ళుగా దాదాపు ఒక లక్షా 45వేల మానసిక రోగుల కేసులు చూసారు. ఇప్పటికీ ప్రతిరోజూ

10కొత్త కేసులు, 80పాత కేసులు చూస్తున్నారు.

అదనపు డిగ్రీలపై దృష్టి

[మార్చు]

ఓపక్క ప్రాక్టీసు చేస్తూనే మరోపక్క వివిధ రంగాలలో అడుగుపెట్టిన కర్రి రామారెడ్డి కేవలం వైద్య వృత్తికి సంబంధించిన కొర్సులే కాకుండా మిగిలిన కోర్సులపై దృష్టి సారించారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎం.బి.ఏ. (67%) పూర్తిచేశారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎం.సి.ఏ. 76.3% మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అలాహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్-డీమ్డ్ యూనివర్సిటీ (శామ్ హిగ్గిన్‌బాటమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, సైన్స్ & టెక్నాలజీ) నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో 81.9% మార్కులతో ఎం.టెక్. చేసారు. త్రిపుర ఇక్ఫాయ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ అఫ్ జర్నలిజం (70.25%) పాసయ్యారు. మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. (పొలిటికల్ సైన్స్ ), నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. (ఇంగ్లీష్ లిటరేచర్) పాసయ్యారు. చిత్తూరు బిహేవియర్ అండ్ మానెజ్మెంట్ సైన్సెస్ నుంచి మాస్టర్ అఫ్ సైన్స్ (సైకోథెరపీ అండ్ కౌన్సిలింగ్) పాసయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ జి.ఎస్.కె.ఎం. లా కాలేజీ నుంచి ఎల్.ఎల్.బి. పాసయ్యారు. బెస్ట్ అవుట్‌గోయింగ్ స్టూడెంటుగా 24 మెడల్స్, సబ్జెక్ట్ ప్రైజెస్ సంపాయించారు. ఐదు ఎల్.ఎల్.ఎం.డిగ్రీలు సాధించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.ఎం (టోర్ట్స్ అండ్ క్రైమ్స్ ) ; ఎల్.ఎల్.ఎం (కానిస్టి ట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా) ఎల్.ఎల్.ఎం. (లేబర్ లాస్) ; ఎల్.ఎల్.ఎం (కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా) ; డెహ్రాడూన్ ఇక్ఫాయ్ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.ఎం (సైబర్ లా అండ్ ఇంటెలెక్టుల్ ప్రాపర్టీ రైట్స్) ఉత్తీర్ణులయ్యారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించారు.

బీ.యిడి. కాలేజి ఫస్ట్ గోల్డ్‌మెడల్ తో పాసయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ బెన్నయ క్రిస్టియన్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఎం.ఈడీ. (84% మార్కులు) చేసారు. పాఠశాల విద్యార్ధులలో ప్రవర్తనాలోపాలపై పరిశోధన జరిపి భారతియార్  విశ్వవిద్యాలయం నుండి పీహేచ్‌డీ సంపాదించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి లైబ్రరీ సైన్స్ డిగ్రీ (66.67% మార్కులు) పొందారు. యూనివర్సిటీ టాపర్ గా ఎపి పబ్లిక్ లైబ్ర్రెరీస్ రిటైర్డ్ డైరెక్టర్ రాఘవరెడ్డి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పిజి డిప్లొమా ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ చేసారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ (80% మార్కులు), డిప్లొమా ఇన్ ఫైనాన్సియల్ మేనెజ్మెంట్ (71.4% మార్కులు) చదివారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కాకినాడ ఆదిత్య కాలేజీ ద్వారా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పూర్తిచేశారు. ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) నుంచి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎం ఎస్ డబ్ల్యు ) 71.2శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుంచి డిస్టింక్షన్‌తో సర్టిఫికెట్ కోర్స్ ఇన్ యోగా (సిసివై) చేసారు.అదే విశ్వవిద్యాలయం నుండి డిస్టింక్షన్‌తో యోగశాస్త్రంలో పీజీ డిప్లొమా చేసారు. స్వామి వివేకానంద యోగ అనుసంధాన సంస్థ నుండి యోగ ఇన్స్‌ట్రక్టర్ సర్టిఫికేట్ లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి యం.కామ్. పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆయన 27/2/2020న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా మీదుగా న్యాయశాస్త్రం (ఎల్.ఎల్.ఎమ్)లో అన్నిబ్రాంచీలకు కలిపి బంగారు పతకం అందుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 20/8/2022 నాడు జరిగిన తదుపరి స్నాతకోత్సవంలో న్యాయశాస్త్రం (ఎల్.ఎల్.ఎమ్)లో అన్నిబ్రాంచీలకు కలిపి ఇచ్చే రెండు బంగారు పతకాలు మరో ఎల్.ఎల్.ఎమ్ కి గాను అందుకున్నారు.

 పుదుచ్చేరి లోని శ్రీ బాలాజీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంలో యోగా థెరపీలో పీహెచ్‌డీ సాధించారు. ఈవిశ్వవిద్యాలయం నుండి ఇదే ప్రథమ యోగచికిత్స పీహెచ్‌డీ. యోగా పీహెచ్‌డీలు దేశంలో ఎందరో ఉన్నా, బహుశా దేశంలో ఇదే మొదటి యోగాథెరపీ పీహెచ్‌డీ కావచ్చును. పాండిచ్చేరిలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ యోగా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుండి యోగా స్టెప్ బై స్టెప్ ద్వారా ఇండియాన్ యోగా అసోసియేషన్ వారి యోగాలో అడ్వాన్స్‌డ్ కోర్స్ సర్టిఫికేట్, గీతానంద నాదయోగాలో మరొక సర్టిఫికేట్ సాధించారు.
Medical: MBBS (1970-75 + 1976) (RMC), MD (Psychiatry) (NIMHANS)

Computer Science & Engineering: MCA, MTech.

Education: BEd, MEd, PhD.

Management & Commerce: M.Com, MBA, DFM.

Law: LLB + LLM, LLM, LLM, LLM, LLM + PhD (Law)

Literature & Journalism: MA (Eng. Litt), MJ, DCE, PGDFE

Psyh. & Social Sciences: MSW, MS (Psychotherapy), MA (Pol. Sci)

Library Sciences: BLISc, MLISC.

Yoga: CCY, YIC, PGDY, ACCY, CPGNY, PhD.(Yoga Therapy)

NPTEL Courses:

CHRF, CBDE, CPSC, CPDB, CSHW, CBL, CIIA, CPNL, CCM, CSS, CCTL, CNB, CSM, CCSF, CSSP, CAHW, CMVE, CSP.

ఐసీయమ్మార్ నుండి యన్‌పీటెల్ ద్వారా హెల్త్ రిసెర్చ్ ఫండమెంటల్స్ లో ఒక సర్టిఫికేట్, ఐఐటీ మద్రాస్ నుండి బయోస్టాటిస్టిక్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్‌పరిమెంట్స్‌లో ఒక సర్టిఫికేట్, పేటెంట్స్ డ్రాఫ్టింగ్‌లో మరొక సర్టిఫికేట్ సాధించారు. ఐఐటీ కాన్పూర్ నుండి ప్రొఫెషనల్ సైంటిఫిక్ కమ్యునికేషన్ లో కోర్స్ టాపర్‌గా సర్టిఫికేట్. ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి సైన్స్ ఆఫ్ హేపినెస్ అండ్ వెల్‌బీయింగ్‌లో సర్టిఫికేట్ పొందారు.
రూర్కీ ఐఐటీ  నిర్వహించిన సిబిఎల్  'బాడీ లాంగ్వేజి సర్టిఫికేట్ కోర్సు' ఎన్. పి టి ఎల్  + ద్వారా 2024ఆగస్టులో పూర్తిచేశారు. ఈదిగువ డాక్టర్ కర్రి రామారెడ్డి చేసిన  NPTEL కోర్సులవివరాలు ఇవ్వబడినవి. [2]
  1. ICMR - N.I.E.
    • Course: Health Research Fundamentals
    • Score: 100%
    • Institution: National Institute of Epidemiology
    • Mode: Through NPTEL
  2. IIT-Madras
    • Course: Biostatistics & Design of Experiments
    • Score: 97%
    • Mode: Through NPTEL
  3. IIT-Kharagpur
    • Course: Science of Happiness & Wellbeing
    • Grade: Elite (69%)
    • Mode: Through NPTEL
  4. IIT-Kanpur
    • Course: Professional Scientific Communication
    • Grade: Elite + Gold (90%)
    • Achievement: Course Topper
    • Mode: Through NPTEL
  5. IIT-Madras
    • Course: Patent Drafting for Beginners
    • Grade: Elite (67%)
    • Mode: Through NPTEL
  6. IIT-Roorkee
    • Course: Body Language – Key to Professional Success
    • Score: 68%
    • Mode: Through NPTEL +
  7. IIT-Kanpur
    • Course: Introduction to Indian Art
    • Grade: Elite (68%)
    • Mode: Through NPTEL
  8. IIT-Roorkee
    • Course: Perspectives on Neurolinguistics
    • Grade: Elite + Silver (81%)
    • Mode: Through NPTEL
  9. IIT-Madras
    • Course: Appreciating Carnatic Music
    • Grade: Elite + Silver (80%)
    • Mode: Through NPTEL
  10. IIT-Roorkee
    • Course: Sociology of Science
    • Grade: Elite + Silver (86%)
    • Achievement: Course Topper
    • Mode: Through NPTEL
  11. IIT-Kanpur
    • Course: Cognition, Transformation
    • Score: 70%
    • Mode: Through NPTEL +
  12. IIT-Kanpur
    • Course: Neurobiology
    • Grade: Elite (61%)
    • Mode: Through NPTEL
  13. IIT-Kharagpur
    • Course: Stress Management
    • Grade: Elite + Gold (96%)
    • Achievement: Course Topper
    • Mode: Through NPTEL
  14. IIT-Roorkee
    • Course: Countering Stage Fright
    • Grade: Elite + Silver (83%)
    • Achievement: Course Topper
    • Mode: Through NPTEL
  15. IIT-Kanpur
    • Course: Soft Skills & Personality
    • Grade: Elite + Silver (85%)
    • Mode: Through NPTEL
  16. IIT-Kharagpur
    • Course: Adolescent Health & Wellbeing
    • Grade: Elite + Gold (91%)
    • Achievement: Course Topper
    • Mode: Through NPTEL
  17. IIT-Kanpur
    • Course: Moral Values & Ethics
    • Grade: Elite + Silver (88%)
    • Achievement: Course Topper
    • Mode: Through NPTEL
  18. IIT-Madras
    • Course: Sports Psychology
    • Grade: Elite + Gold (96%)
    • Achievement: Course Topper
    • Mode: Through NPTEL

చేసిన పదవులు

[మార్చు]

డాక్టర్ రామారెడ్డి ఎన్నో సామాజిక, సాంస్కృతిక, విద్యా, కళా సంస్థలకు పలు పదవులు నిర్వహించారు. ఇంకా చాలా సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు. ప్రెసిడెంట్: (ఆంధ్రకేసరి యువజన సమితి) (2003-2004) ; గౌరవ అధ్యక్షులు: కళా స్రవంతి; గౌరవ అధ్యక్షులు :{అల్లూరి సీతారామరాజు}యువజన సమితి; మాజీ గౌరవ అధ్యక్షులు:`యూత్-ఏ సొసైటీ; గౌరవ అధ్యక్షులు:అరుణోదయ; రాజమండ్రి నగర సంఘ్ చాలక్ : (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్); వైస్ ప్రెసిడెంట్: భారతీయ ఇతిహాస సంకలన సమితి,రాజమండ్రి బ్రాంచ్; వైస్ ప్రెసిడెంట్: కళా దర్బార్; ప్రెసిడెంట్: రాజాజీ కళాపీఠం; ప్రెసిడెంట్: గౌతమి కల్చరల్ అసోసియేషన్; ఎగ్జిక్యూటివ్ మెంబర్: రాజమండ్రి ప్రతిభ ప్రతిష్ఠాన్ అవార్డ్స్ కమిటీ; ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, లోకసత్తా (1999-2004);ప్రెసిడెంట్:సిటిజెన్ ఫోరమ్; స్టేట్ మాజీ ప్రెసిడెంట్: యంగ్ స్టార్స్ అసోసియేషన్; కార్యవర్గ సభ్యులు; రాజమండ్రి కల్చరల్ అకాడమీ (1993-97);ఎగ్జిక్యూటివ్ మెంబర్: శ్రీ పోతుల వీరభద్రరావు ట్రస్ట్; మేనేజింగ్ కమిటీ మాజీ మెంబర్: ఫ్రీ మెటర్నిటీ హోమ్; మాజీ గౌరవ అధ్యక్షులు: గణేష్ నిమజ్జన ఉత్సవ సమితి, రాజమండ్రి; ఆనరరీ ప్రెసిడెంట్: రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్; ప్రెసిడెంట్: శ్రీ మధునాపంతుల మెమోరియల్ ట్రస్ట్ (2015); ప్రెసిడెంట్: నన్నయ సారస్వత పీఠం (2015-); ప్రెసిడెంట్:జన భావన (2015-); ప్రెసిడెంట్: ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ, రాజమండ్రి; సెంట్రల్ జైలు అనధికార విజిటర్(2003-2005) (2018-),గౌరవ అధ్యక్షులు: ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్ని అసోసియేషన్ – గోదావరి చాప్టర్, గౌరవాధ్యక్షులు: అక్షర హిందీ సాహిత్య సంస్థ. గౌరవ సలహాదారు: ఆదికవి నన్నయ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ స్పృహ, అలుమ్ని అసోసియేషన్, గౌరవ సలహాదారు: పద్య వారధి నెలవారీ పత్రిక. గౌరవాధ్యక్షులు: అభ్యుదయ రచయితల సంఘం (తూర్పుగోదావరి జిల్లా) . తూర్పుగోదావరిజిల్లా సంఘ్‌చాలక్, రాస్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.

ఎన్నో పత్రికల్లో రచనలు

[మార్చు]

డాక్టర్ రామారెడ్డి ఎన్నో పుస్తకాల్లో రచనలు చేసారు. స్థానిక పత్రికల మొదలు,జాతీయ - అంతర్జాతీయ మేగజైన్స్ లో ప్రచురిత మవుతున్నాయి. మానసిక సమస్యలు, వర్తమాన రాజకీయాలు, సామాజిక అంశాలు ఇలా ఎన్నో విభిన్న ఘటనలకు సంబంధించి ఈయన రాసిన ఆర్టికల్స్, వ్యంగ్య రచనలు ధారావాహికంగా ప్రచురితమవుతున్నాయి. వివిధ మ్యాగజైన్స్ లో, తెలుగు పత్రికల్లో 4400 ఆర్టికల్స్ రాసారు. {తెలుగు అకాడెమీ} ప్రచురించిన పాపులర్ సైకాలజీ పుస్తకం 'మనిషి -మనసు'; న్యూ విజన్ బుక్స్ ప్రచురించిన సైకాలజీ /సైకియాట్రీ పాపులర్ తెలుగు పుస్తకాలు 'మనలో ఒకరు' 'మనలో మనం' పేరిట ప్రచురించబడ్డాయి. రేడియో టాక్స్, స్టోరీస్, ఫీచర్స్ అండ్ కార్టూన్స్ వీక్లిస్ లో వస్తున్నాయి. డెక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రికలో  ‘మైండ్ మేటర్స్’ పేరిట వీక్లీ కాలమ్ రెండేళ్ల పాటు నడిచింది. `వర్తమాన పద చిత్రాలు’ పేరిట (సమాచారం) దినపత్రికలో ప్రతివారం సిరీస్ గా వస్తున్నాయి. ఈ పత్రికలో 1996 నుంచి నిరాటంకంగా 1016 కార్టూన్ -కామెంట్రీస్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. (సమకాలీన రాజకీయాలపై గోదావరి సాక్షి} సాయంకాలం పత్రికలో 1996 నుంచి నిరంతరాయంగా `మనస్సాక్షి ’ పేరిట ఇంతవరకూ 1320 ఆర్టికల్స్ సోషల్ అండ్ పొలిటికల్ అంశాలపై వచ్చాయి.ఇంకా వస్తున్నాయి. `మనసు పాడింది’ పేరిట శ్రీ సాయి సంధ్య సాయంకాలం పత్రికలో సోషల్, పొలిటికల్ అంశాలకు సంబంధించి 1996నుంచి నిరంతరాయంగా ఇప్పటివరకూ 1350 ఆర్టికల్స్ వచ్చాయి. ఇంకా కొనసాగుతున్నాయి. `సైకో ఫిక్షన్ ’ పేరిట సైకాలజీ టుడే తెలుగు మాస పత్రికలో 1998 నుంచి నిరంతరాయంగా 2020 వరకూ 216 ఆర్టికల్స్ వచ్చాయి. ‘మనో -రాఘవీయం’ పేరిట {“సరికొత్త సమాచారం”) వారపత్రికలో 2015నుంచి కార్టూన్ - వ్యాఖ్య శీర్షిక వస్తోంది. ఇప్పటికి 44, 00 పైన  రచనలు ప్రచురితమయ్యాయి.

అవార్డులు - సత్కారాలు

[మార్చు]

డాక్టర్ రామారెడ్డి ఎన్నో అవార్డులు, పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. 2000 లో `మాన్ అఫ్ ది డికేడ్ ’అవార్డుని సిటిజెన్ ఫోరమ్ నుంచి అందుకున్నారు. వై ఎస్ ఏ నుంచి `లైఫ్ టైం అచీవ్ మెంట్ ' అవార్డు అందుకున్నారు. ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించినందుకు (ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్) నుంచి రీజియన్ లెవెల్లో సమ్మాన్ పత్ర పొందారు. 2000లో ఎస్.బి.ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ నుంచి 'రాజీవ్ విజ్ఞాన్ పురస్కార్' అందుకున్నారు. విజయవాడ ఎక్స్ రే అర్గనైజషన్ నుంచి 'మదర్ థెరెసా' అవార్డు; 2004లో 'కళావాణి' నుంచి గంధం నాగ సుబ్రహ్మణ్యం' అవార్డు అందుకున్నారు. విశ్వ విజ్ఞాన పరిషత్ నుంచి సత్కారం పొందారు. 2005లో ఆంధ్ర ప్రతిభ ప్రతిష్ఠాన్ సంస్థ నుంచి ప్రతిభ వైజయంతిక పురస్కారంతో సత్కారం శ్రీ చిన్నజీయర్ స్వామివారి చేతులమీదుగా పొందారు.2008లో సనాతన ధర్మ పరిషద్ నుంచి సాంకేతిక కళావాచస్పతితో సన్మానం; మహావీర్ విద్యా నికేతన్ నుంచి 'సరస్వతి పుత్ర' టైటిల్ అందుకున్నారు. విభిన్న కోర్సులలో విభిన్న డిగ్రీలు సాధించి ప్రపంచ రికార్డు సాధించినందుకు 2009లో {లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్}లో నమోదయ్యారు. ఇక 2014లో {వండర్ బుక్ అఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్}లో చోటు సాధించారు. 2014లో ఇంటర్నేషనల్ రికార్డు క్రియేటర్ అవార్డు పొందిన ఈయన; స్టేట్ రికార్డ్స్; తెలుగు రికార్డ్స్ లో కూడా అదే ఏడాది నమోదయ్యారు. 2015లో ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో; 2016లో గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ ఫోరమ్ లో చోటు దక్కించుకున్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ నుంచి 2016లో వైద్యరత్న అవార్డుతో సత్కారం పొందారు.కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అండ్ డిగ్రీ కాలేజీ (2017) నుంచి “ఆంధ్ర కలాం ” బిరుదు. సుహృన్మండలి ఆధ్వర్యాన 2017లో “విద్య విభూషణ ” బిరుదుతో సత్కారం. మంగళంపల్లి బాల మురళి కృష్ణ సంగీత సభ నుంచి 2017 లో “పుం -రూప శారద ” బిరుదు, స్పృహ , ది అలుమ్ని అసోసియేషన్ అఫ్ డిపార్ట్మెంట్ అఫ్ సైకాలజీ అఫ్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుంచి 2018లో “పీర్లెస్ ఫిలాసఫర్ ” బిరుదు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2017లో సత్కారం. రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్ చే వాణీ మానసపుత్ర బిరుదు. 2019లో శ్రీరామక్రిష్ణ సేవాసమితి వారిచే స్వామి వివేకానంద జీవితసాఫల్య పురస్కారం. తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం నుంచి ఉగాది పురస్కారం, నారద జయంతి సభ నుంచి నారద జయంతి పురస్కార్ అందుకున్నారు. రాజమహేంద్రవరం పురపాలక సంస్థ వారిచే పౌరసన్మానం. కార్పొరేషన్ అయ్యినతరువాత, ఈపాతికేళ్ళలో కేవలం అయిదుగురికే ఈ సత్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు శ్రీ తమ్మినేని సీతారాం గారి చేతులమీదుగా బాపు విశిష్ట సేవా పురస్కారం 2019 లో లభించింది. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల వారిచే శ్రీ వైయ్యస్ నరసింహారావు స్మారక పురస్కారం ప్రప్రథమంగా వీరికి ఇవ్వబడినది (2022). డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాశ్ స్మారక అవార్డు (2023) ట్రస్ట్ & అధికారభాషాసంస్థ వారిచే ఇవ్వబడింది.

వృత్తిపరంగా సత్కారాలు

[మార్చు]

డాక్టర్ రామారెడ్డి వృత్తి పరంగా సత్కారాలు అవార్డు లందుకున్నారు. 1987.లో జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ రాజమండ్రి శాఖ పక్షాన `అవుట్ ష్టాండింగ్ యంగ్ పర్సన్’అవార్డుతో సత్కారం అందుకున్నారు. ప్రపంచ సైకో సోషల్ పునరావాస భారత చాఫ్టర్ పక్షాన బెంగుళూరులోని నిమ్ హెన్స్ లో 2002లో సత్కారం అందుకున్నారు. గుంటూరులో ఏ.వి. చలపతిరావు మెమోరియల్ ఒరేషన్ అవార్డుతో సర్కారం పొందారు. తెనాలిలో డాక్టర్ సుందరరామయ్య సువర్ణపతక ప్రసంగ పురస్కారం, డాక్టర్ ఉళ్ళక్కి మెమోరియల్ గోల్డ్ మెడల్ ఒరేషన్ సత్కారం, నెల్లూరులో డాక్టర్ ఏనుగు సుందరరామిరెడ్డి ప్రసంగ పురస్కారం, విజయవాడలో డాక్టర్ అప్పారావు ప్రసంగ పురస్కారం అందుకున్నారు. 2021 సంవత్సరానికి గాను, 21 అక్టోబరు 2022 నాడు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా హెల్త్‌కేర్ విభాగంలో రెండు తెలుగురాష్ట్రాలకు గాను సాక్షి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఐకాన్ ఆఫ్ హెల్త్ అవార్డు (2023) మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుగారి చేతులమీదుగా స్వీకరించారు.  

బి.సి.రాయ్ నేషనల్ అవార్డు

[మార్చు]

2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక బి.సి.రాయ్ నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. 2017మార్చి28న న్యూ డిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు. బీసీ రాయ్ అవార్డు 45 సంవత్సరాల చరిత్రలో దేశంలో కేవలం ఆరుగురు మానసికవైద్యులకు మాత్రమే ఈ అవార్డు లభించింది. అవిభక్త/ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీసీరాయ్ అవార్డు లభించిన ఏకైక మానసిక వైద్యుడు ఈయన మాత్రమే! ఇక అదే ఏడాది ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ నుంచి అంత్యంత ప్రతిష్టాత్మక డాక్టర్ డి.ఎల్.ఎన్.మూర్తి అవార్డు అందుకున్నారు. ఈ సంస్థ 75ఏళ్ళ చరిత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి వైద్యుడు ఈయనే. 2018 సంవత్సరానికి ప్రొఫెసర్ జె.కె. త్రివేది లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్ ను తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ నుంచి లక్నోలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ చేతులమీదుగా అందుకున్నారు. అలాగే అత్యంత ప్రతిష్టాత్మక డాక్టర్ బి.సి.బోరా ఆరేషన్ అవార్డును జాతీయస్థాయి అసోసియేషన్ ఆఫ్ ప్రైవేటు సైకియాట్రి నుంచి అందుకున్నారు. ఐ.ఎం.ఎ. నుంచి డైమండ్ జూబిలీ జాతీయస్థాయి ప్రసంగ పురస్కారం, డాక్టర్ ఆర్.కె.మెండా జాతీయ ఆరేషన్ అవార్డ్ ను పొందారు. తమిళ మేగజైన్ "నాం ఉరత్త సింతానై" నుంచి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్, ఫిలాంత్రిక్ సొసైటీ నుంచి కీర్తి పురస్కార్,రాజమండ్రి రౌండప్, ఎడ్యుకేషనల్ స్పెషల్ నుంచి సేవా పురస్కార్ అందుకున్నారు. అదేవిధంగా గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ నుంచి GAPIO లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్ ను అందుకున్నారు. భాస్కర్ మెడికల్ కాలేజి, జెబి ఎడ్యుకేషనల్ సంస్థల నుంచి జె. భాస్కరరావు స్మారక అవార్డ్ శ్రీ చిన్నజీయర్ స్వామివారి చేతులమీదుగా అందుకున్నారు. [3] ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ నుంచి 2018లో సత్కారం. 3వ జాతీయస్థాయి తెలుగు మానసికవైద్యనిపుణుల సమావేశం లో తెలుగు సైకాన్ - 2019 జీవన సాఫల్య పురస్కారం ఇవ్వబడింది. 2020 సంవత్సరానికి ఖమ్మం సైకియాట్రిక్ సొసైటీ వారిచే డాక్టర్ భుజంగరావు స్మారక ప్రసంగ పురస్కారం లభించింది.

వైద్యపరంగా పదవులు

[మార్చు]

డాక్టర్ రామారెడ్డి వైద్య పరంగా పలు సంస్థలకు, పత్రికలకు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కి 1982నుంచి కార్యవర్గ సభ్యునిగా మూడేళ్ళపాటు పనిచేసారు.ఎపి చాఫ్టర్ కి 1985లో ఉపాధ్యక్షునిగా, 1986లో అధ్యక్షునిగా, దక్షిణ భారత విభాగానికి 1994 లో అధ్యక్షునిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన సైకలాజికల్ మెడిసిన్ మేగజైన్ కి 1988నుంచి 1997వరకూ గౌరవ సంపాదకునిగా; ఇండియన్ సైకలాజికల్ మెడిసిన్ మేగజైన్ కి 1988నుంచి 2000వరకూ గౌరవ సంపాదకులుగా, 2003నుంచి 2005వరకూ జర్నల్ కమిటీ సభ్యునిగా; ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఎథిక్స్ కమిటీ, ప్రైవేట్ సైకియాట్రీ కమిటీ, మేరేజ్ & లా కమిటీ లకు కో చైర్మన్ గా, లేక చైర్మన్ గా వ్యవహరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గా 1982లో పనిచేసిన డాక్టర్ రామారెడ్డి, ఐ ఎం ఏ రాజమండ్రి శాఖ అధ్యక్షునిగా 1991-92లో పనిచేసారు. ఇంకా ఎన్నో సంస్థలకు వివిధ పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట మెంటల్ హెల్త్ అధారిటీ సభ్యులుగా నియమించబడ్డారు.

ప్రస్తుతం రాస్తున్న కాలమ్స్, పత్రికలు

[మార్చు]
  • సమాచారం దినపత్రికలో ఆదివారం పదచిత్రాలు
  • రాజమండ్రి సాయంకాల దినపత్రిక సాక్షిలో మనస్సాక్షి ఇప్పటికి వెయ్యికి పైబడిన వ్యాసాలు
  • రాజమండ్రి సాయంకాల దినపత్రిక శ్రీ సాయి సంధ్యలో `మనసు పాడింది’.
  • సరికొత్త సమాచారం వారపత్రికలో 'మనో రాఘవీయం'
  • ఫేస్‌బుక్ లో ప్రస్తుతం 743 ఎపిసోడ్లు పూర్తిచేసుకుని, నీరవధికంగా ప్రతిరోజూ సాగుతున్న "అర్థం - పర్థం" శీర్షిక

మూలాలు

[మార్చు]
  1. Dr. B.C. Roy award for psychiatrist, The Hindu, RAJAMAHENDRAVARAM: OCTOBER 22, 2016 00:00 IST
  2. Dr Karri Rama Reddy sets record by securing 50 degrees
  3. "2017జూలై 1న రాష్ట్రపతి భవన్ లో అందజేత". Archived from the original on 2016-10-22. Retrieved 2017-01-24.

ఇతర లింకులు

[మార్చు]
  1. http://www.business-standard.com/article/pti-stories/psychiatrist-rami-reddi-karri-selected-for-dr-b-c-roy-award-117020500510_1.html
  2. http://www.dnaindia.com/india/report-psychiatrist-rami-reddi-karri-selected-for-dr-b-c-roy-award-2312880
  3. http://www.thehindu.com/news/national/andhra-pradesh/encourage-children-to-express-their-thoughts-parents-told/article7082877.ece http://hdwon.net/video/Dr-Karri-Rama-Reddy-DLN-Murthyrao-Award/UjlJ49ML5Fs[permanent dead link] https://www.questia.com/library/journal/1G1-431997900/marriage-mental-illness-and-law Archived 2017-08-30 at the Wayback Machine
  4. http://ebangla.in/news/mental-illness-cannot-be-ground-for-divorce/[permanent dead link]
  5. http://medind.nic.in/aag/aageb.shtml Archived 2017-04-24 at the Wayback Machine
  6. https://web.archive.org/web/20161107012033/http://issue.emedinews.in/archive/23_10_16.html https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4539879/
  7. https://web.archive.org/web/20170122093134/http://www.ijpm.info/editorialboard.asp
  8. http://www.movika.xyz/video/Dr.%20Karri%20Rama%20Reddy[permanent dead link]
  9. http://www.thehindu.com/news/national/andhra-pradesh/psychiatrist-gets-24th-degree/article8456478.ece
  10. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Jack-of-all-master-of-the-mind/article14790537.ece http://www.thehindu.com/news/national/andhra-pradesh/Dr.-B.C.-Roy-award-for-psychiatrist/article16078426.ece
  11. https://web.archive.org/web/20170412080417/http://www.ramareddykarri.com/
  12. https://web.archive.org/web/20170624014028/http://ramareddykarri.tripod.com/limcabook/
  13. https://www.youtube.com/watch?v=3eg854JFLRA
  14. https://www.thehansindia.com/andhra-pradesh/rajamahendravaram-psychiatrist-dr-karri-rama-reddy-receives-his-31st-degree--587467
  15. https://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2018-12-27/Psychiatrist-Karri-Rama-Reddy-gets-PhD-on-student-behaviour/465067
  16. https://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2018-07-02/City-doctor-gets-gold-medal-in-BLIS/394263
  17. https://www.thehansindia.com/posts/index/Amaravati-Tab/2018-02-07/DLN-Murthi-Award-presented-to-Rama-Reddy/357323
  18. https://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2019-02-04/JK-Trivedi-award-to-city-doctor/487549
  19. https://www.thehansindia.com/andhra-pradesh/rmc-honours-3-president-of-india-awardees-542517?fromNewsdog=1&utm_source=NewsDog&utm_medium=referral